దక్షిణ భారత సినిమాను ఏలిన స్టార్ హీరోయిన్ ఇంటికే నేరుగా వచ్చిన కొత్త అతిధి.. పూజలతో స్వాగతం
తొంభైల్లో తెలుగు, తమిళ సినిమాలపై తనదైన ముద్ర వేసిన స్టార్ బ్యూటీ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంప్రదాయ చీరల్లోనూ, ఆధునిక దుస్తుల్లోనూ అదే అందాన్ని, ఆకర్షణను చూపిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో ఎన్నోహిట్ సినిమాలు చేశారు. ఒకానొక సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె, తన కుటుంబానికి అంకితమై నిర్మాత దీపక్ బాగా భార్యగా జీవితం కొనసాగిస్తున్నారు. ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చారు. కాలం మారినా, సిమ్రాన్ పట్ల ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా, కొరియోగ్రాఫర్‌గా కూడా తన ప్రతిభను చూపిస్తూ మల్టీ టాలెంటెడ్ లేడీగా పేరు సంపాదించింది. ఇదిలా ఉంటే ఆమె వ్యక్తిగత జీవితంలో మరో అప్‌డేట్ తెరపైకి వచ్చింది.
సిమ్రాన్ ఇటీవలే తన కుటుంబంతో కలిసి ఒక అద్భుతమైన SUV కొనుగోలు చేశారు, అదే మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్. స్టైల్, పవర్, రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలనుకునే వారందరి డ్రీం కారుగా మారిన థార్‌ను సిమ్రాన్ ఎంపిక చేయడం గమనార్హం. కొత్త తరం థార్ రాక్స్ వేరియంట్ నేషనల్ లెవెల్‌లోనే హైప్‌ను సృష్టిస్తుండగా, ఈ బ్యూటీ తన ట్రావెల్ జర్నీకి దీనిని కొత్త భాగస్వామిగా మార్చుకున్నారు.

ఆమె థార్ డెలివరీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహారాజలా కనిపించే థార్‌తో సిమ్రాన్ ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ట్రెడిషన్‌కి ప్రాధాన్యత ఇచ్చే ఆమె, ఆధునికతను కూడా అదే ఉత్సాహంతో ఆహ్వానించడం మరోసారి నిరూపించింది. సినిమాల్లోను, నిజ జీవితంలోను స్టైలిష్‌గా ఉండే నటి.. ఆమె థార్‌తో కలిసి తీసిన డ్రైవ్ ఓన్ మోడ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
సిమ్రాన్ డీలర్‌షిప్‌కి వెళ్లి కారు తీసుకోవడం కాదు , మహీంద్రా డీలర్‌షిప్ వారు స్వయంగా ఆమె ఇంటికే వచ్చి, కొత్త SUVని డెలివరీ చేశారు. తన భర్త దీపక్ బాగా, ఇద్దరు కుమారులతో కలిసి సిమ్రాన్ క్యాజువల్ వేర్‌లో కొత్త SUVని స్వీకరించగా, ఆమె చిరునవ్వుతో మిలమిల మెరిసిపోతూ కనిపించింది. ఫ్యాన్స్‌కి అలవాటైన గ్లామరస్ అవతారంకన్నా విభిన్నంగా కనిపించిన ఆమె ఈ సారి చక్కటి ఫ్యామిలీ మూడ్‌తో ముందుకు వచ్చారు.

SUVను ఇంటికే తీసుకురాగానే, సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ దీపాలు వెలిగించి ఆ కారుకు స్వాగతం పలికారు. దీన్ని చూసినవారంతా.. ఇది కేవలం ఒక వాహనం కాదు.. ఒక కొత్త ప్రయాణం కోసం పూజ అంటున్నారు. సిమ్రాన్ ఎంచుకున్నది థార్ రాక్స్ 5-డోర్ మోడల్, బాటిల్‌షిప్ గ్రే అనే ప్రత్యేకమైన కలర్ ఆప్షన్‌లో. ఈ రంగు SUVకి రాయల్ లుక్ ఇవ్వడమే కాదు, స్ట్రీట్‌లపై ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది.
అయితే ఆమె ఎంచుకున్నది డీజిల్ వేరియంట్‌నా? పెట్రోల్ వేరియంట్‌నా? మ్యానువల్‌నా? ఆటోమేటిక్‌నా? అనే విషయం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ బ్యూటీ టాప్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లు కార్ లవర్స్ అంచనా వేస్తున్నారు, ఎందుకంటే దాని ధర ప్రస్తుతానికి రూ.23.39 లక్షల వరకు ఉంది. అలా అయితే టాప్ వేరియంట్‌కు ఆన్-రోడ్ ధర దాదాపుగా రూ.30 లక్షల మార్క్‌ను దాటి ఉండే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ రాక్స్ రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 162 bhp పవర్, 330 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ 177 bhp పవర్, 380 Nm టార్క్‌ను అందిస్తుంది. 2.2-లీటర్ డీజిల్ 150 bhp పవర్, 330 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4x4 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ రఫ్ టెరెయిన్ లవర్స్‌కి బెస్ట్ చాయిస్‌గా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








