మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారులో తళుక్కుమన్న నటి రవీనా టాండన్..!
బాలీవుడ్ సహా ఇతర చిత్ర పరిశ్రమ నటీనటులు ఎక్కువగా లగ్జరీ కార్లపై ఆసక్తి చూపిస్తుంటారు. వీరిలో అత్యధిక మంది నటులు ఇప్పటికే లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి రవీనా టాండన్ (Actress Raveena Tandon) ఖరీదైన లగ్జరీ కారులో తళుక్కుమన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ ప్రముఖ నటీనటుల్లో రవీనా టాండన్ ఒకరు. ఈ నటిని ఒక్క ఇన్‌స్టాగ్రాంలోనే సుమారుగా 84 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే తాజాగా ఈ నటి మెర్సిడెస్ బెంజ్ GLS కారులో (Mercedes Benz GLS SUV) ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ప్రాంతంలో కనిపించారు. ఆ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మిజు రెస్టారెంట్‌కు వచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

రవీనా టాండన్ ప్రయాణించిన మెర్సిడెస్ బెంజ్ GLS వాహనం ప్రారంభ ధర రూ.1.31 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.2.96 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అయితే నటి టాండన్ ప్రయాణించిన కారు టాప్ ఎండ్ వేరియంట్‌గా తెలుస్తోంది.
మెర్సిడెస్ బెంజ్ GLS కారు రెండు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. 9G ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్ఠ వేగం 250 కి.మీ కాగా.. కేవలం 4.3 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ SUV 5205mm పొడవు, 2157mm వెడల్పు, 1838mm ఎత్తు ఉంటుంది. అలాగే 3135mm వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ కారు క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్, కీలెస్ ఎంట్రీ 5 జోన్ క్లైమెట్ కంట్రోల్, ఫాగ్ లైట్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
మెర్సిడెస్ బెంజ్ GLS SUV భద్రత పరంగా ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 9 ఎయిర్‌బ్యాగ్స్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, సీట్ బెల్ట్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, క్రాష్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
దీంతోపాటు EBD, ESC- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలెర్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు గ్లోబర్ NCAP 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








