రన్నింగ్ కారులో స్టీరింగ్ వదిలి వెనక్కి వెళ్లిన డ్రైవర్ - వైరల్ వీడియో
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మరియు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేయడానికి వాహన తయారీ సంస్థలు తమ వాహనాల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS) ఫీచర్స్ ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌ను కొందరు వాహన వినియోగదారులు అత్యవసర సమయాల్లో కాకుండా.. దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించిన ఘటనలు కోకొల్లలు అయినప్పటికీ.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, డ్రైవర్ కారు స్టీరింగ్ వదిలి ఎందుకు వెనక్కు వెళ్ళాడు? అనే వివరాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..
గతంలో మహీంద్రా XUV700 కారులో ADAS దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు కియా సెల్టోస్ కారులోని ADAS ఫీచర్ దుర్వినియోగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కియా సెల్టోస్ కారును డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా వెనుక సీటులోకి దూకుతాడు. దీన్ని పక్కనే వున్న మరో వ్యక్తి రికార్డ్ చేస్తాడు.

కియా సెల్టోస్ కారు డ్రైవర్ వెనక్కి వెళ్లిన తరువాత కారు తనంతట తానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. కొన్ని సెకన్ల వ్యవధిలోకి వెనక్కి వెళ్లిన కారు నడుపుతున్న వ్యక్తి మళ్ళీ డ్రైవింగ్ సీటులోకి వచ్చేస్తాడు. తక్కువ నిడివి కలిగిన ఈ వీడియోలో అక్కడ ఏం జరిగింది అనే విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి ADAS దుర్వినియోదానికి సంబంధించిన ఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు.
కియా మోటార్స్ తన లేటెస్ట్ సెల్టోస్ కారులో లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ అందించింది. ఇందులోని అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ చేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360 డిగ్రీ కెమెరా, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మొదలైనవన్నీ వాహన వినియోగదారులకు డ్రైవింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవన్నీ అత్యవసర సమయంలో కారులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడతాయి.

కొత్త కియా సెల్టోస్ కారు ఇన్ఫోటైన్‌మెంట్ అండ్ డ్రైవర్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రెండింటికీ డ్యూయల్ 10.25-ఇంచెస్ పనోరమిక్ డిస్‌ప్లేలు, అలెక్సా హోమ్ టు కార్ కనెక్టివిటీ, ఏడీఏఎస్ 17-అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫంక్షన్స్, వాయిస్ కంట్రోల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పవర్డ్ అడ్జస్ట్‌మెంట్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, కియా కనెక్ట్ టెక్ ఫీచర్స్ పొందుతుంది.
కియా సెల్టోస్ మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 పీఎస్ పవర్ / 144 న్యూటన్ మీటర్ టార్క్), 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ (115 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్) మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 పీఎస్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్).
కియా సెల్టోస్ యొక్క మూడు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమాటిక్, 6 స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ లేదా 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ వంటి ఆప్షన్స్ పొందుతుంది. ఇవన్నీ ఉత్తమ పనితీరును అందిస్తాయి. వీటి ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 20.35 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








