సమంత వద్ద ఇన్ని కార్లు ఉన్నాయా..? వీటిలో అత్యంత ఖరీదైన కారు ఏదంటే..!
సమంత రూత్ ప్రభు, మన తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఏ మాయ చేసావే చిత్రంలో యువకుల హృదయాలను మాయం చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత తాజాగా వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రంలో ఊ అంటావా మామ, ఊఊ అంటావా మామ అంటూ అన్ని తరాల వారిని ఉర్రూతలు ఊగించింది. ప్రస్తుతం, ఈమె తెలుగు మరియు తమిళ చిత్రసీమలో అగ్రగామి నటీమణులలో ఒకరుగా ఉన్నాయి.

సమంత హిట్ చిత్రాలలో ఈగ, నీతానే ఎన్ పొన్వసంతం, సూపర్ డీలక్స్, రంగస్థలం, తేరి, ఓ బేబీ మొదలైనవి ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈమె పేరు వార్తల్లో ప్రధానంగా వినిపించింది. అది ఆమె వ్యక్తిగత విషయం కాబట్టి, మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే, సమంత ఇటీవల నికర ఆస్తి విలువ గురించి వెల్లడించినట్లు సమాచారం.

ఓ నివేదిక ప్రకారం, ఆమె నికర ఆస్తి విలువ సుమారు రూ. 89 కోట్లు. ఇండస్ట్రీలోని ఇతర సెలబ్రిటీల మాదిరిగానే సమాంతకు కూడా విలాసవంతమైన కార్లంటే ఎక్కువ మక్కువ అని తెలుస్తోంది. తాజాగా, ఆమె కార్ కలెక్షన్ కు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. మరి అందాల భామ ఉపయోగించే ఆ అందమైన కార్లు ఏవి, వాటిలో అత్యంత ఖరీదైనది ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి (Mercedes Benz G63 AMG)
సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎమ్‌జి కూడా ఒకటి. సమాంత వద్ద కూడా ఈ ఖరీదైన ఎస్‌యూవీ ఉన్నట్లు సమాచారం. సినీ పరిశ్రమలో మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 ఎస్‌యూవీ కలిగి ఉన్న ఇతర ప్రముఖులలో దుల్కర్ సల్మాన్, ఆసిఫ్ అలీ, జిమ్మీ షెర్గిల్, అఖిల్ అక్కినేని, రామ్ కపూర్ మొదలైన వారు ఉన్నాయి. ఈ సెలబ్రిటీల జాబితాలో సమాంత రూత్ ప్రభు కూడా ఒకరు.

ఆమె ఈ అందమైన మరియు శక్తివంతమైన జి-వ్యాగన్ కు యజమాని. భారత మార్కెట్లో కారు ధర దాదాపు రూ. 2.3 కోట్లకు పైమాటే. ఈ ఖరీదైన కారులో శక్తివంతమైన 5.5 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ ఉంటుంది. ఇది 572 బిహెచ్‌పి పవర్ మరియు 760 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది. మెర్సిడెస్-ఎఎమ్‌జి జి 63 ఎస్‌యూవీ మంచి ఆఫ్-రోడ్ సామర్త్యం కలిగిన ఎస్‌యూవీ.

అన్ని టెర్రైన్స్ పై సులువుగా ప్రయాణించేందుకు వీలుగా ఇందులో 4 మ్యాటిక్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది లీటరుకు కేవలం 8.0 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం 5.4 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ లగ్జరీ ఎస్‌యూవీ బాక్సీ సిల్హౌట్‌ను కలిగిఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, పనామెరికానా గ్రిల్ మరియు ఎల్ఈడి డిఆర్ఎల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

పోర్ష్ కేమాన్ జిటిఎస్ (Porsche Cayman GTS)
సమాంత కార్ కలెక్షన్ లో పోర్ష్ కేమాన్ జిటిఎస్ ను చూస్తుంటే, ఆమెకి కేవలం లగ్జరీ కార్లు మాత్రమే కాకుండా, ఫ్యాషన్‌తో కూడిన స్పోర్ట్స్ కారు కూడా ఇష్టమని తెలుస్తోంది. బహుశా, ఆమె గ్యారేజీలో ఉన్న ఏకైక స్పోర్ట్స్ కారు కూడా ఇదే అయి ఉండొచ్చేమో. ఈ కారులో 330 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే పవర్‌ఫుల్ 3.5 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది లీటరుకు 9-16 కిమీ మైలేజీనిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 283 కిమీ మరియు ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1.19 కోట్లుగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ (BMW 7-Series)
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ అందించే కార్లలో సెలబ్రిటీల ఫేవరెట్ కారు 7-సీరిస్. పొడవాటి వీల్‌బేస్ మరియు విలాసవంతమైన క్యాబిన్ ను కలిగి ఉండే ఈ కారు కూడా సమంతా రూత్ ప్రభు గ్యారేజ్ లో కొలువుదీరి ఉంది. ఈ కారులో 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ ను మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. కలిగి ఉంటుంది. ఇది కేవలం 5.8 సెకన్లలోనే గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు, దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 1.42 కోట్లుగా ఉంటుంది.

జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF)
టాటా మోటార్స్ కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ అందిస్తున్న స్పోర్ట్స్ సెడాన్ ఎక్స్ఎఫ్. మనదేశంలో ఈ కారు ధర సుమారు రూ. 70 లక్షలకు పైమాటే. ఈ లగ్జరీ సెడాన్ లో పవర్‌ఫుల్ 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 197 బిహెచ్‌పి పవర్ ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సగటున లీటరుకు 10 కిమీ మైలేజీని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 234 కిమీ మరియు ఇది కేవలం 6.4 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. సమాంత గ్యారేజ్ లో ఈ బ్రిటీష్ కారు కూడా ఉంది.

ఆడి క్యూ7 (Audi Q7)
టాలీవుడ్ మరియు బాలీవుడ్ సెలబ్రిటీలు అత్యధికంగా ఇష్టపడే బడ్జెట్ ఫ్రెండ్లీ లగ్జరీ కార్లలో ఆడి క్యూ7 ఎస్‌యూవీ కూడా ఒకటి. సమాంత కార్ కలెక్షన్ లో ఈ జర్మన్ కారు కూడా ఉంది. ఈ ఎస్‌యూవీ శక్తివంతమైన ఇంజన్ తో పాటుగా విలాసవంతమైన ఇంటీరియర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ కారులో 241.4 బిహెచ్‌పి పవర్ మరియు 550 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 3.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది సగటున లీటరకు 12 కిమీ మైలేజీనిస్తుందని అంచనా. ఇది గరిష్టంగా గంటకు 215 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ. 80 లక్షల వరకూ ఉంటుంది.


Click it and Unblock the Notifications








