ఈ హీరోయిన్ లగ్జరీ కారు ధర తెలిస్తే నమ్మలేరేమో! రజనీకాంత్, యువరాజ్ సింగ్ వద్ద కూడా ఇదే మోడల్!
ఇండియాలో లగ్జరీ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. ధనవంతులు, సినీ తారలు, క్రికెటర్లు వంటి సెలబ్రిటీలు మార్కెట్లోకి ఏదైన కొత్త మోడల్ లగ్జరీ కారు విడుదల అయిందంటే వెంటనే దాని గురించి వాకబు చేసుకుని తమ గ్యారేజీలో చేర్చుకుంటారు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ తారల కోట్లు విలువ చేసే టాప్ బ్రాండ్‌లకు చెందిన కార్లతో కెమెరాల కంట పడుతూ, సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. తాజాగా తెలుగు, కన్నడ,హిందీ, పంజాబీ, తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి యామీ గౌతమ్ (Yami Gautam) దిగ్గజ లగ్జరీ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ (BMW)కు చెందిన X7 (ఎక్స్7) అనే కారుతో కనిపించింది. ఖరీదైన కారు నుంచి ఆమె బయటకు దిగుతున్న వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె అభిమానులు షేర్ చేస్తున్నారు.
స్టైలిష్ లుక్‌తో వీడియోలో కనిపిస్తున్న బీఎండబ్ల్యూ X7 గురించి ఆటో ఔత్సాహికులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. ఈ లగ్జరీ కారు భారతీయ మార్కెట్లో రూ.1.29 కోట్ల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని టాప్ వేరియంట్‌ను కొనాలంటే దాదాపు రూ.1.33క కోట్లు చెల్లించాలి. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువగా ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఆన్‌రోడ్ రూ.1.50 కోట్ల నుంచి రూ.1.60 కోట్ల వరకు ఉంటుంది.

కోట్లు విలువ చేసే ఖరీదైన కారులో డజన్ల కొద్ది అధునాత ఫీచర్స్ ఉన్నాయి. ఈ లగ్జరీ SUVని ఇప్పటికే భారత్‌లో రజనీకాంత్, యువరాజ్ సింగ్, అజయ్ దేవగన్, KL రాహుల్ వంటి అనేక మంది ప్రముఖ నటులు, సెలబ్రిటీలు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ suvతో యామిని కనిపించింది. BMW X7 ఇంజిన్ విషయానికి వస్తే, 3.0-లీటర్ 6-సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది శక్తివంతమైన ఇంజిన్.
పెట్రోల్ వేరియంట్ 375 bhp పవర్, 520 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే డీజిల్ 335 bhp పవర్, 700 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను రెండు ఇంజిన్లకు జోడించారు. BMW X7 విలాసవంతమైన కారు. లోపల కూర్చున్న ప్రయాణికులకు లగ్జరీ ఫీచర్స్ అట్రాక్ట్ చేస్తాయి. ఖరీదైన కారును ఎక్కువగా సెలబ్రిటీలు కొంటారు. వారికి నచ్చే డజన్ల ఫీచర్స్ దీనిలో ఉన్నాయి.

కారు లోపల 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 16-స్పీకర్ హార్మన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టం, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ థీమ్ చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. సీట్లు కూడా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంత ఖరీదైన కారులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్‌ను కంపెనీ అందించింది.
ప్రమాద సమయంలో ప్రయాణికుల రక్షణ పరంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇంకా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) , చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటి ఇతర భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. ఈ కారు కంపెనీ xDrive టెక్నాలజీని కలిగి ఉంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్‌ను కూడా అందిస్తుంది. BMW X7 మార్కెట్లో మెర్సిడెస్-బెంజ్ GLS, ఆడి Q7 వంటి వాటితో పోటీ పడుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








