ఈ లగ్జరీ కారును కూడా తమన్నా స్టైల్‌లో మెరిసిపోయేలా చేసింది! గ్లామర్‌కు తగ్గ ఆడి.. వైరల్ అవుతున్న వీడియో
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోల పక్కన నటించి దేశవ్యాప్తంగా భారీ లెవల్లో ఫ్యాన్స్‌ను కలిగిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah bhatia) సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్, పలు ప్రకటనల ద్వారా భారీగా సంపాదిస్తుంది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 కి పైగా సినిమాల్లో నటించిన తమన్నాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఇటీవల కాలంలో పలు ఈవెంట్స్‌కు, పార్టీలకు హాజరైనప్పుడు అధునాతన కార్లతో కనిపించిన ఆమె తాజాగా ఖరీదైన లగ్జరీ ఆడి A4 సెడాన్‌తో కెమెరాల కంట పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ టీషర్ట్‌తో మెరిసిపోతున్న తమన్నాఒక జిమ్ నుంచి బయటకు వచ్చి ఆడి A4 కారులో వెళ్లిపోయారు. ఈ క్రమంలో కెమెరాలకు ఫోజులిచ్చారు. అయితే ఇప్పుడు ఈ కారు గురించి ప్రత్యేకంగా ఆటో ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.
ఈ ఆడి A4 సెడాన్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ.46.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). టాప్ వేరియంట్ విషయానికి వస్తే, రూ.55.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారును ఇప్పటికే చాలా మంది సినీ తారలు వాడుతున్నారు. బాలీవుడ్ నటి యామి గౌతమ్ దగ్గర కూడా ఈ సెడాన్ ఉంది.

ఆడి A4 సెడాన్ ఇంజన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్‌తో రన్ అవుతుంది. మరో విషయం ఏమిటంటే భారత ప్రభుత్వ BS-VI నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజిన్‌ను నిలిపివేయడం జరిగింది. పెట్రోల్ ఆప్షన్ 190 bhp పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఈ ఇంజిన్‌కు జత చేశారు. దీని టాప్ స్పీడ్ గంటకు 241 కి.మీగా ఉంటుంది.
ఇది కేవలం 7.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ/గం వేగాన్నిఅందుకుంటుంది. ఆడి A4 ఫ్రంట్-వీల్ డ్రైవ్‌లో లభిస్తుంది. దీని మైలేజ్ విషయానికి వస్తే, 14.1 కి.మీల వరకు ఇస్తుంది. 5 సీటర్ ఆప్షన్‌లో లభిస్తున్న ఈ కారులో ప్రయాణికులకు సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. లాంగ్ డ్రైవ్‌లు వెళ్లడానికి అత్యంత అనువుగా ఉంటుంది. ప్రయాణంలో లోపల కూర్చున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు.

వీకెండ్స్ సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు లగజీని ఎక్కువ తీసుకెళ్ళడానికి 460 లీటర్ల బూట్ స్పేస్‌ను కూడా ఈ కారు కలిగి ఉంటుంది. లోపల డజన్ల కొద్ది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ట్రిపుల్-జోన్ ఆటో AC,10.2-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రక్షణ కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటివి ఉన్నాయి.
మిల్కీ బ్యూటీ తమన్నా వద్ద ఇప్పటికే ఖరీదైన లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. రూ. 43.50 లక్షల విలువ కలిగిన BMW 320i, రూ. 75.59 లక్షల ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రూ. 1.02 కోట్లు విలువ చేసే మెర్సిడెస్-బెంజ్ GLE లగ్జరీ కారు, రూ. 29.96 లక్షల మిత్సుబిషి పజెరో స్పోర్ట్ వంటి పలు కార్లు మిల్కీ బ్యూటీ గ్యారేజీలో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








