హీరోయిన్ స్టైల్‌కి మైండ్ బ్లోయింగ్ రేంజ్! కోట్ల విలువైన కారుతో అదిరిపోయే ఎంట్రీ
తన సొగసైన నటనతో, అందమైన వ్యక్తిత్వంతో, స్టైలిష్ లుక్‌లతో భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కృతి సనన్ (krtit Sanon) గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ అందగత్తె 2014లో తెలుగు ప్రేక్షకుల ముందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన నేనొక్కడినే చిత్రంతో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వరుస విజయాలతో ముందుకు సాగింది. ప్రస్తుతం ఆమెకు 11 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణం ఉంది. నటనతో పాటు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, కార్లపై ఆమెకు ఉన్న ఆసక్తి కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది
తాజాగా కృతి ఒక లగ్జరీ కారుతో రోడ్లపై దర్శనమివ్వగా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెర్సిడెస్-బెంజ్ బ్రాండ్‌కు చెందిన ఆ విలాసవంతమైన కారు ధర, ఫీచర్లు గురించి ఆటోమొబైల్ ప్రేమికులు, నెట్‌జన్లు చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఆమె కార్లకు ఎంతగా అభిమానిని అంటే, లగ్జరీ వాహనాలను సేకరించడం ఆమెకు ఒక ప్యాషన్‌లాంటిది. కృతికి ఉన్న ఈ స్టైల్ సెన్స్, క్లాస్ టేస్ట్, ఎలిగెంట్ ఛాయిస్ ప్రతి సారి మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది.

కృతి సనన్ ఇటీవల కనిపించిన కారు సాధారణ లగ్జరీ వాహనం కాదు, అది మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ GLS 600, భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రీమియమ్ SUVలలో ఒకటి. ధర సుమారు రూ. 2.43 కోట్లు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇది ఎలైట్ క్లాస్‌కి మాత్రమే అందుబాటులో ఉండే అత్యద్భుతమైన లగ్జరీ, పవర్‌ఫుల్ SUVగా పేరుగాంచింది. మెర్సిడెస్ ఈ మోడల్‌లో అందించిన ఇంజిన్ సెటప్ చూడగానే దాని శక్తి ఎంత ఉందో అర్థమవుతుంది.
ఇందులో ఉన్న 4.0-లీటర్ బై-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ 550 bhp శక్తిని, 730 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జత చేశారు, ఇది రోడ్డు మీద అత్యంత మృదువైన కానీ శక్తివంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఇదే కాకుండా, ఈ SUVలో ఉన్న మెర్సిడెస్ 4MATIC డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ వల్ల ఎలాంటి రోడ్డు పరిస్థితుల్లోనైనా అద్భుతమైన కంట్రోల్, పనితీరు లభిస్తుంది.

సొగసైన డిజైన్, సాఫ్ట్ సస్పెన్షన్, లగ్జరీ కంఫర్ట్‌ను కలిపిన ఈ కారు నిజంగా రోలింగ్ ప్యాలెస్. పనితీరు పరంగా చూసుకుంటే, మేబ్యాక్ GLS 600 SUV కేవలం 4.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని చేరుతుంది. గరిష్టంగా 250 కిమీ/గం వేగం అందుకోవడం దీని అసాధారణ శక్తికి నిదర్శనం. ఇలాంటి ఫీచర్లతో కృతి సనన్ లాంటి స్టైలిష్ స్టార్‌కి ఈ కారు నిజంగా సరిపోయే చాయిస్‌నే చెప్పాలి.
బయటి నుంచే కాకుండా లోపల కూడా చాలా అందంగా ఉంటుంది. వెంటిలేటెడ్ మసాజింగ్ సీట్లు, షాంపైన్ బాటిళ్లను పెట్టుకోవడానికి రిఫ్రిజిరేటర్ కోసం స్థలంతో కూడిన స్థిర సెంటర్ కన్సోల్ యూనిట్ కూడా ఉన్నాయి. 4-సీట్ల వాహనంలో నప్పా లెదర్ అప్హోల్స్టరీ, ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్ కారుకు అదిరిపోయే లగ్జరీ లుక్‌ను తీసుకొస్తుంది. లోపల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం రెండు 12.3-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి.

ఇంకా కారు ఇంటీరియర్‌లో ఆటోమేటిక్‌గా ఎక్స్‌టెండింగ్ సైడ్ స్టెప్స్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇన్-కార్ ఫంక్షన్‌లను నియంత్రించడానికి రియర్-సీట్ టాబ్లెట్, 360-డిగ్రీ కెమెరా, బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్, రియర్ సీట్లు, యాక్టివ్ డిస్టెన్స్ అసిస్ట్ డిస్ట్రోనిక్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి అదనపు ఫీచర్లతో కూడా వస్తుంది.


Click it and Unblock the Notifications








