BMW కారును కొనుగోలు చేసిన నటి మమతా మోహన్‌దాస్‌.. ఈ కారులో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా?

మమతా మోహన్‌దాస్‌ పరిచయం అవసరం లేని పేరు. కొన్ని సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్నారు. మంచి పాత్రలలో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. తాజాగా నటి మమతా మోహన్‌దాస్‌ (Actress Mamta Mohandas) సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇది రోడ్‌స్టర్‌ మోడల్‌గా తెలుస్తోంది. అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది.

మమతా మోహన్‌దాస్‌ బీఎండబ్ల్యూ Z4 M40i (BMW Z4 M40i) కారును కొనుగోలు చేశారు. ఈ BMW లగ్జరీ కారు గత సంవత్సరం మే నెలలో భారత్‌ మార్కెట్లో విడుదల అయింది. బీఎండబ్ల్యూ సంస్థ ఈ కారును జర్మన్‌ నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తోంది. ఈ కారు స్కై స్క్రాపర్‌ గ్రే మరియు పోర్టిమావో బ్లూ రంగులు సహా మొత్తం 7 రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

mamta mohandas buys bmw car

ఈ వాహనం ధర రూ.83.30 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఓపెన్‌ టాప్ టూ సీటర్‌ రోడ్‌స్టర్‌ గా అందుబాటులోకి వస్తుంది. మొత్తంగా ఈ కారు మరియు ఇన్సూరెన్స్‌తో కలిపి రూ.1.16 కోట్లు ఆన్‌రోడ్‌ ధరగా ఉంది. నటి మమతా మోహన్‌దాస్‌ మోటాలిక్‌ రంగు మోడల్‌ను ఎంచుకున్నారు.

వీడియో షేర్ చేసిన నటి : ఇప్పటికే మమతా గ్యారేజీలో ఇప్పటికే లగ్జరీ కార్లు ఉండగా తాజాగా బీఎండబ్ల్యూ Z4 M40i కూడా అందులో చేరింది. ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలను నటి తన సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Actress mamta mohandas car collection

4.5 సెకన్లలోనే 0-100 కి.మీ వేగం : బీఎండబ్ల్యూ Z4 M40i కారు 3.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 340 bhp శక్తి, 500Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. ఈ కారు గరిష్ఠంగా 250 కి.మీ వేగంతో ప్రయాణం చేస్తుంది. మరియు కేవలం 4.5 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

డిజైన్ పరంగా : ఈ బీఎండబ్ల్యూ Z4 M40i వాహనం సరికొత్త గ్రిల్‌, LED హెడ్‌లైట్లు, వీల్‌ ఆర్చ్‌లు, పొడవైన బానెట్‌ సహా పెద్ద ఎయిర్‌ ఇన్‌లెట్‌లు ఈ కారు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. కొనుగోలు సమయంలో మిర్రర్ క్యాప్స్‌, ఎగ్జాస్ట్‌ సిస్టమ్‌, సిరియం గ్రే పెయింటెడ్ అదనంగా సంస్థ అందించింది.

bmw Z4 M40i

10 సెకన్లలోనే : బీఎండబ్ల్యూ Z4 M40i ఓపెన్‌టాప్‌ స్పోర్ట్స్‌ మోడల్‌ 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్ టాప్‌ ఒక్క బటన్‌ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. కేవలం 10 సెకన్లలోనే తెరుచుకుంటుంది. మరియు ఈ కారు మెరుగైన ఇంటీరియర్‌తో వస్తుంది. ఆకట్టుకొనే అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

బీఎండబ్ల్యూ 7.0 వెర్షన్‌తో కూడిన 10.25 అంగుళాల హై రిజల్యూషన్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 10.25 అంగుళాల డ్రైవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 3D మ్యాప్‌లతో కూడిన GPS సిస్టమ్‌, బీఎండబ్ల్యూ లైవ్‌ కాక్‌పిట్‌, ఆపిల్‌ కార్‌ ప్లే, పార్కింగ్ మరియు డ్రైవింగ్‌ అసిస్టెంట్‌ ఫంక్షన్‌ కూడా ఉంది. ఆటో స్టార్ట్‌- స్టాప్‌, బ్రేక్‌ ఎనర్జీ రిజనరేషన్‌ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

mamta mohandas adds bmw Z4 M40i sports car to her garage

సేఫ్టీ ఫీచర్లు : ఈ బీఎండబ్ల్యూ Z4 M40i కారులో ఎకో ప్రో, కంఫర్ట్‌, స్పోర్ట్‌ వంటి మూడు డ్రైవింగ్‌ మోడ్‌లను కూడా ఉన్నాయి. మరియు కీలకమైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఫ్రంట్‌ మరియు సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్‌ అసిస్ట్‌తో కూడిన ABS, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ ఇమ్మబిలైజర్‌ మరియు క్రాష్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, February 9, 2024, 12:31 [IST]
English summary
Actress mamta mohandas adds bmw z4 m40i sports car to her garage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+