అల్లాయ్‌ వీల్స్‌ వినియోగిస్తున్నారా.. ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

ప్రస్తుతం చాలా కార్లు అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటున్నాయి. అల్లాయ్‌ వీల్స్‌ కారణంగా కారు లుక్‌ కొంత ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అల్లాయ్‌ వీల్స్‌ ఎంపికతో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వీల్స్‌తో కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయి.

అల్యూమినియం లేదా మెగ్నిషియం లేదా రెండింటి మిశ్రమంతో అల్లాయ్‌ వీల్స్‌ను తయారు చేస్తారు. సాధారణంగా హై ఎండ్‌ మోడల్‌, లగ్జరీ కార్లు మాత్రమే ఇలాంటి వీల్స్‌ను కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతం బడ్జెట్‌ రేంజ్‌ కార్లు కూడా అల్లాయ్‌ వీల్స్‌ ఎంపికతో అందుబాటులోకి వస్తున్నాయి.

advantages and disadvantages of alloy wheels

ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది : స్టీల్‌ వీల్స్‌తో పోల్చితే అల్లాయ్‌ వీల్స్‌పై వాహన ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. అల్లాయ్‌ వీల్స్‌ బరువు కొంచెం తక్కువగా ఉంటుంది. ఫలితంగా తక్కువ శక్తి అవసరం అవుతుంది. అయితే కనిష్ఠ స్థాయిలోనే స్టీల్‌ వీల్స్‌ కంటే అల్లాయ్‌ వీల్స్‌లో మైలేజ్‌ పెరుగుతుంది.

సులభంగా హ్యాండిల్‌ చేయవచ్చు: అల్లాయ్‌ వీల్స్‌ బరువు తక్కువగా ఉండడం కారణంగా స్టీరింగ్‌ను తక్కువ శక్తితోనే నియంత్రణ చేయవచ్చు. సాధారణ వీల్స్‌తో పోలిస్టే అల్లాయ్‌ వీల్స్‌ కలిగిన వాహనాలను సులభంగా నియంత్రించవచ్చు. అల్లాయ్‌ వీల్స్‌ ట్యూబ్‌లెస్‌ టైర్లకు సరిగా సరిపోతాయి. టైర్‌ ప్రజర్‌ను సరైన స్థాయిలో ఉంచుతాయి.

advantages and disadvantages of alloy wheels

తుప్పు పట్టవు : సాధారణ స్టీల్‌ టైర్ల తరహాలో అల్యూమినియం టైర్లు తుప్పు పట్టవు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు, ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో నివాసం ఉండేవారికి అల్లాయ్‌ వీల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్టీల్‌ వీల్స్‌ కంటే అల్లాయ్‌ వీల్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

బ్రేకింగ్‌ పనితీరు మెరుగుపడుతుంది : అల్లాయ్‌ వీల్స్‌తో బ్రేకింగ్ పనితీరు మెరుగుపడుతుంది. అల్లాయ్‌ వీల్స్‌లో మెరుగైన వెంటిలేషన్‌ను కలిగి ఉంటాయి. అధిక ఉష్టోగ్రతను కూడా హ్యాండిల్‌ చేయగలుగుతాయి. డ్రైవింగ్‌ సమయంలో వెలువడే వేడిని అల్లాయ్‌ వీల్స్‌ సమర్థవంతంగా తట్టుకోగలవు. ఫలితంగా మంచి బ్రేకింగ్‌ పనితీరు కనబరుస్తాయి.

ధృడంగా ఉండవు : అల్లాయ్‌ వీల్స్‌ కంటే స్టీల్‌ వీల్స్‌ ఎక్కువ ధృడంగా ఉంటాయి. ఏదైనా ప్రమాదంలో స్టీల్‌ వీల్స్‌ కేవలం బెండ్‌ అవుతాయి. అదే అల్లాయ్‌ వీల్స్‌ పూర్తిగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. గుంతల రోడ్లు సహా ఇతర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అల్లాయ్‌ వీల్స్ కంటే స్టీల్‌ వీల్స్ ఎంచుకోవడం మంచిది.

అల్లాయ్‌ వీల్స్‌ ధర ఎక్కువ : స్టీల్‌ వీల్స్‌ కంటే అల్లాయ్‌ వీల్స్‌ సుమారు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ధర కలిగి ఉంటాయి. మరియు మరమ్మతు చేసేందుకు అవకాశం ఉండదు. ఎటువంటి నష్టం జరిగినా.. కొత్తగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 18, 2023, 16:22 [IST]
English summary
Advantages and disadvantages of alloy wheels in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+