Viral Video స్కూటర్‌పై డేంజరస్‌ స్టంట్‌.. ఆ ఒక్క క్షణం కాపాడింది..!!

రోడ్డు ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు ప్రతి రోజు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఎక్కడో చోట.. ఎవరో ఒకరు సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రధానంగా యువత సోషల్‌ మీడియా క్రేజ్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. బైక్‌, కార్లతో ప్రమాదకర విన్యాసాలు పోలీసులకు సవాల్‌గా మారాయి.

ప్రమాదం అని తెలిసినా కూడా కొందరు యువకులు విన్యాసాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు మరీ ఎక్కువయ్యాయి. పబ్లిక్‌ రోడ్లపై ప్రమాదకరంగా బైక్‌లపై విన్యాసాలు చేయడం, ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయడం సాధారణం అయిపోయింది. ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.

Ahmedabad young men perform dangerous stunts on scooter

ఈ వీడియోలో ఓ యువకుడు సుజుకి యాక్సెస్‌ స్కూటర్‌పై ప్రమాదకర విన్యాసాలు చేయడం మనం గమనించవచ్చు. స్కూటర్‌ డ్రైవింగ్‌లో ఉండగా వాహనంపై నిల్చొని ప్రయాణం చేస్తున్నాడు. కొంత దూరం అలానే ప్రయాణం చేశాక.. ఆ యువకుడికి అకస్మాత్తుగా కారు అడ్డు వచ్చింది. అత్యంత కష్టం మీద, ఆఖరి క్షణంలో యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అహ్మదాబాద్‌ ఒకటి అలాంటి ప్రాంతంలో సింధు భవన్‌ వంటి రద్దీ రోడ్డుపై అత్యంత ప్రమాదకర స్థితిలో యువకుడు స్టంట్‌ చేశాడు. అనంతరం యువకుడు ఆ వీడియోను తన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. కొద్ది గంటల్లోనే ఈ వీడియో తెగ వైరల్‌ అయింది.

ఆ వీడియోను అదే రోడ్డులో ప్రయాణం చేసిన ఓ వ్యక్తి కూడా రికార్డు చేసి అహ్మదాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల ట్విట్టర్‌కు ట్యాగ్‌ చేశాడు. అలా చివరకి పోలీసులకు చేరింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా యువకుడిని గుర్తించారు. వెంటనే అరెస్ట్‌ చేశారు. అయితే ఇటువంటి ఘటనల్లో జరిమానా విధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Ahmedabad young men perform dangerous stunts on scooter

సుజుకి యాక్సెస్‌ స్కూటర్‌పై నిల్చొని యువకుడు కొంత దూరం ప్రయాణం చేయడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. ఈ వీడియో చూసిన వారు ఒకింత భయాందోళనకు కచ్చితంగా గురవుతారు. ఈ వీడియో రద్దీ రోడ్డుపైన చేసినట్లు గుర్తించవచ్చు. మరియు విన్యాసాలు చేస్తున్న సమయంలో యువకుడు కనీసం హెల్మెట్‌ కూడా ధరించలేదు.

ఈ ఘటనలో యువకుడు సరైన సమయంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉండేది. హెల్మెట్‌ కూడా ధరించలేదు కనుక తీవ్ర గాయాలు అయ్యేవి. ఇలాంటి విన్యాసాలకు చేసే యువకులు ఖాళీ మైదానాలు లేదా మూసేసిన రోడ్లును ఎంచుకోవడం మంచిది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, June 28, 2023, 18:43 [IST]
English summary
Ahmedabad young men perform dangerous stunts on scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+