యమదొంగ బ్యూటీ 'ప్రియమణి' కొత్త కారు - ధర ఎంతో తెలుసా?
ప్రముఖ నటి 'ప్రియమణి' ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రియమణి కొన్ని కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఎవరే అతగాడు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన 'ప్రియమణి' (Priya Vasudevan Mani Iyer) యమదొంగ, నవ వసంతం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇటీవల జవాన్ సినిమాలో నటించి ప్రేక్షకుల మదిలో మళ్ళీ తనదైన ముద్ర వేసింది. ఇటు తెలుగు, అటు తమిళంలో బాగా ఫేమస్ అయిన ఈమె ఇటీవల 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీకి చెందిన 'జీఎల్‌సీ' కొనుగోలు చేసింది.

బెంజ్ జీఎల్‌సీ ధర
దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ SUVని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కారు కలిగిన సెలబ్రిటీల జాబితాలో ప్రియమణి కూడా చేరిపోయింది. మార్కెట్లో జీఎల్‌సీ ప్రారంభ ధర రూ. 74.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు చూడగానే ప్రేక్షకుల మనసు దోచేస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ (Mercedes Benz GLC)
గత ఏడాది ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ' (Mercedes Benz GLC) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ SUV పెద్ద గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి వాటితో పాటు వెనుక రెండు చివరను కలుపుతూ సన్నగా ఉండే ఎల్ఈడీ టెయిల్‌లైట్ బార్ మరియు లైట్ వంటివి ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. క్యాబిన్ లోపల 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ ఎయిర్ వెంట్స్ వంటివి మాత్రమే కాకుండా.. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ మరెన్నో అందుబాటులో ఉన్నాయి.
ప్రియమణి కొనుగోలు చేసిన కారు ఏ వెర్షన్ (డీజిల్ లేదా పెట్రోల్) అని స్పష్టంగా తెలియదు. కానీ GLC కారులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. పెట్రోల్ ఇంజిన్ 254 bhp పవర్ మరియు 400 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 194 bhp పవర్ మరియు 440 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
రెండు ఇంజిన్లు 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతాయి. దీనిని మెర్సిడెస్ ఈక్యూ బూస్ట్ అని పిలుస్తారు. ఇది 22.6 bhp పవర్ మరియు 200 Nm టార్క్ అందిస్తుంది. ఇవి 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది 4 మ్యాటిక్ ఆల్ వీల్ డ్రైవ్ యూనిట్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








