ఎగిరే డ్రోన్ అంబులెన్స్‌తో ప్రాణాలు గట్టెక్కుతాయ్..

By Ravi

ఇప్పుడున్న రద్దీలో రోడ్లపై అంబులెన్స్‌కు దారి దొరకడమే కష్టంగా మారిన పరిస్థితి నెలకొంది. మనిషి ప్రాణాపాయంలో ఉంటే, అతను ఆస్పత్రికి చేరే లోపే ఈ రద్దీ కారణంగా ప్రాణాలు వదిలేయాల్సిన దుర్ఘతి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, రోడ్డుపై కాకుండా నేరుగా గాలిలోనే పేషెంట్‌ని లేదా అత్యవసర చికిత్స అవసరమైన వారిని తరలించేందుకు ఓ సరికొత్త డ్రోన్ అందుబాటులోకి రానుంది.

టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందిన ఆగ్రోడిజైన్ అనే కంపెనీ డ్రోన్ అంబులెన్స్ కాన్పెప్ట్‌ను డిజైన్ చేసింది. ఈ డ్రోన్ అంబులెన్స్‌ను జిపిఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే ఇది సంఘటనా స్థలానికి చేరుకోగలదు.

ఈ డ్రోన్ అంబులెన్స్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

ఎగిరే డ్రోన్ అంబులెన్స్

ఈ కంపెనీ ఫౌండర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ రోల్స్టన్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకూ పలు కంపెనీలు పిజ్జాలు, చిన్నచిన్న వస్తువులను క్షణాల్లో డెలివరీ చేసేందుకు చిన్నతరహా డ్రోన్‌లను తయారు చేశారని, ఈ కాన్సెప్ట్ నుంచి తమ అంబులెన్స్ డ్రోన్ పుట్టుకొచ్చిందని తెలిపారు.

ఎగిరే డ్రోన్ అంబులెన్స్

తమ డిజైన్ టీమ్ అహోరాత్రాలు శ్రమించి ఈ ఫుల్‌సైజ్ అంబులెన్స్ డ్రోన్‌ను డిజన్ చేసినట్లు తెలిపారు. ఈ డ్రోన్‌ను నడపటానికి పైలట్ అవసరం లేదు. రిమోట్‌గా ఎక్కడి నుంచైనా దీనిని ఆపరేట్ చేయవచ్చు.

ఎగిరే డ్రోన్ అంబులెన్స్

ఈ డ్రోన్ అంబులెన్స్ ఓ చిన్నపాటి కారు అంత స్థలాన్ని, పరిమాణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది కాబట్టి, ఎలాంటి చోట ప్రమాదం జరిగినా సరే ఇది సులువుగా అక్కడికి చేరుకోలదు. అదే రెగ్యులర్ హెలికాఫ్టర్ అయితే, ఇరుకుగా ఉండే ప్రదేశాలకు చేరుకోవటం కష్టమవుతుంది.

ఎగిరే డ్రోన్ అంబులెన్స్

భవిష్యత్తులో ఇలాంటి అంబులెన్స్ డ్రోన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో ఆస్పత్రికి చేరలేని కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తగ్గే ఆస్కారం ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Wednesday, February 18, 2015, 17:17 [IST]
English summary
Agrodesign, a company that usually works in partnership with software companies has decided to venture into life saving services by designing a drone ambulance concept.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+