కొత్త లగ్జరీ కారు కొన్న 'కృతి సనన్'; ధర రూ. 2.43 కోట్లు

సాధారణంగా సెలబ్రెటీలకు లగ్జరీ కార్లపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. మార్కెట్లో విడుదలైన దాదాపు కొత్త కొత్త లగ్జరీ కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటారు. మనం ఇది వరకే చాలామంది సెలబ్రెటీలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి తెలుసుకున్నాం. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్' కొత్త Mercedes Maybach GLS 600 (మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్600) కారుని కొనుగోలు చేసిన సంగతి అందరికి తెలుసు.

ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి 'కృతి సనన్' కూడా కొత్త Mercedes Maybach GLS 600 కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

2014 లో మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో తెలుసు సినీరంగ ప్రవేశం చేసిన 'కృతి సనన్' ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ఆది పురుష్‌' చిత్రంలో కూడా నటిస్తుంది. కృతి సనన్ కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

ఇక కృతి సనన్ కొనుగోలు చేసిన Mercedes Maybach GLS 600 SUV విషయానికి వస్తే, మెర్సిడెస్ బెంజ్ యొక్క మేబాచ్ మోడల్ ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రూ. 2.43 కోట్ల ధరతో ప్రారంభించబడింది. 2021 కి 50 యూనిట్లు మాత్రమే కేటాయించబడ్డాయి. మెర్సిడెస్ బెంజ్ 2022 లో షెడ్యూల్ చేయబడిన యూనిట్ల కోసం రెండవ దశ బుకింగ్‌ను ప్రారంభించింది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

కొత్త మెర్సిడెస్-మేబాచ్ GLS 600 లగ్జరీ SUV మోడల్‌లో ఒకే ఒక వేరియంట్ ఉంది, కానీ కస్టమర్ డిమాండ్ ప్రకారం 4-సీటర్ లేదా 5 సీటర్ మోడల్స్ కొనుగోలు చేయవచ్చు. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

మేబాచ్ GLS 600 అత్యంత అధునాతన సదుపాయాలు కలిగిన కార్ల శ్రేణిలో ఒకటిగా నిలుస్తుంది. అధునాతన సాంకేతికత మరియు అనేక సాంకేతిక సౌకర్యాలు ఇందులో ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి. ఇది ఇంటీరియర్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

ఈ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, ‘మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

ఈ కారులోని ప్రతి సీటులో వెంటిలేటర్ మరియు మసాజ్ ఫంక్షన్ ఉంటాయి, ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ ప్రతి సీటులో ఉంటాయి. వెనుక భాగంలో రిఫ్రిజిరేటర్ కూడా ఉంది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 లో 12.3 ఇంచెస్ ఎంబియుఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మీస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్, డాష్‌బోర్డ్‌లో నాప్ప లెదర్ వంటివి కూడా ఉన్నాయి. దీనికి లేటెస్ట్ మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇవ్వబడింది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్ మరియు ప్రీ-సేఫ్ సిస్టమ్ ఇవ్వబడ్డాయి. వీటితో పాటు పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, మసాజ్ సీట్ మరియు రిఫ్రిజిరేటర్ వంటివి ఉన్నాయి.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌ ఉంటుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్‌తో జతచేయబడుతుంది.

కొత్త లగ్జరీ కారు కొన్న కృతి సనన్; ధర రూ. 2.43 కోట్లు

ఎస్‌యూవీ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ బరువు మొత్తం 3,250 కిలోలు. అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉన్నందున దేశీయ మార్కెట్లో ఈ కొత్త లగ్జరీ కారుకి విపరీతమైన డిమాండ్ ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, September 13, 2021, 14:22 [IST]
English summary
Actress kriti sanon buys new mercedes maybach gls 600 suv check here details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+