సినిమా బోల్తా కొట్టినా కియారా మాత్రం హిట్.. అందుకు అమ్మడి లగ్జరీ కారే ప్రూఫ్..
భారత్‌లో లగ్జరీ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చాలామంది ధనవంతులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎక్కువగా కోట్లు ఖర్చు చేసి మార్కెట్లోకి కొత్తగా విడుదలయ్యే టాప్ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో చాలా మంది సినితారలు ఇలాంటి వాటితో కనిపిస్తున్నారు. తాజాగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ప్రముఖ నటి కియారా అద్వానీ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఖరీదైన లగ్జరీ కారు మేబ్యాక్ S-క్లాస్ లిమోసిన్ కారుతో కనిపించారు. ఈ కారుకు దేశంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఇది ప్రముఖుల దగ్గర ఉంది. ఇటీవల విడుదల అయిన గేమ్ ఛేంజర్ మూవీలో నటించిన కియారా కోట్లు విలువ చేసే కారుతో కనిపించగా, తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
భారత్‌లో ఉన్న ధనంతులలో మెర్సిడెస్ బెంజ్ కార్లకు ప్రముఖమైన స్థానం ఉంటుంది. కియారా వద్ద ఉన్నటువంటి మేబ్యాక్ S-క్లాస్‌కు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రారంభ ధర రూ.2.77 కోట్లు ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్ రోడ్ అయితే ఏకంగా రూ.3.47 కోట్ల వరకు ఉంటుంది. దీనిలో టాప్ వేరియంట్ ప్రారంభ ధర రూ.3.48 కోట్లు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. అదే ఆన్‌రోడ్ రూ.4.35 కోట్లు ఉంటుంది.

వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న కియారా ఇంత భారీ ధర కలిగిన కారును కొనుగోలు చేయడం విశేషం. తన ఖరీదైన కారుతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా ఉంది. కోట్లు ఖరీదు చేసే కారు కాబట్టి దీనిలో అన్ని లగ్జరీ ఫీచర్స్ ఉంటాయి. మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ లిమోసిన్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 4.0-లీటర్ , 6.0-లీటర్ ఇంజిన్లను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన ఇంజిన్.
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇంజిన్‌కు జత చేయబడి ఉంది. ఈ లగ్జరీ బెంజ్ కారు టాప్ స్పీడ్ 250 కిమీలు. ఇది కేవలం 4.8 సెకన్లలో 0 నుండి 100 kmph నుండి వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ చూసినట్లయితే చాలా అందంగా, ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కారు లోపల ప్రయాణికుల కోసం అందమైన థీమ్ ఉంటుంది. క్యాబిన్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా అనిపిస్తుంది.

డ్రైవర్ సీటు, ముందు, వెనుక వరుస సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ముఖ్యంగా వెనుక వరుస సీట్లు మసాజ్, మెమరీ ఫంక్షన్‌తో కూడి ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ కారు అందాన్ని రెట్టింపు చేస్తుంది. హెడ్స్-అప్ డిస్‌ప్లే, 3D డ్రైవర్ డిస్‌ప్లే, ముందు, వెనుక కూర్చున్న వారికి అనువుగా ఉండటానికి వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్‌లు కూడా ఉన్నాయి. కారులో ప్రయాణికుల రక్షణకు సంబంధించి అత్యుత్తమైన సేఫ్టీ ప్రమాణాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించింది. కియారా అద్వానీ వద్ద ఈ కొత్త కారు మాత్రమే కాకుండా ఇతర టాప్ బ్రాండ్‌లకు చెందిన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. BMW 530d,మెర్సిడెస్-బెంజ్ E-క్లాస్, BMW X5 వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








