పెట్రోల్‌కి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌.. దీని ద్వారా లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయని తెలుసా.!!

తమ దేశాన్ని పర్యావరణ హితంగా, కాలుష్య రహిత దేశంగా మార్చుకునేందుకు అనేక దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అందులో భారత్‌ ఒకటి. గత పదేళ్లుగా ఇంధన ఉద్గారాలను తగ్గించడంపై దేశం దృష్టి సారిస్తోంది. అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో అనేక దేశళాలు ఇథనాల్ ఇంధనాన్ని ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు కృషి చేస్తున్నాయి.

పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇథనాల్‌ ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇథనాల్‌, గ్యాసోలిన్‌ మిశ్రమాన్ని తగినంత నిష్పత్తిలో వినియోగించాలని భావిస్తున్నారు. ఇథనాల్‌ను కెమికల్‌ భాషలో ఇథైల్‌ ఆల్కహాల్‌ అని పిలుస్తారు. ఇది మొక్కజొన్న, చెరకు, ధాన్యం లేదా పరోక్షంగా కాగితం వ్యర్థాల నుంచి సేకరించే ఒక రకమైన ఆల్కహాల్‌ ఇది.

Ethanol-Fuel

ఇథనాల్ మరియు గ్యాసోలిన్ మిశ్రమం పర్యావరణంలోకి తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంతే కాకుండా ఇది ప్రకృతిలో పరిశుభ్రమైనదిగా నిపుణులు పరిగణించారు. అంతేకాకుండా ఇది ఇంధనం యొక్క ఆక్టేన్ రేటింగ్‌ను పెంచడం ద్వారా కారును మెరుగైన ఆకృతిలో ఉంచుతుంది. ఇంకా అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారణంగానే ప్రభుత్వాలు, కార్ మేకర్లు దీనిని ఆమోదించారు.

అయితే కొన్ని రకాల ఫ్యూయెల్స్‌ మాదిరిగా, ఇథనాల్ ఏ పర్యావరణ వ్యవస్థలోనూ సహజంగా ఏర్పడదు. ఇది కిణ్వ ప్రక్రియ(ఫర్మెంటేషన్‌), స్వేదనం(డిస్టిలేషన్‌) ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ క్రమంలో ఇథనాల్‌ కాలుష్య రహిత పర్యావరణాన్ని ఏర్పరుస్తుందని మాత్రమే మనకు తెలుసు.. కానీ ఇథనాల్‌ వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా అన్నాయి. మరి ఇథనాల్‌ ద్వారా కలిగే ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

Ethanol-Fuel

ప్రయోజనాలు(Advantages): మిగిలిన ఫ్యూయెల్‌తో పోలిస్తే ఇథనాల్ అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న ఇంధన వనరు. ప్రతి దేశం దానిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొక్కజొన్న, చెరకు లేదా ధాన్యాన్ని దాదాపు ప్రతి దేశంలోనూ పండిస్తారు. ఇది సహజంగా దొరికే ఫ్యూయెల్స్‌తో పోలిస్తే ఉత్పత్తిని మరింత మెరుగ్గా చేస్తుంది.

ఇథనాల్‌ ద్వారా పర్యావరణానికి కాలుష్యం ఏర్పడదు. ఆటోమొబైల్స్‌కు శక్తినివ్వడానికి ఇథనాల్ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల పర్యావరణంలో టాక్సిన్‌లు గణనీయంగా తగ్గుతాయి. ఇథనాల్ మరియు గ్యాసోలిన్ మిశ్రమం పర్యావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల ఉద్గారాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇది ఫ్యూయెల్స్‌తో పోలిస్తే శుభ్రంగా మండుతుంది.

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వినియోగంతో ప్రమాదకరమైన గ్రీన్‌హౌస్ వాయువులు, ఉద్గారాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఇథనాల్.. కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని మాత్రమే విడుదల చేస్తుంది. ఇది పర్యావరణ క్షీణతపై చాలా తక్కువ ప్రభావాలను కలిగి ఉంటుంది. అలాగే, ఇథనాల్‌ వినియోగం వల్ల ఇతర ఇంధనాల వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని తగ్గించవచ్చు.

ఇథనాల్ జీవ ఇంధనం కాబట్టి, అందరికీ సులభంగా అందుబాటులో ఉంటుంది. అన్ని ఉష్ణమండల వాతావరణాలు చెరకు పెరుగుదలకు సహకరిస్తాయి. ఇథనాల్ వినియోగం పెరిగినప్పుడు, ముడి పదార్ధాల తగినంత సరఫరాను సృష్టించడానికి చెరకు, మొక్కజొన్న మరియు ధాన్యాల తోటలు అవసరమవుతాయి. ఇది మరింత ఇథనాల్ ఇంధన ప్రాసెసింగ్ ప్లాంట్లు, మరిన్ని ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతుంది.

దుష్ప్రయోజనాలు(Disadvantages): ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌పై ప్రజాదరణ పెరుగుతున్నప్పటికీ, ఇందులో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మొక్కజొన్న, చెరకు, ధాన్యాల నుండి ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఇథనాల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చాలంటే ఈ పంటలను పెద్ద ఎత్తున సాగు చేయాలి. దానికి ఎకరాల కొద్దీ చాలా భూమి అవసరం.

పులియబెట్టిన మొక్కజొన్న లేదా ధాన్యాన్ని స్వేదనం(Distillation) చేసే ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. ఇంకా దీనికి అధిక ఉష్ణోగ్రతలు ఉవసరం. తద్వారా అధిక మొత్తంలో గ్రీన్‌ హౌస్‌ వాయువులును విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని కలిగిస్తాయి.

ఇథనాల్ తయారీలో ప్రధాన పదార్థం మొక్కజొన్న. ఇథనాల్ ఇంధనానికి డిమాండ్ పెరిగితే, మొక్కజొన్న ధర కూడా పెరుగుతుంది. తద్వారా ఇథనాల్ ఉత్పత్తి వ్యయంపై ప్రభావం చూపిస్తుంది. ఇంధనం కోసం కాకుండా మొక్కజొన్నను ఉపయోగించే ఇతర వినియోగదారులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా రైతులు కూడా ఇతర పంటలు కాకుండా వీటిపైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. దీని ద్వారా ఇతర పంటల ధరలు కూడా పెరుగుతాయి.

స్వచ్ఛమైన ఇథనాల్ నీటితో ఎక్కువ ఇంటరాక్షన్‌ను కలిగి ఉంటుంది. వాహనాలకు శక్తినిచ్చే గ్యాసోలిన్ మరియు ఇథనాల్ మిశ్రమాలతో ఇది అదే ఇంటరాక్షన్‌ను కలిగి ఉంటుంది. నీరు నిల్వ లేదా ఇంధన ట్యాంక్‌లోకి ప్రవేశించినప్పుడు, అది ట్యాంక్ దిగువకు వెళ్లే అవకాశం ఉంది. దీని ద్వారా వాహనంలో చిన్న మరియు పెద్ద ఇంజిన్ సమస్యలకు దారి తీస్తుంది.

స్వచ్ఛమైన ఇథనాల్ ఆవిరి కావడం కష్టం. తద్వారా చలి వాతావరణ పరిస్థితుల్లో కారును స్టార్ట్ చేయడం దాదాపు కష్టతరంగా ఉంటుంది, అందుకే చాలా మంది వాహన యజమానులు అందులో కొద్దిగా పెట్రోల్‌ను వినియోగించాలని సూచించారు. ఉదాహరణకు, 15 శాతం పెట్రోలియం మరియు 85% ఇథనాల్‌ను ఉపయోగించే E85 కార్లు.

ప్రతికూలతలు లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకని, ఇథనాల్ కొంచెం ఎక్కువ ప్రయోజనాన్ని కలిగి ఉంది. అందుకే దీని కోసం ఎక్కువగా నిరీక్షిస్తున్నారు. ఇది సరసమైన ధర మరియు అధిక మైలేజ్ తో సహా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 30, 2023, 15:12 [IST]
English summary
Advantages and disadvantages of ethanol fuel here is in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+