సింగిల్ అయినా.. కింగ్‎లా బతకాలి! కొత్త కారుతో తమన్నా మెసేజ్!

ప్రస్తుతం ఇండియాలో అందరికీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ)పైనే మోజు. సెలబ్రిటీలైనా, మధ్యతరగతి వారైనా తమకు నచ్చిన ఎస్‌యూవీలను కొనుగోలు చేస్తున్నారు. ఇక సెలబ్రిటీల్లో అయితే ఆఫ్-రోడ్ సాహసాలకు అనువైన లగ్జరీ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలామంది సినీ తారలు ఇటీవల ఇలాంటి ఎస్‌యూవీలను డెలివరీ తీసుకున్నారు.

అలా సినీ తారల్లో బాగా పాపులర్ అయిన లగ్జరీ ఎస్‌యూవీల్లో ఒకటి రేంజ్ రోవర్ వెలార్. ఇప్పుడు మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ కారును కొనుగోలు చేశారు. రేంజ్ రోవర్ వెలార్ గురించి తెలియనివారి కోసం.. ఇది ప్రస్తుతం ఒకే ఫుల్లీ లోడెడ్ HSEట్రిమ్‌లో అందుబాటులో ఉంది. D200 (డీజిల్ మైల్డ్ హైబ్రిడ్), P250 (ఫోర్ సిలిండర్ పెట్రోల్) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

Tamannaah Bhatia Velar

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ ప్రస్తుత ధర దాదాపు రూ. 87.90 లక్షలు. దీన్ని రోడ్డు మీదకు తీసుకురావాలంటే దాదాపు రూ. 1.10 కోటి వరకు ఖర్చవుతుంది. 2024 అప్‌డేట్‌లో వెలార్ కొన్ని డిజైన్ మార్పులతో వచ్చింది. ఈ ఎస్‌యూవీలో ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, సన్నటి టెయిల్ ల్యాంప్స్, పెద్ద రియర్ ఓవర్‌హాంగ్ మరియు కొత్త పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉన్నాయి.

2024వెలార్ లోపలికి వెళ్తే ప్రీమియం, లగ్జరీ ట్రిమ్‌లు, మెటీరియల్స్‌తో చాలా నీట్‌గా, క్లట్టర్ లేకుండా ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 11.4 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ సెల్ ఫోన్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఈ లగ్జరీ ఎస్‌యూవీలో ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయంలో కూడా ఇది చాలా రిచ్.

Tamannaah Bhatia

ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు రేంజ్ రోవర్ వెలార్‌లో ఉన్నాయి. ఇది మెర్సిడెస్ బెంజ్ GLE, ఆడి Q7, బీఎండబ్ల్యూ X5 వంటి కార్లకు పోటీ ఇస్తుంది.

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ కారును తన గ్యారేజ్‌లోకి చేర్చుకున్నారు. ఆమె మార్చి 29న కొత్త కారును రిజిస్టర్ చేసుకున్నారు. వాహన్ రికార్డుల ప్రకారం, తమన్నా డైరెక్టర్‌గా ఉన్న తమన్నా జెమ్స్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఈ ఎస్‌యూవీ రిజిస్టర్ అయింది. అరోయస్ గ్రే కలర్ ఆప్షన్‌లో రేంజ్ రోవర్ వెలార్ డీజిల్ వేరియంట్‌ను తమన్నా ఎంచుకున్నారు.

Tamannaah Bhatia Car

ఏప్రిల్ 17న విడుదల కానున్న తన కొత్త సినిమా 'ఓదెల 2' రిలీజ్‌కు ముందు తమన్నా ముంబైలోని శ్రీ బాబుల్‌నాథ్ మందిరాన్ని సందర్శించారు. సాధారణంగా మోడ్రన్ డ్రస్సుల్లో కనిపించే తమన్నా.. చీరలో చాలా అందంగా గుడికి వచ్చారు. అప్పటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'హ్యాపీ డేస్' సినిమాతో ఆమె ఇక్కడ బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 'అయన్', 'పయ్యా', 'బాహుబలి', 'బాహుబలి 2', 'సిరుత్తై' వంటి సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇటీవల తమన్నా హీరో విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఇద్దరూ విడిపోయారు. ఏదేమైనా, విజయ్‌తో బ్రేకప్ తర్వాత తమన్నా కొత్త కారు కొనడంతో ఆమె సంతోషంగానే ఉన్నారని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వెలార్ కాకుండా తమన్నా గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 10, 2025, 8:35 [IST]
English summary
Actress tamannaah bhatia buys luxurious range rover velar after breakup
Read more on: #india #auto news #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+