ఆదిపురుష్ రైటర్ కొత్త లగ్జరీ కారు ఇదే - ధర తెలిస్తే షాకవుతారు!

భారతదేశంలో చాలా మంది ప్రముఖులు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన మరియు ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారనే విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రముఖ రైటర్ 'మనోజ్ ముంతాషిర్' 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ క్లాస్' కొనుగోలు చేశారు.

మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir) అంటే తెలియని వారికి కూడా ఆదిపురుష్ రైటర్ అనగానే తప్పకుండా గుర్తోచేస్తుంది. ఈయన భారతదేశంలో ప్రముఖ రైటర్లలో ఒకరు. తేరీ మిట్టి, గల్లియన్, కౌన్ తుజే వంటి ప్రముఖ పాటలను రాసి ఎంతో ప్రజాదరణ పొందిన మనోజ్ ఇటీవల రూ. 2.71 కోట్ల (ఎక్స్ షోరూమ్) మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Manoj Muntashir Buys Mercedes Maybach S Class

ముంతాషిర్ బెంజ్ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఆటోహంగర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో మనోజ్ ముంతాషిర్ కొనుగోలు చేసిన కొత్త కారును చూడవచ్చు. ఇప్పటికే ఈ మోడల్ కారును అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అద్వానీ మరియు ప్రియాంక చోప్రా వంటి ప్రముఖ సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను బట్టి చూస్తే మనోజ్ ముంతాషిర్ కొన్న బెంజ్ కారు ప్రత్యేకమైన ఎమరాల్డ్ గ్రీన్ కలర్ పొందినట్లు తెలుస్తోంది. ఈ సెడాన్ నాటిక్ బ్లూ, డైమండ్ వైట్ బ్రైట్, ఒనిక్స్ బ్లాక్, అబ్సిడియన్ బ్లాక్, మోజావే సిల్వర్ మరియు గ్రాఫైట్ గ్రే అనే కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. ఈ లగ్జరీ సెడాన్ డ్యూయెల్ టోన్ మాన్యుఫ్యాక్చర్ పెయింట్ స్కీమ్ కూడా పొందుతుంది.

Manoj Muntashir Buys Mercedes Maybach S Class

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ (Mercedes Maybach S-Class)

అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ సెడాన్ 12.8 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి బర్మెస్టర్ సౌండ్ సిస్టం పొందుతుంది. అంతే కాకుండా ఇందులో మసాజ్ సీట్లు, సీట్ వెంటిలేషన్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్స్, డోర్ ప్యానెల్స్ వంటి మరెన్నో అప్డేటెడ్ సౌకర్యాలను అందిస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఎస్-క్లాస్ సెడాన్ 4.0 లీటర్ వీ8 ట్విన్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 516 bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ సెడాన్ కేవలం 4.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతంగా అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది.

చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ లగ్జరీ సెడాన్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ (Mercedes Maybach S-Class) మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, March 5, 2024, 11:36 [IST]
English summary
Adipurush writer manoj muntashir buys mercedes maybach s class worth rs 2 71 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+