ఏకంగా రూ.10 కోట్ల కారును కొన్న ఊర్వశి రౌతేలా! స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయే లగ్జరీ కారు ఆమె సొంతం!

బాలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటి ఊర్వశి రౌతేలా (urvashi rautela). ఇటీవల కాలంలో తెలుగులో అగ్రహీరోల పక్కన స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇక్కడ కూడా బాగా పాపులరాటి సంపాదించింది. గత ఏడాది సంక్రాంతి సమయంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సాంగ్స్‌కు స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాతి కానుకుగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాలో కూడా బాలయ్యాతో కూడా చిందులు వేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్న ఊర్వశి రౌతేలా చేతినిండా బాగా సంపాదిస్తునే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ, మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ, ఇంకోవైపు వివిధ కంపెనీలకు యాడ్స్ చేస్తూ బాగానే కూడబెడుతుంది.

సాధారణంగా ఊర్వశి రౌతేలాకు లగ్జరీ లైఫ్‌స్టైల్ అంటే చాలా ఇష్టం. దీనికి అద్దంపడుతూ తాజాగా ఆమె కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ (rolls royce) కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ వివరాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికి, ఇటీవల ఊర్వశి రౌతేలా స్వయంగా కొత్త రోల్స్ రాయిస్ కారు నుంచి కిందకి దిగుతున్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Urvashi Rautela New Rolls Royce

ఈ వీడియోను చూసినట్లయితే కారు వచ్చి ఆగిపోగా, ఒక వ్యక్తి డోర్ ఓపెన్ చేయగానే అందులోంచి అందాల తార ఊర్వశి రౌతేలా హుందాగా కిందికి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అందంగా మెరిసిపోతున్న కారుకు ఆమె మరింత అందాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆటో ఔత్సాహికులు ఆమె కారు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

ఊర్వశి రౌతేలా కొనుగోలు చేసి కారు రోల్స్ రాయిస్ కల్లినన్ (rolls royce cullinan) లగ్జరీ కారు ధర ఇండియా మార్కెట్లో దాదాపు రూ. 10.50 కోట్ల నుండి రూ. 12.25 కోట్ల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. లోపల అత్యంత అందంగా ఉండే కారు డార్క్ టంగ్‌స్టన్, బ్లాక్ డైమండ్, టెంపెస్ట్ గ్రే, జూబ్లీ సిల్వర్, ఆంత్రాసైట్ అనే పలు ఆకట్టుకునే కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Urvashi Rautela Buys Luxury Car

ఈ లగ్జరీ కారులో 5 మంది ఈజీగా ప్రయాణించవచ్చు. ఇన్ని కోట్లు ఖరీదు చేసే కారులో దానికి తగ్గట్టుగానే అత్యంత అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది శక్తివంతమైన 6750 సీసీ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంది. 5000 rpm వద్ద 563 PS హార్స్‌పవర్, 1600 rpm వద్ద 850 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను దీని ఇంజిన్‌కు జోడించారు.

మైలేజ్ విషయానికి వస్తే, 6.6 kmpl వరకు ఇస్తుంది. రోల్స్ రాయిస్ కల్లినన్‌లో డజన్ల కొద్దీ ఫీచర్స్ ఉంటాయి. మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ కండిషనర్, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులను రక్షించడానికి 8-ఎయిర్‌బ్యాగ్‌లు, ఇంకా యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి ఇతర ఆప్షన్స్ ఈ లగ్జరీ కారులో ఉన్నాయి.

Rolls Royce Cullinan Luxury Ca

ఊర్వశి రౌతేలా వద్ద ఈ కొత్త కారు మాత్రమే కాకుండా చాలా కార్లు ఉన్నాయి. ఖరీదైన లంబోర్గిని అవెంటడోర్ కూడా ఆమె వద్ద ఉంది. ప్రస్తుతానికి ఈ కారు అమ్మకాలు దేశీయంగా నిలిపివేశారు. దీని ధర వచ్చేసి రూ. 5.01 నుండి రూ. 9 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

అలాగే గ్యారేజీలో కోట్లు విలువ చేసే చాలా లగ్జరీ కార్స్ ఉన్నాయి. రూ. 1.84 నుండి 1.87 కోట్ల విలువ గల BMW 7 సిరీస్, రూ. 3.50 కోట్ల ఫెరారీ పోర్టోఫినో, రూ. 1.71 కోట్ల బెంజ్ S-క్లాస్ ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 7:00 [IST]
English summary
Actress urvashi rautela buys new rolls royce cullinan luxury car more details
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+