భర్తతో కలిసి లగ్జరీ కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
ఖరీదైన లగ్జరీ కార్లను సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని గతంలో చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం. ఇలాంటి మరో ఘటనే ఇప్పుడు కూడా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ నటి రూ. కోట్ల ఖరీదైన కారు కొనుగోలు చేసింది.
ప్రముఖ నటి మరియు యాంకర్ 'మోనా సింగ్' ఇటీవల సరికొత్త 'మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ' (Mercedes Benz GLE) కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నటి.. తన తండ్రి మరియు భర్తతో కలిసి కారు డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. డీలర్‌షిప్ సిబ్బంది వారికి కారు కీ ఇవ్వడం ఇందులో చూడవచ్చు.

సుమారు రూ. 1 విలువైన ఈ కారును డెలివరీ తీసుకునే సమయంలో నటి.. భర్తతో కలిసి ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు. అంతే కాకుండా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. నిజానికి సినీ తారలు బెంజ్ కార్లు కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చాలామంది.. చాలా సందర్భాల్లో కార్లను కొనుగోలు చేశారు. ఎక్కువమంది సెలబ్రిటీల మొదటి ఎంపిక బెంజ్ కారు కావడం గమనించదగ్గ విషయం.
ఇక మోనా సింగ్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి ఉండటం గమనించవచ్చు. అయితే ఈమె ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనేదానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ఈ కారు సోడలైట్ బ్లూ రంగులో చూడచక్కగా ఉంది. ఇది అత్యాధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది.

బెంజ్ కంపెనీ ఈ జీఎల్ఈ SUVలు జీఎల్ఎస్ మరియు జీఎల్సీ మధ్యలో ఉంటాయి. భారతీయ మార్కెట్లో జీఎల్ఈ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. అవి జీఎల్ఈ 300డీ, జీఎల్ఈ 400డీ మరియు జీఎల్ఈ 450 వేరియంట్లు. వీటి ధరలు రూ. 91 లక్షల నుంచి రూ. 1.08 కోట్ల వరకు ఉంటుంది. కాబట్టి ఖరీదైన కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కూడా ఒకటి.
2024 మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మూడు ఇంజిన్ ఎంపికలను పొందుతుంది. ఎంట్రీ లెవెల్ జీఎల్ఈ 300డీ మోడల్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 241 బీహెచ్‌పీ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. జీఎల్ఈ 400డీ మోడల్ 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 326 బీహెచ్‌పీ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

చివరగా టాప్ మోడల్ జీఎల్ఈ 450 కారు 3.0 లీటర్ ఇన్‌లైన్ సిక్స్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 362 బీహెచ్‌పీ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. నటి మోనా సింగ్ ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగిన కారును కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే అన్ని మోడల్స్ మంచి పనితీరును అందిస్తాయని తెలుస్తోంది.
మంచి డిజైన్ కలిగిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ మంచి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటితో పాటు.. ఫోర్ జోన్ ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 13 స్పీకర్లతో కూడిన 590 వాట్స్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ మరియు హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








