ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

వాహనాలపట్ల అమితమైన మక్కువ కలిగిన చాలామంది వివిధ రకాల బైక్‌లను సేకరిస్తూ డ్రైవ్ చేస్తుంటారు. ఇందులో సెలబ్రెటీలు మరియు రాజకీయ నాయకులు మొదలైన వారు ఉంటారు. భారతదేశంలో చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ యాక్టర్స్ మరియు వ్యాపారవేత్తలు మొదలైనవారు ఒకటికంటే ఎక్కువ లగ్జరీ బైకులను కలిగి ఉన్నారు.

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చెందిన ఒక వ్యక్తికి సుమారు 3.5 కోట్ల రూపాయల విలువైన 20 బైక్‌లను కలిగి ఉన్నాడు. అతని వద్ద ఉన్న బైకులన్నీ కూడా దాదాపు క్రూయిజర్ బైక్‌లు. అతని వద్ద ఉన్న బైకులలో బజాజ్ అవెంజర్ నుండి హార్లే డేవిడ్సన్ వరకు ఉన్నాయి.

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

ఈ వ్యక్తి 2002 నుండి క్రూయిజర్ బైక్‌లను సేకరిస్తూ వచ్చాడు. ఇప్పటికి మొత్తం వారు అనేక క్రూయిజర్ బైక్‌లను కలిగి ఉన్నారు. ఈ బైకులన్నీ లగ్జరీ బైకులు, కావున ఇవి భారతీయ రోడ్లపై చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ బైకుల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

MOST READ:ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి సిద్దమవుతున్న లంబోర్ఘిని; పూర్తి వివరాలు

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

ఇండియన్ రోడ్‌మాస్టర్:

ఇండియన్ రోడ్‌మాస్టర్ బైక్ అనేది సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన క్రూయిజర్ బైక్‌లలో ఒకటి. ఇండియన్ రోడ్ మాస్టర్ క్రూయిజర్ మోటారుసైకిల్ ప్రపంచంలో రోల్స్ రాయిస్ లాంటిది. ఈ వ్యక్తి రెడ్ కలర్ ఇండియన్ రోడ్ మాస్టర్ క్రూయిజర్ బైక్ కలిగి ఉన్నాడు. ఈ బైక్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ధర కూడా చాలా ఎక్కువ.

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

బజాజ్ అవెంజర్:

క్రూయిజర్ బైకుల ఈ విభాగంలో ఒకటి బజాజ్ అవెంజర్. ఈ వ్యక్తి ఫ్లేర్ ఎల్లో కలర్ బజాజ్ అవెంజర్ బైక్ కలిగి ఉన్నాడు. ఈ బైక్ చాలా పాతది కాని ఇప్పటికీ మంచి పనితీరుని కలిగి ఉంది. ఈ బైక్ మార్కెట్లో ఇప్పటికి మంచి ప్రజాదరణ కలిగి ఉంది.

MOST READ:కొడుకులు ఇచ్చిన గిఫ్ట్‌కి ఆనందంతో మురిసిపోయిన తల్లిదండ్రులు[వీడియో]

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

హార్లే డేవిడ్సన్ బ్రేక్-అవుట్:

అత్యంత ఖరీదైన బైకుల విభాగంలో హార్లే డేవిడ్సన్ ఒకటి. ఈ బైక్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ బైక్ యొక్క అత్యధిక ధర వల్ల మరియు భారతదేశంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల హార్లే డేవిడ్సన్ బైక్స్ పెద్ద సంఖ్యలో అమ్మబడలేదు. ఈ బైక్‌ను భారత్‌లో 2017 లో లాంచ్ చేశారు.

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

భారతదేశంలో లాంచ్ అయినా తరువాత ఊహించిన అమ్మకాలు జరగకపోవడం వల్ల కేవలం 1.5 సంవత్సరాల తరువాత బైక్ అమ్మకం ఆగిపోయింది. గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉన్నందున ఈ బైక్ భారతీయ రోడ్లకు తగినది కాదు. ఎందుకంటే భారతదేశంలో ఎగుడుదిగుడు రోడ్ల కారణంగా ఈ బైక్ ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది.

MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

ట్రయంఫ్ థండర్బర్డ్:

మార్కెట్లో ట్రయంఫ్ థండర్బర్డ్ బైక్ గురించి అతి తక్కువమందికి మాత్రమే తెలుసు. అంతే కాకుండా ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కావున ఎక్కువమంది ఈ బైక్ కొనుగోలు చేయలేదు. ఈ బైక్‌లో అమర్చిన శక్తివంతమైన 1700 సిసి ఇంజన్ హైవేపై అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

ఈ ఇంజన్ 96 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ శక్తివంతమైన ఇంజిన్ కలిగి ఉండటమే కాకుండా మొత్తం బరువు 340 కిలోల వరకు కలిగి ఉంటుంది. ట్రయంఫ్ థండర్బర్డ్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే ఇది ఒక లీటరు పెట్రోల్ కి 19 నుండి 20 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్‌ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]

ఒకే వ్యక్తి 20 క్రూయిజర్ బైక్స్ కలిగి ఉన్నాడు, వాటి విలువ అక్షరాలా 3.5 కోట్లు

బీఎండబ్ల్యూ కె600బి:

బీఎండబ్ల్యూ కె600బి బైక్ యొక్క బాడీ కార్బన్ ఫైబర్ తో తయారు చేయబడింది. కావున ఈ బైక్‌కు ప్రత్యేకమైన కలర్ ఉంటుంది. బీఎండబ్ల్యూ కె600బి బైక్ హోండా యొక్క గ్లోడైవింగ్ బైక్‌తో పోటీపడుతుంది. అడ్వెంచర్ బైక్ విభాగంలో ఈ రెండు బైక్‌లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి. ఈ రెండు బైక్‌లకు అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.

Most Read Articles

English summary
Ahmedabad Man Owns More Than 20 Cruiser Motorcycles Worth Rs. 3.5 Crore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X