కల నెరవేర్చుకున్న నటి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్
కొత్త కారు కొనుగోలు చేయడం అనేది చాలామందికి ఒక కల. అయితే ఇది సాధారణ ప్రజలకు మాత్రమే కాదు, సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక నటి కొత్త కారు కొనుగోలు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. నటి 'శుభంగి జైస్వాల్' (Shubhangi Jaiswal) ఇటీవల ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన 'హెక్టర్' కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో తాను కారు కొనుగోలు చేసిన అనుభూతిని గురించి వివరిస్తూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించనట్లయితే శుభంగి జైస్వాల్.. షోరూమ్‌లోకి రావడం, కారు కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేయడం చూడవచ్చు. ఆ తరువాత కారుపైన కప్పిన ఎర్రని గుడ్డను తొలగించడం కూడా చూడవచ్చు. ఆ తరువాత ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఫోటోలు దిగటం గమనించవచ్చు. ఆ తరువాత కేక్ కట్ చేసి.. కారులో వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ఇప్పటికే లెక్కకు మించిన నెటిజన్లు వీక్షించారు.
కారు కొనుగోలు చేసిన తరువాత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసింది. ఇందులో ''నేను ఇది రాస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. నా అనుభూతిని ఎలా తెలియజేయాలి తెలియడం లేదు. 23 ఏళ్ల వయసులో కొత్త కారు కొనాలనేది నా కల. చివరకు అనుకున్నది సాధించాను. నా నిర్ణయాలను గౌరవిస్తూ.. నాకు మద్దతుగా నిలబడిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు అంటూ పేర్కొంది''.

అంతే కాకుండా.. చాలామంది నన్ను డీమోటివేట్ చేశారు, కానీ నేను నా లక్ష్యాన్ని వదులుకోలేదు. నేను ఎప్పుడూ నా లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచిస్తూ ఉన్నాను. జీవితంలో పెద్ద నిర్ణయాలను తీసుకున్న ప్రతిసారి.. బాగా సపోర్ట్ చేసిన నా సోదరునికి ధన్యవాదాలు. అనుకున్నది సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. విజయం వైపు వేస్తున్న ప్రతి అడుగు నన్ను చాలా సంతోషపెడుతున్నాయి. అంటూ శుభంగి జైస్వాల్ వెల్లడించింది.
ఇక ఎంజీ హెక్టర్ విషయానికి వస్తే.. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. అయితే శుభంగి ఏ మోడల్(పెట్రోల్ లేదా డీజిల్) కొనుగోలు చేసిందనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. ఈ SUV స్టైల్, షైన్, స్మార్ట్, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో అనే మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి.
ఎంజీ హెక్టర్ దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్ పొందుతుంది. కాబటికి ఇందులో కొంత పెద్దదిగా ఉన్న గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు ఫ్రంట్ బంపర్ కింద ఉన్న హెడ్‌ల్యాంప్ వంటి వాటిని గమనించవచ్చు. ఇది 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా అప్డేటెడ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంటుంది.
ఎంజీ హెక్టర్ SUVలో వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 143 బీహెచ్‌పీ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా పొందుతుంది. ఇది కూడా మంచి పనితీరును అందిస్తుంది. మొత్తం మీద ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








