ఖరీదైన అడ్వెంచర్ బైకుపై ప్రముఖ నటి.. ఫోటోలు చూశారా?

బైకులు, కార్లు నడపడం సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా చాలా ఇష్టమే. ఈ కారణంగానే కొందరు సెలబ్రిటీలు సమయం దొరికినప్పుడు తమకు నచ్చిన బైకులు, లేదా కార్లలో చక్కర్లు కొడుతూ ఉంటారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ప్రముఖ మలయాళీ నటి మంజు వారియర్ (Manju Warrier). గత ఏడాది ఈమె సుమారు రూ. 23 లక్షల విలువైన అడ్వెంచర్ బైక్ కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు ఈ బైకుపై కనిపించే ఈమె.. మరోసారి ఆఫ్ రోడ్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నటి మంజు వారియర్ తన బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ (BMW R1250 GS) అడ్వెంచర్ బైకుపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఫాలింగ్, మడింగ్ అండ్ స్టిల్ లర్నింగ్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Manju Warrier Goes Off Roading

ఫోటోలను గమనిస్తే.. ఆఫ్ రోడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలోనే బహుశా కిందపడినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బైక్ యొక్క క్రాష్ గార్డు మరియు ఇంజిన్ కవర్ వాటిపై మట్టి ఉండటం చూడవచ్చు. అయితే వారియర్ ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే డ్రెస్ ధరించి ఉంది. మొత్తానికి తాను ఆఫ్ రోడింగ్ చేయడానికి సన్నద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక ఖరీదైన బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ బైక్ విషయానికి వస్తే.. ఇది పరిమాణంలో చాలా పెద్ద బైక్ అని తెలుస్తోంది. ఇది 1245 సీసీ ట్విన్ సిలిండర్ బాక్సర్ ఇంజిన్‌తో నడిచే అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్. ఇంజిన్ 7750 rpm వద్ద 134 Bhp పవర్ మరియు 6250 rpm వద్ద 143 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Manju Warrier Goes Off Roading

నిజానికి నటి 'మంజు వారియర్'కు అడ్వెంచర్ చేయడం అంటే చాల ఇష్టం. ఈ కారణంగానే ఈ ఖరీదైన బైక్ కొనుగోలు చేసింది. బైక్ రైడింగ్ చేయడానికి ఈమె 44 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. గత కొన్ని రోజులకు ముందు నటుడు అజిత్ కుమార్‌తో షూటింగ్ సమయంలో బైక్ రైడ్ కోసం వెళ్ళింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అజిత్ కుమార్‌తో కలిసి మంజు వారియర్ పర్వతాలలో బైక్ ట్రిప్‌కు వెళ్లారు. ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత బీఎండబ్ల్యూ బైక్ కొన్నారు. బైక్ కొన్న తర్వాత ఈమె ఇతర నటీనటులతో కలసి రైడ్ చేస్తూ తరచూ రోడ్డుపై కనిపిస్తుంటారు. బైక్‌ను కొనుగోలు చేసిన కొన్ని నెలల తర్వాత.. మంజు వారియర్ కొచ్చి వీధుల్లో తురుగుతున్న చిత్రాలను పోస్ట్ చేశారు. ఇందులో నటుడు సౌబిన్ షాహిర్ కూడా ఉన్నారు.

నటుడు సౌబిన్ షాహిర్ కూడా అదే సమయంలో బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్ ట్రోఫీ ఎడిషన్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేశాడు. మలయాళ సినీ పరిశ్రమలు ఖరీదైన బైకులు మరియు కార్లను కలిగి ఉన్నవారు చాలామందే ఉన్నారు. కాగా నటి మంజు వారియర్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ బైక్ కాకుండా మినీ కూపన్ ఎస్ఈ, మారుతి బాలెనొ మరియు రేంజ్ రోవర్ వంటి కార్లను కలిగి ఉన్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, July 6, 2024, 12:00 [IST]
English summary
Actress manju warrier goes off roading in bmw r1250 gs bike
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+