ఒక్క చూపే కళ్ళు తిప్పుకోనివ్వదు! బెంజ్ కారుకే లుక్ మార్చేసిన అందాల తార.. వీడియోలో చూడండి!

నోరా ఫతేహి (Nora Fatehi).. అందం, డ్యాన్స్, నటన, ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎవరికి తెలియదు? హిందీ సినిమాలకే పరిమితం కాకుండా తెలుగు, మలయాళం, తమిళం వంటి అనేక భాషా చిత్రాలలో తన నటనతో మెప్పించిన నోరా, ఇప్పుడు పాన్-ఇండియా స్టార్‌గా మారింది. కెనడాలో జన్మించిన ఈ అందాల తార ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో బిజీగా గడుపుతోంది. తన కెరీర్‌లోని ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, లగ్జరీ బ్రాండ్స్ అంటే నోరాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లగ్జరీ కార్లపై ఆమెకున్న క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది.

ఈ కోవలోనే మెర్సిడెస్-బెంజ్ CLA (Mercedes Benz) కార్‌పై ఆమెకున్న ఇష్టం ప్రత్యేకం. మెర్సిడెస్ బెంజ్ CLA భారత మార్కెట్లో కొన్ని సంవత్సరాల క్రితమే అమ్మకాలు నిలిపివేసినా, ఇప్పటికీ ఎంతోమంది వినియోగిస్తున్నారు. అందులో నోరా ఫతేహి కూడా ఒకరు. ఇటీవల సోషల్ మీడియాలో నోరా ఫతేహి లగ్జరీ కార్ వీడియో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియోలో, నోరా మెర్సిడెస్-బెంజ్ CLA నుంచి దిగుతూ కనిపించింది.

Actress Nora Fatehi Spotted With Mercedes Benz Cla

సాధారణంగా ఉండే స్టైల్‌కే క్లాస్ జోడించిన ఆమె లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. కార్ డోర్ తెరచి కూల్‌గా బయటకు అడుగుపెట్టిన నోరా, తన స్టైలిష్ అవతార్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు స్టార్ లుక్ అంటే ఇదే! అని కామెంట్స్ చేస్తున్నారు. కార్ల పట్ల నోరా ప్రేమ, ఆమె లగ్జరీ లైఫ్‌స్టైల్, గ్లామర్ కలిసిన ఈ క్షణం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టంట్ బాలీవుడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. నోరా ఫతేహి ఈ మెర్సిడెస్-బెంజ్ CLA కారును ఉపయోగించడం కొత్త విషయం కాదు. గతంలో ఎన్నోసార్లు ఈ కారుతో ప్రయాణిస్తున్నట్లు అభిమానులు గమనించారు. ముఖ్యంగా సినిమాల షూటింగ్‌లకు హాజరయ్యే సమయంలో ఈ కారుతో చేరడం నోరాకు ఇష్టమైన అలవాటే. మెర్సిడెస్-బెంజ్ CLA ఇప్పుడు మార్కెట్లో లభించకపోయినా, దీనిపట్ల నోరా ప్రాధాన్యత తగ్గలేదు.

Actress Nora Fatehi Spotted With Mercedes Benz Cla

ఈ కారు భారత మార్కెట్లో చివరిసారిగా అమ్మకానికి వచ్చినప్పుడు ఎక్స్-షోరూమ్ ధర రూ.31.72 లక్షల నుండి రూ.77.69 లక్షల వరకు ఉండేది. ప్రీమియం డిజైన్, సూపర్బ్ కంఫర్ట్, పవర్‌ఫుల్ పనితీరుతో అప్పట్లో CLA భారత లగ్జరీ కార్ మార్కెట్లో మంచి స్థానం సంపాదించింది. అయితే, ఈ మోడల్‌కి బదులుగా మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఎ-క్లాస్ లిమోజిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎ-క్లాస్ లిమోజిన్ ధర ప్రస్తుతం రూ.46.05 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

అయినా కూడా, CLAకు ఉన్న ప్రత్యేక ఫ్యాన్ బేస్ తగ్గలేదు. నోరా ఫతేహి వంటి సెలబ్రిటీల వినియోగం ఈ కార్‌కు అదనపు గ్లామర్‌ను తెస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వీడియో, ప్రతి ఫోటో ఈ కార్‌కి క్రేజ్ తెస్తున్నాయి. నోరా ఫతేహి లగ్జరీ కార్లంటే ఇష్టమే కాకుండా, వాటిని కలిగి ఉండటంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. మెర్సిడెస్-బెంజ్ CLAతో పాటు, ఆమె గ్యారేజీలో పలు అద్భుతమైన కార్లు ఉన్నాయి.

అందులో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది BMW 5 సిరీస్ 520d. ఇది ప్రీమియం సిగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ సెడాన్‌లలో ఒకటి. శక్తివంతమైన ఇంజిన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ కారు నోరా వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. నోరా దగ్గర పోలో GT TSI కూడా ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ భారత మార్కెట్లో లభించడంలేదు. అయినా, నోరా గ్యారేజీలో అది ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 27, 2025, 7:25 [IST]
English summary
Actress nora fatehi spotted with mercedes benz cla check here details
Read more on: #celebrity cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+