సినీ తారల స్టైల్ అంటే ఇదే.. కోట్ల విలువైన లగ్జరీ కారుతో తమన్నా.. పక్కన ఒకప్పటి స్టార్ హీరోయిన్ డాటర్
ఇండియాలో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుందని అమ్మకాలను చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడి ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ అతిపెద్దది. కార్ల వాడకం దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే వాటితో పాటు, కోట్లు విలువ చేసే లగ్జరీ కార్ల కొనుగోళ్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు ఖరీదు ఎక్కువ కలిగిన వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయిందంటే చాలు దాని గురించి వాకబు చేసి తమ గ్యారేజీలోకి చేర్చుకుంటారు. ఫంక్షన్లు లాంటివి ఏవైనా జరిగినప్పుడు ఆ కార్లతో కనిపిస్తూ, సోషల్‌మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంటారు. తాజాగా కోట్ల ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ డిఫెండర్(land rover defender) కారుతో ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా, బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీలు కనిపించారు.
లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ కారుతో వారిద్దరు కనిపించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ డిఫెండర్ వీరే కాకుండా సినిమా పరిశ్రమలోని ఇతర ప్రముఖలు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు వంటి వారు కూడా ఈ కారుకు అభిమానులుగా ఉన్నారు. ఇది లగ్జరీ ఫీచర్స్‌తో నిండిన అదిరిపోయే మోడల్. ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్‌లోను సాఫీగా ప్రయాణిస్తుంది. సెలబ్రిటీలకు అత్యంత ఇష్టమైన కార్లలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఒకటిగా ఉంది.

ఇద్దరు బి-టౌన్ బ్యూటీలు తమన్నా భాటియా, రాషా తడానీలు కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వారిద్దరూ ల్యాండ్ రోవర్ లగ్జరీ కారులో రావడంతో ఇప్పుడు ఈ డిఫెండర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ మోడల్ పేరు 'డిఫెండర్ 110 (defender 110)'. దీనిని ఇటీవల రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కొనుగోలు చేశారు. ఆమె తమన్నాతో కలిసి ఈ కార్యక్రమానికి ఇదే కారులో హాజరయ్యారు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ప్రారంభ ధర రూ. 1.04 కోట్లు (ఎక్స్ షోరూమ్). అదే టాప్ వేరియంట్ అయితే దాదాపు రూ.1.57 కోట్లు(ఎక్స్ షోరూమ్) ఉంటుంది. భారతీయ మార్కెట్లో ఖరీదైన లగ్జరీ కార్లలొ ఈ కారు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇది SUV తరహా మోడల్. ఇది డిఫెండర్ 90, 110, 130 తో సహా వివిధ వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. రాషా 110 వేరియంట్‌ను ఎంచుకున్నారు.

డిఫెండర్ 110 HSE మోడల్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ శక్తివంతమైన ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌ను జోడించబడి ఉంది. ఇంజిన్ 296 bhp పవర్, 400 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో మరింత ఫెర్ఫామెన్స్‌ను ఇస్తుంది. ఈ లగ్జరీ స్పోర్ట్ యుటిలిటీ కారు 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్ప్ ఈ కారులో ఉన్నాయి.
ఈ లగ్జరీ SUV డజన్ల కొద్ది లగ్జరీ ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఆన్-రోడ్‌తో పాటు ఆఫ్-రోడ్ రెండింటిలోనూ అద్భుతంగా ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంటుంది. అలాగే 900 మి.మీ. నీటిలో కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. లోపల కూర్చున్న వారికి ప్రత్యేక ఫీలింగ్‌ను అందిస్తుంది. ప్రయాణికుల సేఫ్టీకి అత్యుత్తమైన కారు. 360-డిగ్రీ కెమెరా, క్లియర్‌సైట్ గ్రౌండ్ వ్యూ, ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి కూడా ఉన్నాయి.

ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్,యాక్టివ్ రియర్ లాకింగ్ డిఫరెన్షియల్, లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్ వంటి ఫీచర్స్‌ను అందించారు. దీని పొడవు 5,018 మిమీ, వెడల్పు 2,008 మిమీ, ఎత్తు 1,967 మిమీగా ఉంది. ఇక వీల్‌బేస్ విషయానికి వస్తే 3,022 మిమీగా ఉంది.


Click it and Unblock the Notifications








