అందాల భామలకు అందమైన కానుకలివ్వనున్న స్కొడా

గడచిన సంవత్సరం ముంబైలో జరిగిన పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా (పిఎఫ్ఎమ్ఐ) 2011 అందాల ప్రదర్శనలో కనిష్టా ధనకర్ పాంటలూన్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2011 కిరీటాన్ని దక్కించుకోగా.. అంకితా షోరే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2011 కిరీటాన్ని, అలాగే హస్లీన్ కౌర్ మిస్ ఇండియా ఎర్త్ 2011 కిరీటాలను సొంతం చేసుకున్నారు. వీరికి ఫ్యాబియా కారును స్కొడా బహుమతిగా ఇచ్చింది.
2011లో తొలిసారిగా స్కొడా పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా (పిఎఫ్ఎమ్ఐ) 2012 కాంటెస్ట్‌కు అధికారిక కార్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. ఈ కార్యక్రమం వియవంతం కావడంతో వరుసగా రెండోసారి కూడా ఈ ఈవెంట్ స్కొడానే అధికారిక కార్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన ముగ్గురు విజేతలకు ర్యాపిడ్ లేదా ఫ్యాబియా కార్లను బహుమతిగా ఇవ్వొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








