తప్పుదోవ పట్టించిన గూగుల్ మ్యాప్.. నో-ఎంట్రీ జోన్‌ చేరుకున్న శిల్పాశెట్టి (వీడియో)

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మనిషి ఎక్కడికెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ మీద ఆధారపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ తప్పుదోవ పట్టిస్తుంది. ఇటీవల నటి శిల్పాశెట్టి గూగుల్ మ్యాప్ వల్ల నో-ఎంట్రీ జోన్‌కు చేరుకుంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. నటి శిల్పాశెట్టి ఒక ఇన్‌స్టంట్ నూడిల్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈమె గూగుల్ మ్యాప్ ద్వారా గమ్యాన్ని చేరుకోవాలనుకుంది. అయితే గూగుల్ మ్యాప్ ఆమె కారును వన్-వేకు చేరింది. దీంతో మళ్ళీ వెనుతిరిగి ఈవెంట్‌కు ఆలస్యంగా వెళ్ళింది. ఆలస్యానికి కారణం ఏంటనే విషయాన్నీ ఆ తరువాత వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shilpa Shetty Went to No Entry Zone Using Google Map

గూగుల్ మ్యాప్స్ కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గూగుల్ మ్యాప్ కారణంగా ఓ ఫ్యామిలి అడవిలోకి వెళ్ళింది, సరైన సిగ్నెల్ లేకుండా.. వారు రాత్రంతా అడవిలోనే కాలం గడపాల్సి వచ్చిందని గతంలో ఓ సందర్భంలో చదువుకున్నాం. మరోసారి గూగుల్ మ్యాప్ కారును ఏకంగా కాలువలోకి తీసుకెళ్లింది.

ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ మ్యాప్ కారణంగా టయోటా ఫార్చ్యూనర్ మెట్ల మీద ఇరుక్కుపోయింది. రాత్రి సమయంలో ఫార్చ్యూనర్‌లోని ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నించే క్రమంలో గూగుల్ మ్యాప్ వారికి షార్ట్‌కట్‌ చూపించింది. రాత్రి సమయంలో దృశ్యమానత తక్కువగా ఉన్న కారణంగా కారు మెట్ల మీదుగా వెళ్లాల్సి వచ్చింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కారును మెట్ల మీదనే ఆపి ఉంచాడు. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరిలో చోటు చేసుకుంది.

Shilpa Shetty Went to No Entry Zone Using Google Map

గూగుల్ మ్యాప్ తప్పుదోవ పట్టించడానికి కారణం

గూగుల్ మ్యాప్ తప్పుదోవ పట్టించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ఒకటి నెట్వర్క్ ఇస్యూ. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సిగ్నెల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల గూగుల్ మ్యాప్ సరిగ్గా చూపించదు. ఈ కారణంగా యూజర్ తప్పుడు మార్గంలో వెళ్లే ఆవకాశం ఉంది. పూర్తిగా గూగుల్ మ్యాప్ మీదనే ఆధారపడితే.. వారు ప్రమాదంలో పడే అవకాశాలు కూడా ఎక్కువే. గూగుల్ మ్యాప్ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నవారు కూడా చాలామంది ఉన్నారు.

కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి

వాహనదారులు లేదా ప్రయాణికులు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే.. గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే సరిపోదు. వారు ఖచ్చితంగా స్థానికులను మీరు వెల్లడైన గమ్యం గురించి అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సురక్షితంగా గమ్యం చేరవచ్చు. లేకుంటే కేవలం టెక్నాలజీని మాత్రమే నమ్ముకుని గుడ్డిగా గూగుల్ మ్యాప్ అనుసరిస్తే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

గూగుల్ మ్యాప్ అన్ని వేళలా తప్పుడు మార్గాలనే చూపిస్తుందని చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది నగరాల్లో తెలియని ప్రదేశాలను చేరుకోవడానికి ఈ గూగుల్ మ్యాప్ ఉపయోగిస్తున్నారు. కొన్ని మారు మూల ప్రాంతాల్లో మాత్రమే గూగుల్ తప్పుడు మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఆధునిక కాలంలో గూగుల్ మ్యాప్ చాలా అవసరం.. కానీ అన్ని వేళలా గూగుల్ మ్యాప్‌ను మాత్రమే నమ్ముకోవడం ప్రమాదానికి దారితీస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, May 27, 2024, 10:13 [IST]
English summary
Actress shilpa shetty went to no entry zone using google map
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+