Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 22 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్స
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Sports
RCB vs KKR: జోరుమీదున్న బెంగళూరు హిట్టర్! కోల్‌కతాను కలవరపెడుతున్న ఆ ఇద్దరి ఫామ్! విజయం ఎవరిది!
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?
భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా నష్టాలను చవి చూసాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత కూడా అనేక ప్రైవేట్ కంపెనీలు భారీ నష్టాలను చూశాయి. దీని ఫలితంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాన్ని తగ్గించాయి. ప్రైవేటు రంగం మాత్రమే కాదు, ప్రభుత్వాలు కూడా ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నాయి.

కరోనా సమయంలో ప్రభుత్వ రంగాలు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఆర్టీఓ కార్యాలయాలు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మరియు ఫ్యాన్సీ నంబర్ల అమ్మకాలలో కొంత ఎక్కువ శాతం సంపాదిస్తాయి. లాక్ డౌన్ సమయంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మరియు ఫ్యాన్సీ నెంబర్స్ అమ్మకాలు తగ్గిపోవడంతో ఆర్టీఓ కార్యాలయాలకు కూడా ఆదాయం తగ్గిపోయిది.

కరోనా వల్ల సమస్యలను ఎదుర్కొన్న ఆర్టీఓలలో ఒకటి, గుజరాత్ లోని అహ్మదాబాద్ ఆర్టీఓ. భారతదేశంలో కరోనావైరస్ సమస్య మొదలయ్యే ముందు, అహ్మదాబాద్ యొక్క ఆర్టీఓ కార్యాలయం ఫ్యాన్సీ నెంబర్స్ యొక్క వేలం వల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందింది. కరోనా వైరస్ ప్రబలడంతో ఈ ఆర్టీఓ ఆదాయం కూడా భారీగా పడిపోయింది.
MOST READ:ఖరీదైన లగ్జరీ కారుకి నిప్పంటించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్ ; ఎందుకో తెలుసా ?

సాధారణంగా కొంతమంది వాహనప్రియులు తమకు ఇష్టమైన వాహనాల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఈ కారణంగానే చాలామంది వాహనదారులు తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు.

అహ్మదాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ పొందటానికి ఏకంగా రూ. 32 లక్షలు బిడ్ చేశాడు. తమ అభిమాన రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి యితడు ఇంత పెద్ద మొత్తాన్ని వేలం పాటలో పాడాడు.
MOST READ:బాలీవుడ్ నటి చేసిన పనికి ఆనందంలో మునిగిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఎం చేసిందో తెలుసా?

ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలంలో పాల్గొన్న వ్యక్తి సకాలంలో డబ్బు చెల్లించలేదు. ఈ కారణంగా ఆర్టీఓ కార్యాలయం వారు వేలంలో అందుకున్న నెంబర్‌ను రద్దు చేసింది. దీని గురించి అహ్మదాబాద్ ఆర్టీఓ కార్యాలయ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, అహ్మదాబాద్ చెందిన ఒక వ్యక్తి కొత్త కారు కొన్నట్లు చెప్పారు.

వారు తమకు ఇష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకి ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ పొందడానికి అతడు రూ. 32 లక్షలు బిడ్ చేశారు. వేలంపాటలో ఇంత పెద్దమొత్తంలో పాడిన ఆ వ్యక్తి కోసం ఆ నెంబర్ రిజర్వు చేశారు.
MOST READ:ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త ట్రాఫిక్ సిగ్నెల్ సిస్టం ఏర్పాటు.. ఎక్కడో తెలుసా?

ఇచ్చిన గడువులోపు డబ్బు చెల్లించలేకపోవడంతో తన బిడ్డింగ్ ప్రక్రియ రద్దు చేయబడిందని ఆ వ్యక్తి చెప్పాడు. నవంబర్‌లో 11,600 కొత్త వాహనాలు అహ్మదాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయంలో నమోదు చేయబడ్డాయి.

వీరిలో 3,022 వాహన యజమానులు తమకు ఇష్టమైన రిజిస్ట్రేషన్ నెంబర్ పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్‌లో అహ్మదాబాద్‌కు చెందిన ఆర్టీఓ కార్యాలయం దాదాపు రూ. 1.09 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.
MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా

సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లలో అహ్మదాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఫ్యాన్సీ నెంబర్స్ వేలం ద్వారా రూ. 2.36 కోట్లు సంపాదించింది. కరోనా వైరస్ సమస్య వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫ్యాన్సీ నెంబర్స్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం నిజంగా ఆశ్చర్యమే. దీన్ని బట్టి చూస్తే వాహనప్రియులకు వాహనాలపై ఎంత వ్యామోహం ఉందో అర్థమవుతుంది.