ట్రాఫిక్ పోలీసులకు AC హెల్మెట్లు.. ఎలా పనిచేస్తాయో తెలుసా..!
సాధారణంగా అధిక ఉష్ణోగ్రత, వేడి ఎక్కువగా ఉండే రోడ్లపై విధులు నిర్వర్తించడం చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. అయితే నిత్యం రోడ్లపైనే విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. సిబ్బంది అవస్థలకు చెక్ పెట్టేందుకు అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ వినూత్నంగా ఆలోచించింది.
త్వరలో ట్రాఫిక్ పోలీసులకు పోర్టబుల్ ఏసీ హెల్మెట్‌లను అందించనుంది. ఈ హెల్మెట్‌లు ఛార్జింగ్ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే సుమారుగా 8 గంటలపాటు పనిచేస్తాయి. ఈ ఏసీ పోర్టబుల్ హెల్మెట్‌లు ట్రాఫిక్ సిబ్బందికి చల్లని గాలిని అందించడం సహా దుమ్ము, కాలుష్యం నుంచి కాపాడతాయని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ఏసీ పోర్టబుల్ హెల్మెట్‌ల పనితీరును పరీక్షిస్తున్నట్లు ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకోసం ఆరుగురు కానిస్టేబుళ్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇవి సాధారణ హెల్మెట్‌ల మాదిరిగానే తలకు రక్షణ కల్పించే ప్లాస్టిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటాయి. అయితే ఏసీ పరికరాల కారణంగా సాధారణ హెల్మెట్ల కంటే 500 గ్రాముల ఎక్కువ బరువు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ హెల్మెట్లు చుట్టు పక్కల ఉన్న గాలిని తీసుకొని.. ధూళిని ఫిల్టర్ చేసి, చల్లబరుస్తాయి. ఆ గాలిని హెల్మెట్ ధరించిన వ్యక్తి ముఖం వైపు మళ్లిస్తాయి. ఈ హెల్మెట్ ఇన్‌బిల్ట్ ఫ్యాన్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఈ ఏసీ పోర్టబుల్ హెల్మెట్‌లను నోయిడాకు చెందిన కరమ్ సేఫ్టీ సంస్థ తయారుచేసింది.

ఈ హెల్మెట్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఓ కానిస్టేబుల్ వీటి పనితీరును వివరించారు. AC హెల్మెట్‌లు చాలా బాగున్నాయని చెప్పారు. వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో దూళి, దుమ్ముతో కళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఈ ఏసీ హెల్మె్ట్‌లు మాత్రం కళ్ల వద్ద ప్రత్యేక కవచాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. దాంతో పాటు ఫ్యాన్ చెమటపట్టకుండా చేస్తుందని తెలిపారు. ఫలితంగా సక్రమంగా విధులు నిర్వహించేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ హెల్మెట్‌లను పరీక్షిస్తున్నారు. ఇందులో హెల్మెట్ ధరించి వారి ముఖాన్ని పూర్తి కప్పి ఉంచేందుకు నాలుగు రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీంతోపాటు డస్ట్ షీల్డ్ కూడా అమర్చారు. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న దుమ్ము, దూళితో కూడిన గాలిని ఇది అడ్డుకుంటుంది.

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు.. వర్షాకాలంలో రెయిన్ కోట్‌లు, శీతాకాలంలో ప్రత్యేక జాకెట్లు ధరిస్తారు. అయితే వేసవిలో తమను తాను కాపాడుకొనేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే ఈ పోర్టబుల్ హెల్మెట్లు అందుబాటులోకి వస్తే కొంత వరకు ఉపసమనం కలిగించే అవకాశం ఉంది.
ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తే.. తమ సిబ్బంది మొత్తానికి ఇటువంటి ఏసీ హెల్మెట్లు ఆర్డర్ చేయాలని ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 10000 మంది పోలీసులు బాడీ కెమెరాలు అమర్చబడిన ప్రత్యేక దుస్తులను కలిగి ఉన్నారు. ఈ వ్యవస్థ అన్నింటా వస్తే.. రోడ్లు మీద నిత్యం విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసుల సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








