ఖరీదైన BMW 5 సిరీస్‌ కారులో దళపతి విజయ్‌.. లగ్జరీ ఫీచర్లతో పాటు ఇందులో మరెన్నో ప్రత్యేకతలు.!!

దళపతి విజయ్‌ ఇటీవల రూ. 68 లక్షల విలువైన బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కారులో మెరిశారు. కాగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న సినిమా షూటింగ్‌ థాయ్‌లాండ్‌లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దళపతి.. చెన్నై విమానాశ్రయంలో బీఎండబ్ల్యూ కారులో వచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళంతో పాటు తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించిన నటుడు విజయ్.. తమిళ చిత్రసీమలో టాప్ స్టార్. వరుస హిట్‌ చిత్రాలతో సందడి చేస్తున్నారు. విజయ్‌ నటించిన లియో చిత్రం ఇటీవ‌ల విడుద‌లై భారీ విజ‌యం సాధించింది. ఈ సినిమా అనంతరం దళపతి.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.

Vijay-BMW-5-Series-Car

దళపతి విజయ్ నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతున్నట్లు సమాచారం. దీంతో నటుడు విజయ్ కూడా థాయ్‌లాండ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో విజయ్ ఈ ఉదయం తన BMW 5 సిరీస్ కారులో చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

విజయ్‌కి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమంటే చాలా ఇష్టం. అతనికి రోల్స్ రాయిస్ కారు కూడా ఉంది. గతంలో బీస్ట్ సినిమా షూటింగ్ సమయంలో రోల్స్ రాయిస్ కారులో విజయ్‌.. తన సహనటులను ఎక్కించుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన లైక్‌లు సంపాదించింది. ఇప్పుడు బీఎండబ్ల్యూ కారులో బయటకు వచ్చారు.

Vijay-BMW-5-Series-Car

భారత్‌లో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన BMW కార్లలో BMW 5 సిరీస్ ఒకటి. అయితే ఈ కారు రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకటి పెట్రోల్ వేరియంట్ కాగా మరొకటి డీజిల్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ వేరియంట్ 530i M స్పోర్ట్‌ కాగా.. డీజిల్ వేరియంట్ 520d M స్పోర్ట్‌గా విక్రయిస్తున్నారు.

బీఎండబ్ల్యూ 5 సిరీస్‌లో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1995 సీసీ ఇంజిన్ ఉపయోగించగా.. డీజిల్ వేరియంట్‌లో 1998 సీసీ ఇంజిన్ ఉపయోగించారు. పెట్రోల్ ఇంజిన్ 190 బిహెచ్‌పి పవర్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ 252 bhp వద్ద 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Vijay-BMW-5-Series-Car

ఈ రెండు ఇంజన్‌ వేరియంట్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండగా.. ఈ కారు వెనుక చక్రాల డ్రైవ్ కారుగా రూపొందించారు. పెట్రోల్ వెర్షన్ కారు 6.1 సెకన్లలో 100 కి.మీ మరియు డీజిల్ వెర్షన్ 7.3 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఈ కారు లోపలి భాగాన్ని మరిన్ని లగ్జరీ ఫీచర్లతో అప్‌డేట్ చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే, తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌ను. ఈ కారు డ్రైవ్‌ విషయానికొస్తే, గుంతల రోడ్లపై సైతం.. అద్భుతమైన సస్పెన్షన్‌ సెటప్‌ ద్వారా సులభంగా డ్రైవ్‌ చేయవచ్చు. గతుకుల రోడ్లపై సాఫీగా వెళ్తుంది.

టర్నింగుల్లో వేగంగా తిరిగేటప్పుడు కూడా అందులో ఉన్న వ్యక్తికి బాడీ రోల్ లేకుండా ఉండేలా కారును డిజైన్‌ చేశారు. ఈ కారులో నలుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. లోపల మరింత విశాలవంతంగా ఈ కారును రూపొందించారు. వారికి ఎక్కువ లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్ ఫీచర్లను అందించారు.

దళపతి విజయ్ చెన్నై విమానాశ్రయానికి రాగానే.. సెక్యూరిటీ నడుమ విమానాశ్రయంలోకి ప్రవేశించారు. అనంతరం అక్కడున్న ఫొటోగ్రాఫర్లు విజయ్‌ను తమ కెమెరాల్లో క్లిక్‌మనిపించారు. ఏదేమైనా సెలబ్రిటీల కార్లన్నా, బైక్‌లన్నా ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్‌. తెలుగు, తమిళ పరిశ్రమలో చాలా మంది సినీ సెలబ్రిటీల జాబితాలో బీఎండబ్ల్యూ కారు తప్పకుండా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 3, 2023, 21:10 [IST]
English summary
Actress vijay spotted in bmw 5 series luxury car at chennai airport
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+