అందానికే అందం.. కుషాక్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. వైరల్ వీడియో!
అందం, అభినయం కలగలిపిన నటిమనుల్లో రాశి ఖన్నా కూడా ఒకరు. తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోల ప్రక్కన నటించి అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం భాషల్లో కూడా నటిస్తూ స్టార్ పొజిషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల ద్వారా మంచిగానే సంపాదిస్తున్న నటి తాజాగా ఖరీదైన కారుతో కనిపించారు. రాశి ఖన్నా స్కోడా కుషాక్ SUVలో ప్రయాణిస్తున్న ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినీ తారలు లగ్జరీ కార్లలో మాత్రమే కనిపించే వాతావరణంలో, ఈ నటి మిడ్-సైజ్ SUV అయిన స్కోడా కుషాక్‌లో కనిపించడం కొంత భిన్నంగా అనిపించింది. ఆమె స్టైల్‌కి సూటయ్యే విధంగా ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ కారులోని వెనుక సీటులో కూర్చున్న విధానం దేవతల్ని తలపించేలా ఉంది.
సాధారణంగా బయటి ప్రదేశాల్లో స్టార్ నటీమణులు కనిపించటం అంటే అభిమానులకు పండుగే. ఈ సందర్భంలో ఆమె ఎంచుకున్న కారు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా మంది ఈ కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. స్కోడా కుషాక్ ఒక స్టైలిష్, మిడ్-సైజ్ SUV. భారత మార్కెట్లో రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్లలో రూ. 18.79 లక్షల వరకు వెళ్తుంది (ఎక్స్-షోరూమ్).

అయితే, ఈ కార్ ఆమెకు వ్యక్తిగతంగా చెందిందా, లేక షూటింగ్ గానీ ప్రమోషన్ కార్యక్రమం కోసమో అనేది స్పష్టంగా తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులు రాశి ఖన్నాతో పాటు కారు కూడా బాగా అందంగా ఉందని మాట్లాడుకుంటున్నారు. భారత మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన మోడల్‌గా, స్కోడా కుషాక్ మిడ్-సైజ్ SUV విభాగంలో తనదైన ముద్ర వేసుకుంది.
ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య కూడా, మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. ధర కాస్త ఎక్కువగానే అనిపించినా, కుషాక్ డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్, పనితీరు వంటి అంశాలు కారును కొనుగోలుదారులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. MQB A0 IN ప్లాట్‌ఫామ్ దేశీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేయబడింది. ఈ SUV రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది.

మొదటిది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్, 3-సిలిండర్ TSI ఇంజిన్, ఇది 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంది. మరోటి 1.5 లీటర్ TSI 4-సిలిండర్ ఇంజిన్ వేరియంట్‌ను కూడా అందిస్తోంది. ఇది మరింత శక్తివంతమైన ప్రదర్శనతో పాటు, స్మూత్ రైడింగ్ అనుభూతిని అందించగలదు.
ఈ మిడ్-సైజ్ SUV 15.78 కి.మీ/లీటర్ నుండి గరిష్ఠంగా 19.76 కి.మీ/లీటర్ వరకు మైలేజీని అందిస్తుంది. స్కోడా కుషాక్ సేఫ్టీ పరంగా బెస్ట్ మోడల్. దీనిలో 6 ఎయిర్‌బ్యాగులు అందించడమే కాకుండా, అన్ని వేరియంట్లలోనే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ABSతో కూడిన EBD, మల్టీ-కొలిషన్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఆధునిక భద్రతా సాంకేతికతలు లభిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








