భూమి, చంద్రుడు.. ఓ సెల్ఫీ... సూర్యుడి వైపుగా ప్రయాణంలో క్లిక్‌మనిపించిన ఆదిత్య L1
అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సూర్యుడిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 కీలక ఫోటోలను పంపింది. ఆదిత్య L1 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ప్రయోగించారు. ఇటీవలే రెండోసారి కక్ష్య పెంచారు. ప్రస్తుతం ఆదిత్య L1 282*40225 కి.మీ కక్ష్యలోకి ప్రవేశించింది.
సుమారు నాలుగు నెలల సుదీర్ఝ ప్రయాణం అనంతరం 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్‌కు చేరుకోనుంది. ఈ పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిపై నిరంతరం పరిశోధనలు చేయడం ఆ సమాచారం ఆధారంగా సౌర తుఫాన్‌ల కారణంగా అంతరిక్షంలోని ఉపగ్రహాలకు హాని జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని భావిస్తోంది.

అయితే తాజాగా ఆదిత్య L1 సూర్యుడి దిశగా ప్రయాణం చేస్తోంది. ఈ సమయంలో భూమి ఫోటోను తీసింది. ఇందులో భూమి సహా చంద్రుడి ఫోటో కూడా ఉంది. దీంతోపాటు ఆదిత్య L1 సెల్ఫీ కూడా తీసుకుంది. ఈ ఫోటోలను ఇస్రోకు పంపింది. ఈ ఫోటోలను ఇస్రో తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది.
ఆదిత్య ఎల్1లో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య, హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, సోలార్ ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మాగ్మెటోమీటర్ వంటి పేలోడ్‌లున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని తట్టుకొనే విధంగా వీటిని రూపొందించారు.

ఇవి సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ సహా సూర్యుడి వెలువరి వాతావరణంపై అధ్యయనం చేయనున్నాయి. ఈ సమాచారాన్ని తిరిగి భూమిపైకి పంపిస్తాయి. ఇప్పటి వరకు అమెరికా, జపాన్, చైనా, యూరప్ సూర్యుడి అధ్యయనం కోసం అంతరిక్ష నౌకలను పంపాయి. ఈ జాబితాలో భారత్ చేరింది.
సూర్యుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం. అందువల్ల సూర్యుడిపై అధ్యయనం చేయడం ద్వారా ఇతర నక్షత్రాల స్వభావం గురించి తెలుసుకోవచ్చని ఇస్రో భావిస్తోంది. ఇది పాలపుంతలోని ఇతర నక్షత్రాలు, గ్రహాల గురించి కీలక సమాచారం తెలుసుకోవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది.
ఆదిత్య L1ను తొలుత భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెడతారు. అనంతరం దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపిస్తారు. అనంతరం ఎల్1 పాయింట్ వైపు ఆదిత్య L1 ప్రయాణం సాగేలా చర్యలు తీసుకుంటారు. భూమి గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. ఆ తర్వాత క్రూజ్ దశ ప్రారంభం అవుతుంది. మొత్తం 125 రోజుల ప్రయాణం తర్వాత లాంగ్రేజీ పాయింట్‌కు చేరుకుంటుంది.
ఆదిత్య L1లో ఉన్న విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్... నిమిషానికి ఒక్కో ఫోటోను పంపుతుంది. అంటే రోజుకు 1440 ఫోటోలను పంపుతుంది. ఇది 5 సంవత్సరాలు పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు భూమిపైనుంచి సూర్యుడిపైన పరిశోధనలు చేసిన ఇస్రో.. ఇప్పటి నుంచి సూర్యుడికు చేరువలో పరిశోధనలు చేయనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








