కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

సాధారణంగా వాహనాలలో మిర్రర్స్(అద్దాలు) యొక్క ప్రాముఖ్యత గురించి వాహనదారులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమాదాల నుంచి బయటపడటానికి మిర్రర్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ కారణంగానే వాహనంలో రియర్ వ్యూ మిర్రర్స్, సైడ్ వ్యూ మిర్రర్స్ మరియు బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ ఉంటాయి.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

రియర్ వ్యూ మిర్రర్ మరియు సైడ్ వ్యూ మిర్రర్ వంటివి ప్రతి కార్లలోనూ ఉంటాయి. డ్రైవర్లు వెనుక నుండి వచ్చే వాహనాలను చూడటానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. కారుకి ఇరువైపులా సైడ్ వ్యూ మిర్రర్లు అమర్చబడి ఉండటం సర్వసాధారణంగా అందరూ చూసి ఉంటారు.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

కారులో అమర్చిన మిర్రర్స్ ద్వారా వెనుక నుండి వచ్చే వాహనాలను గుర్తించి వాహనదారుడు అప్రమత్తమవుతాడు. అయితే కారులో అమర్చిన కొన్ని సైడ్ వ్యూ మిర్రర్ మధ్యలో ఒక చిన్న అద్దం ఉండటం చాలామంది చూసి ఉంటారు. ఇది చూసిన చాలామందికి ఒక అద్దం మధ్యలో ఇంకో అద్దం ఎందుకు ఉంది అనే ప్రశ్న తలెత్తి ఉండవచ్చు. దీనినే బ్లైండ్ స్పాట్ మిర్రర్ అంటారు.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

బ్లైండ్ స్పాట్ మిర్రర్ గురించి చాలా మందికి తెలిసి ఉన్నప్పటికీ, తక్కువ మందికి తెలియకపోవచ్చు. కావున ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ విషయానికి వస్తే, డ్రైవర్‌కు కనిపించని ప్రాంతాలను బ్లైండ్ స్పాట్స్ అంటారు. డ్రైవర్ చాలా ప్రాంతాలను రియర్ వ్యూ మిర్రర్ మరియు సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా చూడలేరు.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

ఈ సమయంలో డ్రైవర్ ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ ద్వారా అలంటి ప్రాంతాలను చూడవచ్చు. వాహనంలో అమర్చిన మిర్రర్స్ కి దుమ్ము మొదలైనవి అంటుకోవడం వల్ల సరైన దృశ్యమానతను కలిగి ఉండవు. కావున ఇందులో అమర్చిన బ్లైండ్ స్పాట్ మిర్రర్ వల్ల సులభంగా వాహనాలను గుర్తించవచ్చు.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

వాహనాలను నడిపే డ్రైవర్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, వెనుక వచ్చే వాహనాలను కూడా గమనిస్తూ ఉండాలి. ఒక వేళా వాహనాలను గుర్తించని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలను తగ్గించడానికి బ్లైండ్‌ స్పాట్ మిర్రర్స్ సైడ్ వ్యూ మిర్రర్‌లలో అమర్చారు.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

బ్లైండ్‌స్పాట్ మిర్రర్స్ మూలల్లో వచ్చే వాహనాలను కూడా ట్రాక్ చేయడానికి సహాయపడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ కారు డ్రైవర్లకు చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. వాహనంలో అమర్చిన బ్లైండ్‌స్పాట్ మిర్రర్స్ డ్రైవర్లకు అదనపు దృశ్యమానతను అందిస్తాయి.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ కేవలం వాహనాలను మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్లే పాదచారులను కూడా గుర్తించడానికి చాలా సహాయపడతాయి. బ్లైండ్ స్పాట్ లో కనిపించే దృశ్యాలు సాధారణ సైడ్ వ్యూ మిర్రర్స్ లో కనిపించవు. ఇది మాత్రమే కాకుండా వర్షాకాలంలో వర్షపు నీరు ఈ బ్లైండ్ స్పాట్ మిర్రర్ పై పడినప్పుడు కూడా చక్కని దృశ్యాన్ని చూపిస్తుంది.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

కదిలే కారు చుట్టూ ఏ వాహనాలు ఉన్నాయి, అని గుర్తించడంలో బ్లైండ్‌ స్పాట్ మిర్రర్స్ సహాయపడతాయి. మీరు బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ కలిగి ఉంటే, ఇతర వాహనాల నుండి కొంత దూరాన్ని నిర్వహిస్తూ కారును మరింత సురక్షితంగా నడపవచ్చు. కొంతమంది రివర్స్ గేర్ లో కారు డ్రైవ్ చేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇలాంటి తప్పిదాలు జరగకుండా కూడా ఈ మిర్రర్స్ ఉపయోగపడతాయి.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ ఇతర వాహనాలు లేదా వస్తువులను ఢీకొనకుండా సురక్షితంగా కారును పార్క్ చేయడంలో సహాయపడతాయి. ఇది మాత్రమే కాకుండా కారుని పార్కింగ్ స్థలం నుండి సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కూడా ఉపయోగపడతాయి.

కారులో బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వల్ల ఉపయోగాలు ఎన్నో.. మీకు తెలుసా!!

ప్రపంచంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. బ్లైండ్ స్పాట్ ప్రాంతంలోకి వచ్చే వాహనాలను సరిగా పరిశీలించకపోవడం దీనికి ప్రధాన కారణాలలో ఒకటి. సైడ్ వ్యూ మిర్రర్స్ లోపల బ్లైండ్‌స్పాట్ మిర్రర్స్ అటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తాయి. కావున వాహనదారులు ఇటువంటి బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ కారులో తప్పకుండా అమర్చుకోవాలి. అప్పుడే కొంతవరకు ఈ కోవకు చెందిన ప్రమాదాలను నివారించుకోగలము.

Most Read Articles

English summary
Advantages of blind spot mirrors used in cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X