పండుగ సందర్భంగా కొత్త కారు కొన్న ప్రముఖ నటి - ఫిదా చేస్తున్న వీడియో

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు ఇష్టమైన కార్లను కొనుగోలు చేస్తుంటారని విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే బాలీవుడ్ నటి 'సాయి తమ్‌హంకర్' ఓ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

మరాఠీ మరియు కొంకణి హిందువుల పండుగైన గుడి పడ్వా (హిందువుల చాంద్రమాన కొత్త సంవత్సర ప్రారంభం) సందర్భంగా నటి సాయి తమ్‌హంకర్ (Sai Tamhankar) 'మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ' (Mercedes Benz GLE) ఎస్​యూవీని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో పలువురి నెటిజన్లంటూ ఫిదా చేస్తోంది.

Sai Tamhankar Buys Mercedes Benz GLE

వీడియో షేర్ చేస్తూ.. ''మీరు ఏమి చెయ్యాలో, చెయ్యకూడదో ఎవరూ మీకు చెప్పనివ్వవద్దు. కలలు కనండి, సాధించండి, జీవించండి. కొత్త సంవత్సరం ప్రారంభించినప్పుడు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందాం'' అని రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి కొత్త కారు కొన్న సందర్భంగా నటికి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. లెక్కకు మించిన లైకులు కూడా వస్తున్నాయి.

వీడియోలో కారు డెలివరీకి సంబంధించిన సన్నివేశాలను చూడవచ్చు. ఇందులో నటి డీలర్‌షిప్‌కి వెళ్లడం, అక్కడ డాక్యుమెంట్స్ వంటివి ఫిల్ చేయడం మాత్రమే కాకుండా.. కారును డెలివరీ చేసుకున్న తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయడం చూడవచ్చు. నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉండటం చూడవచ్చు. స్టీరింగ్ వీల్‌ను నటి ముద్దు పెట్టుకున్న సన్నివేశం కూడా ఇక్కడ చూడవచ్చు.

Sai Tamhankar Buys Mercedes Benz GLE

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ

వీడియోలో కనిపిస్తున్న కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ ఫేస్‌లిఫ్ట్, గత ఏడాది నవంబర్‌లో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 96.40 లక్షల నుంచి రూ. 1.15 కోట్ల వరకు ఉంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఎక్కువమంది ప్రముఖులు ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని ఫ్రంట్ గ్రిల్, బంపర్, ఎల్ఈడీ డీఆర్ఎల్, హెడ్‌ల్యాంప్‌, టెయిల్ ల్యాంప్‌ అన్నీ కూడా కొంత అప్డేట్ చేయబడ్డాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే.. టచ్ కంట్రోల్ ప్యానెల్‌లతో కూడిన మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్, MBUX సిస్టంతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు స్లైడింగ్ ఫంక్షన్‌తో రిక్లైనింగ్ సీట్లు మొదలైనవి ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్లి అడ్జస్టబుల్ సన్ బ్లైండ్స్, ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, పవర్డ్ టెయిల్‌గేట్, బ్లైండ్ స్పాట్ అసిస్టెన్స్ సిస్టం మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని మరియు భద్రతను కల్పిస్తాయి.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవెల్ మోడల్ 300డీ వేరియంట్ 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కలిగి 265 Bhp పవర్ మరియు 550 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 450 వేరియంట్ 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 375 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

టాప్ ఎండ్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450డీ 3.0 లీటర్ టర్బోచార్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 362 Bhp పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మూడు ఇంజిన్లు 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతాయి. ఇది 20 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే నటి సాయి తమ్‌హంకర్ ఏ వేరియంట్ ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 13, 2024, 14:25 [IST]
English summary
Actress sai tamhankar buys mercedes benz gle on gudi padwa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+