రిజిస్ట్రేషన్ అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పనే లేదు.. ధర చాలా తక్కువ!

ఆధునిక కాలంలో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ వాహనాల ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఈ కథనంలో కేవలం లక్ష రూపాయల వద్ద లభించే ఓ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ కారు కొనాలంటే రూ. లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. కేవలం ఒక లక్ష రూపాయలకే ఎలక్ట్రిక్ కారు అంటే.. కొందరికి నమ్మశక్యం కాదు. అయినప్పటికీ ఇది నిజమే. యకూజా (Yakuza) కంపెనీ 'కరిష్మా' (Karishma) అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే కారు టాటా నానో కంటే కొంత చిన్నదిగా అనిపిస్తుంది.

Affordable Yakuza Karishma Electric Car

వీడియోలో గమనిస్తే.. యాకుజా కరిష్మా ఎలక్ట్రిక్ కారును చూడవచ్చు. ఇది చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ.. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దీనికిదే సాటి అని చెప్పాలి. కేవలం రెండు డోర్స్ కలిగిన ఈ కారు రెండు సీట్లను కలిగి ఉంది. డ్రైవర్ కోసం ఓకే సీటు ఉంది. వెనుక ఒక సీటు ఉంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది గంటకు 20-30 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది.

యాకుజా కరిష్మా ఎలక్ట్రిక్ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారులో గ్లోస్ బ్లాక్ గ్రిల్, హాలోజన్ హెడ్‌లైట్‌, దానికి పైన ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో కూడా అనుకూలంగా ఉంది. వెనుక వైపు హాలోజన్ లైట్స్, స్టాప్ లైట్ మరియు ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందుతుంది. ఈ కారు చిన్నగా ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో కూడా సులభంగా ముందుకు వెళ్ళడానికి అనుమతిస్తుంది.

Affordable Yakuza Karishma Electric Car

యాకుజా కరిష్మా యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపల ఉన్న డ్రైవర్ సీటు ముందుకు, వెనుకకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ వీల్, చిన్న డిజిటల్ స్క్రీన్, ఓడోమీటర్, పవర్ విండోస్, స్టార్ట్ స్టాప్ బటన్ మరియు ఫార్వర్డ్ & రివర్స్ వంటి వాటిని ఎంచుకోవడానికి రోటరీ గేర్ నాబ్ ఉంటుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.

ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 1250 వాట్స్ ఎలట్రిక్ మోటారును పొందుతుంది. ఈ మోటారు మీద కంపెనీ ఒక సంవత్సరం వారంటీ అందిస్తుంది. కంపెనీ నిర్దేశించిన కాలంలో మోటారును ఏదైనా జరిగితే ఉచితంగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో 60V 45Ah బ్యాటరీ ఉంటుంది. దీనిని టైప్-2 ఛార్జర్ ద్వారా 6-7 గంటల సమయంలో 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 50-60 కిమీ రేంజ్ అందిస్తుంది.

తక్కువ ధర వద్ద ఎలక్ట్రిక్ కార్లను వినియోగించాలనుకునే వారు లేదా రోజు వారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు ప్రయాణించాలనుకునే వారికి యాకుజా కరిష్మా ఎలక్ట్రిక్ ఉత్తమ ఎంపిక అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం తప్పకుండా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు స్పీడ్ తక్కువ కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరం లేదు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, May 20, 2024, 9:04 [IST]
English summary
Affordable yakuza karishma electric car price and details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+