కాస్ట్లీ రోల్స్‌ రాయిస్‌ కారులో పెళ్లి మండపానికి కార్తీక.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.!!

'జోష్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ఆ తర్వాత తమిళ్‌ డబ్బింగ్‌ సినిమా 'రంగం'తో సూపర్‌ హిట్‌ను అందుకున్న నటి కార్తీక నాయర్‌.. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు కార్తీక(Karthika Nair) పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త పెళ్లి కూతురు ఖరీదైన కారులో తళుక్కుమన్నారు.

1980, 90 లలో సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన అందాల తార, నటి రాధ కుమార్తె కార్తీక నాయర్‌(Karthika Nair Wedding). చిరంజీవికి రాధ జోడిగా పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో రాధ కుమార్తె కార్తీక వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లిలో మరో ప్రత్యేక ఆకర్షణగా రోల్స్‌ రాయిస్‌ కారు నిలిచింది.

Karthika-In-Rolls-Royce-Ghost

కార్తీక నాయర్‌ తన వివాహ వేడుకలో ఖరీదైన, లగ్జరీ రోల్స్ రాయిస్ కారు(Rolls Royce Ghost)లో మెరిసింది. కాగా ఈ కారును సొంతం చేసుకోవాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. రూ. 8 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో కార్తీక పెళ్లి మండపం వద్దకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖలందరి వద్ద ఈ రోల్స్‌ రాయిస్‌ కారు ఉంది.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ ఎస్‌యూవీ 6.75L ట్విన్ టర్బో V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 571PS పవర్ వద్ద 850Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

Karthika-In-Rolls-Royce-Ghost

రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 1300 వాట్స్ ఆడియో సిస్టమ్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఇల్యూమినేటర్ డ్యాష్‌బోర్డ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో విజన్ అసిస్ట్, డే-నైట్ వార్నింగ్, పాదచారుల హెచ్చరిక, ఫోర్ కెమెరా, వై-ఫై హాట్ స్పాట్, సెల్ఫ్ పార్క్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారు టాప్‌ వేరియంట్‌ ధర రూ. 7.95 కోట్లుగా ఉంది. అందుకే ఈ కారు ఎక్కువగా సెలబ్రిటీలు, ధనవంతుల సొంతం. ఇలాంటి ఖరీదైన కారులో నటి కార్తీక పెళ్లి మండపానికి వెళ్లడంతో వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కార్తీక వివాహానికి సినీ ప్రముఖులు కూడా విలాసవంతమైన కార్లలో వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Karthika-In-Rolls-Royce-Ghost

కార్తీక వివాహం కేరళలోని తిరువనంతపురంలో రోహిత్ మీనన్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కార్తీక పోస్ట్ చేశారు. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు చిరంజీవి దంపతులు, జాకీ ష్రాఫ్‌, రాధికా శరత్‌కుమార్‌, సుహాసినీ మణిరత్నం, రేవతి, మేనక తదితరులు ఈ వేడుకలో మెరిశారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 23, 2023, 19:03 [IST]
English summary
Actress karthika nair arrived in rolls royce ghost suv for her wedding occasion
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+