రూ.4.5 కోట్లతో సూపర్‌ కారును కొనుగోలు చేసిన నటి శ్రద్దా కపూర్‌.. కారు ప్రత్యేకతలు తెలుసా?

ప్రముఖ సినీనటులు సహా ఇతర రంగాల ప్రముఖులు లగ్జరీ కార్లను ఎక్కువగా ఇష్టపడతారు. ఇప్పటికే వీరి గ్యారేజీలు లగ్జరీ కార్లతో నిండిపోతుంటాయి. అయితే మార్కెట్‌లోకి వచ్చిన లగ్జరీ వాహనాలను కొనుగోలు చేయడం సెలబిటి ట్రెండ్‌గా మారింది.

ప్రముఖ నటి శ్రద్దా కపూర్‌ దసరా నవరాత్రి పండుగ సందర్భంగా కొత్త లంబోర్గిని హురాకాన్‌ (lamborghini huracan) లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర రూ.4.5 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. శ్రద్దా రెడ్‌ కలర్‌ కారును కొనుగోలు చేశారు. ఈ కారును డెలివరీ తీసుకున్న తర్వాత స్వయంగా డ్రైవ్‌ చేశారు.

actress Shraddha kapoor lamborghini huracan car

లంబోర్గిని హురాకాన్ లగ్జరీ కారు గతం సంవత్సరం ఏప్రిల్‌లో భారత్‌లో విడుదల అయింది. నటి శ్రద్దా (Bollywood actress Shraddha kapoor) చేసిన లంబోర్గిని హురాకాన్‌ టెక్నికా లగ్జరీ కారు స్టాండర్డ్‌ మోడల్‌ EVO కంటే ఎంతో శక్తివంతమైంది. సియాన్ హైబ్రిడ్‌ హైపర్‌కార్‌ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ముందు, వెనుక భాగంలో ఫాసియా బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది.

లంబోర్గిని హురాకాన్‌ సూపర్‌ కారు కార్బన్ ఫైబర్ బానెట్‌, స్టాండర్డ్‌ హురాకాన్‌ EVOతో పోలిస్తే మెరుగైన రెయిర్‌ డిఫ్యూజర్‌ను కలిగి ఉంటుంది. 35 శాతం బూస్ట్‌ను అందించే ఫిక్సడ్‌ రియర్‌ స్పాయిలర్‌ను కలిగి ఉంది. బరువు తగ్గించడం, క్లామ్‌షెల్‌ బాడీవర్క్‌నులో భాగంగా ఏరో డైనమిక్‌ ప్యాకేజీని కలిగి ఉంటుంది.

actress Shraddha kapoor buys lamborghini huracan

శక్తివంతమైన ఇంజిన్‌ : నటి శ్రద్దా కపూర్‌ కొనుగోలు చేసిన లంబోర్గినీ హురాకాన్‌ టెక్నికో 5.2 లీటర్‌ V10 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 640hp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్‌ 7-స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో వెనుక చక్రాలకు శక్తిని అందిస్తుంది. కార్బన్‌ సిరామిక్‌ బ్రేక్‌లను కలిగి ఉంటుంది.

గంటకు 325 కి.మీ వేగం: లంబోర్గిని హురాకాన్‌ సూపర్‌ కారు కేవలం 3.2 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. అలాగే 9.1 సెకన్లలో 200 kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ఠంగా గంటకు 325 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలదు. దీంతోపాటు ఈ కారు మరెన్నో కీలక ఫీచర్లను కలిగి ఉంది.

actress Shraddha kapoor new super car

నటి శ్రద్దా కపూర్‌ టయోటా ఫార్చ్యూనర్‌ సహా అనేక కార్లను కలిగి ఉన్నారు. ఫస్ట్‌ జనరేషన్‌ మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు మారుతి సుజురి స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లను కలిగి ఉన్నారు. దీంతోపాటు మెర్సిడెస్‌ ML-250 CDI ఎస్‌యూవీ మరియు ఫస్ట్ జనరేషన్‌ BMW 3 సిరీస్‌ కార్లను కూడా కలిగి ఉన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 26, 2023, 11:16 [IST]
English summary
Actress shraddha kapoor buys lamborghini huracan super car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+