రూ.50 కోట్లతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన నయనతార.. జెట్ లోపల సౌకర్యాలు చూస్తే మతిపోవాల్సిందే!!
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్లలో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారనడంలో సందేహం లేదు. ఇరవై ఏళ్లుగా సినీ రంగంలో తన జోష్ ఎక్కడా తగ్గలేదు. పెళ్లి అయిన తర్వాత కూడా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో నయన్ ప్రైవేట్ జెట్(Private Jet) కొన్నట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగు, మళయాళం, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తున్న నయన్.. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Sharukh Khan)తో కలిసి జవాన్(Jawan) చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ప్రైవేట్ జెట్‌తో పాటు నయన్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం జవాన్(Jawan Movie) సక్సెస్ ఖుషీలో ఉన్న నయనతార కొత్త ప్రైవేట్ జెట్ విమానాన్ని కొనుగోలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నయనతార మరియు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రైవేట్ జెట్‌తో ఉన్న చిత్రాలు నెట్టింట్లోకి చేరాయి. ప్రస్తుతం నయన్ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్(Nayan's Private Jet) విలువ రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం.
ఇటీవల విఘ్నేష్ శివన్, నయనతార ఒక నిర్దిష్ట వైట్-బ్లూ జెట్‌లో నుంచి బయటికి వస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లోకి రావడంతో ఈ జంట ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసినట్లుగా తేలింది. ఫొటోలను పరిశీలిస్తే జెట్ లోపలి భాగం పూర్తిగా విలాసవంతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

క్యాబిన్ లోపల విలాసవంతమైన సీట్లు ఇంకా మసాజ్ సౌకర్యాలు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా ప్రయాణికులు వస్తే వారికి సీటింగ్ సౌకర్యం కూడా ఉంది. టాయిలెట్లు మరియు హ్యాండ్ వాషింగ్ బేసిన్లు విడివిడిగా ఉన్నాయి. జెట్ లోపల విశ్రాంతి కోసం పడకగది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నయనతార ఆస్తి విలువ రూ. 200 కోట్లు ఉన్నట్లు సమాచారం.

సౌంత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్న ఏకైక నటిగా నయనతార గుర్తింపు పొందింది. నయనతార, భర్త విఘ్నేశ్ శివన్ వృత్తిపరమైన పనులు, విహార యాత్రల కోసం ఈ ప్రైవేట్ జెట్‌ను వాడతారట. బాలీవుడ్ నటీమణులు శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌లకు సైతం ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. వారి ప్రైవేట్ జెట్‌లు వేర్వేరు ధరలతో విభిన్న మోడళ్లతో ఉన్నాయి.

అయితే నయనతారకు ప్రైవేట్ జెట్ మాత్రమే కాకుండా విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. నయనతార నివాసంలోని గ్యారేజ్‌లో రూ. 1.76 కోట్ల విలువైన BMW 7 సిరీస్ కారు ఉంది. అంతేకాకుండా రూ. కోటి విలువైన మెర్సిడెస్ GLS350T మరియు BMW 5 సిరీస్‌తో సహా లగ్జరీ కార్లను ఈ జంట కలిగి ఉంది.
ప్రస్తుతం నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి రూ.100 కోట్ల విలువైన ఇంట్లో నివసిస్తుందని సమాచారం. నయనతారకు చెన్నై, హైదరాబాద్‌లలో ఖరీదైన విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. కేరళలో వంశపారపర్యంగా వస్తున్న ఇళ్లతో పాటు.. కేరళ, తమిళనాడు వ్యాప్తంగా స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు పైన పేర్కొన్న కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








