ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

సాధారణంగా సెలబ్రెటీలు, క్రికెటర్లు ఎక్కువగా లగ్జరీ కార్లను మరియు బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే, అయితే ఇందులో కేవలం పురుషులు మాత్రమే కాకుండా, స్త్రీలు కూడా తమదైన రీతిలో లగ్జరీ వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విభాగంలో ప్రముఖ మలయాళీ నటి 'మమతా మోహన్ దాస్' ముందు ఉంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

మమతా మోహన్ దాస్ మలయాళీ నటి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకుంది, కావున తెలుగులో కూడా ఈమెకు ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. మమతా మోహన్ దాస్ ఇటీవల ఒక ప్రముఖ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. మమతా మోహన్ దాస్ కొనుగోలు చేసిన ఈ కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

ఇటీవల "మమతా మోహన్ దాస్" సరికొత్త Porsche 911 Carrera S (పోర్స్చే 911 కారెర్రా ఎస్) కొనుగోలు చేసినట్లు తెలిసింది. Porsche అనేది లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో పేరుమోసిన బ్రాండ్. ఇది ప్రపంచ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. Porsche 911 Carrera S స్పోర్ట్స్ కారుని కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటి 'మమతా మోహన్ దాస్'.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

'మమతా మోహన్ దాస్' కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ మరియు ప్రొడ్యూసర్ కూడా. ఈమె రాజమోళి దర్శకత్వంలో యమదొంగ సినిమాలో నటించి బాగా పాపులర్ అయ్యింది. అంతే కాకుండా తెలుగులో కృష్ణార్జున మరియు హోమం వంటి సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలో బాగా పేరు తెచ్చుకుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

అయితే ఇప్పుడు 'మమతా మోహన్ దాస్' కొనుగోలు చేసిన కొత్త Porsche 911 Carrera S కారుకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక్కడ మమతా మోహన్ దాస్ కొనుగోలు చేసిన సరికొత్త ఎల్లో కలర్ Porsche 911 Carrera S చూడవచ్చు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక్కడ Porsche 911 Carrera S కారుని మమతా మోహన్ దాస్ తన తల్లిదండ్రులతో కలిసి డెలివరీ తీసుకుంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

మమతా మోహన్ దాస్ కొన్న ఈ కొత్త Porsche 911 Carrera S కారు న్ని సంవత్సరాల క్రితం భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. ఇది అతి తక్కువ కాలంలోనే బాగా ప్రజాదరణ పొందగలిగింది. Carrera S అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటి. ఈ కారు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

Porsche 911 Carrera S స్పోర్ట్స్ కారు 3.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 450 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. ఇది వెనుక చక్రాలకు శక్తిని పంపుతుంది. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో 0-100 కిమీ / గం చేరుకుంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

డిజైన్ పరంగా Porsche 911 Carrera S అద్భుతంగా మరియు చాలా స్పోర్టిగా ఉంటుంది. ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ తో లార్జ్ ఓవల్ ఆకారపు హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్ దిగువన ఫ్లాప్‌లు ఉన్నాయి, అవి శీతలీకరణ అవసరం లేనప్పుడు మూసివేయబడతాయి. ఇది కారు ఏరోడైనమిక్‌ను మెరుగుపరుస్తుంది. వెనుకవైపు, LED టెయిల్ ల్యాంప్స్ కనెక్ట్ చేసే LED బార్ ఉంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

ఈ కారు ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్ మరియు వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ప్రామాణికంగా వస్తాయి. పోర్షే 911 కారెరా ఎస్ మంచి పనితీరుని అందిస్తోంది. పోర్షే 911 కారెర్రా ఎస్ లోని క్యాబిన్ ప్రీమియం డాష్‌బోర్డ్‌తో వస్తుంది. ఈ లగ్జరీ కారు లోపలి భాగంలో విశాలమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అనలాగ్ టాకోమీటర్‌తో డిజిటల్ ఇన్‌స్టాలర్ క్లస్టర్, ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ మరియు అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

Porsche 911 Carrera S అనేది 2 డోరీ స్పోర్ట్స్ కారు, ఇందులో నలుగురు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే వెనుక సీటులో పెద్దవారు కూర్చోవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇతర స్పోర్ట్స్ కార్ల మాదిరిగానే, పోర్షే 911 కారెర్రా కూడా ఒక విలాసవంతమైన మరియు ఖరీదైన కారు.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న యమదొంగ బ్యూటీ.. దీని ధర అక్షరాలా..

కొత్త Porsche 911 Carrera S కారు ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ. 1.84 కోట్లు. ఈ లగ్జరీ స్పోర్ట్స్ కారుని మమతా మోహన్ దాస్ కాకుండా, మలయాళీ అరుదు దుల్కర్ సల్మాన్ కలిగి ఉన్నాడు. యితడు ఆ కారులో చాలా సార్లు గుర్తించబడ్డాడు. మమతా మోహన్ దాస్ ఈ మధ్య కాలంలో హార్లీ డేవిడ్సన్ బైక్ రైడ్ చేస్తూ కూడా కనిపిచింది. దీన్ని బట్టి చూస్తే మమతా మోహన్ దాస్ కి లగ్జరీ కార్లు మరియు బైకులపైన ఎంత ఆసక్తి ఉందో మనకు తెలుస్తుంది.

Most Read Articles

English summary
Actress mamta mohandas gifts herselft porsche carrera s sports car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X