పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
ఆధునిక కాలంలో కొంతమంది సెలబ్రిటీలు లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా సాధారణ కార్లను కూడా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ కన్నడ నటి 'నమ్రత గౌడ' అత్యంత సరసమైన ఎంజీ మోటార్స్ యొక్క కామెట్ ఈవీ కొనుగోలు చేసింది.
కన్నడ బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ మరియు సీరియల్ నటి నమ్రత గౌడ ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా విలాసవంతమైన లగ్జరీ కారు కాకుండా.. దేశీయ మార్కెట్లో అత్యంత సరసరమైన ఎంజి కామెట్ (MG Comet EV) ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కొత్త కారు కొనుగోలు చేసిన నమ్రతకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఎంజి కామెట్ ఈవీ అనేది నమ్రత గౌడ యొక్క రెండో కారు. నిజానికి భారతీయ మార్కెట్లో ఎంజి కామెట్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్. వీటి ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.24 లక్షల మధ్య ఉంటుంది. 2 డోర్స్ కలిగిన ఈ కారులో నలుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
మంచి డిజైన్ కలిగిన ఎంజి కామెట్ ఈవీ క్యాండీ వైట్ & స్ట్రార్రీ బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లో మాత్రమే కాకుండా.. స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్ మరియు క్యాండీ వైట్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చిన్న కుటుంబాలకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది.

కొత్త ఎంజి కామెట్ ఈవీ 17.3 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ రియర్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో ఏకంగా 230 కిమీ రేంజ్ అందిస్తుంది.
చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఎంజి కామెట్ ఈవీ రేంజ్ ఎక్కువ ఇవ్వడం వల్ల సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు 3.3 kW ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి పట్టే సమయం 7 గంటలు. అయితే 7.4 kW ఛార్జర్ ద్వారా 3.5 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోగలదు.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎంజి కామెట్ ఈవీ 10.25 ఇంచెస్ స్క్రీన్ పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు 55కి పైగా కార్ కనెక్టెడ్ ఫీచర్స్ మరియు కీలెస్ ఎంట్రీ వంటివి లభిస్తాయి. డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








