మారుతి 800 కారులో దెయ్యం.. పట్టించిన AI కెమెరా, షాక్‌లో యజమాని
సాధారణంగా దెయ్యాలను సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌లలో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో దెయ్యాలు ఉన్న మాట కొందరు నమ్ముతారు. మరికొందరు అబద్ధమని కొట్టిపడేస్తారు. కానీ మీరు ఈ ఫొటోలు చూసినట్లయితే నిజమేనేమో అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మారుతి 800 కారులో దెయ్యాన్ని AI కెమెరా క్లిక్ మనిపించింది.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఆటో మొబైల్ రంగంలో విస్తృతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలను అమర్చాక.. ఎలాంటి ట్రాఫిక్ నిబంధనలు అయినా ఇట్టే పోలీసుల దృష్టికి వెళ్తున్నాయి. ఇంకా అధునాతనంగా ప్రవేశపెట్టిన AI కెమెరాలు.. కారులో డ్రైవర్, ఫ్రంట్ సీట్ ప్రయాణికుడు సీట్ బెల్ట్ ధరించకపోయినా ఇట్టే పట్టేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే మారుతి 800 కారులో వెనుక సీట్లో కూర్చున్న దెయ్యాన్ని AI కెమెరా పట్టేసింది. ఇది ఎలా బయటకు వచ్చింది అనుకుంటున్నారా.. AI కెమెరా తన విధుల్లో భాగంగా మారుతి 800 కారులో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో దానిని క్యాప్చర్ చేసింది. అయితే ఈ ఫొటోలో ముందు సీట్లో కూర్చున్న వారితో పాటు వెనుక కూర్చున్న దెయ్యం కూడా కనిపించింది.
అది దెయ్యమే అని మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారనే సందేహం మీకు రావచ్చు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలో ఇటీవల AI కెమెరాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు చాలా వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలను AI కెమెరాలు క్యాప్చర్ చేశాయి. అలాగే తాజాగా AI తీసిన మారుతి 800 కారు ఫొటోలు కూడా అక్కడి ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లాయి.
దీంతో పోలీసు అధికారులు సదరు వ్యక్తికి ఈ ఫొటోతో పాటు చలాన్ విధించారు. దీంతో ఆ కారు యజమాని ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారులో తమతో పాటు ఉన్న మరో వ్యక్తి ఎవరో తెలియక సతమతమయ్యారు. ఈ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సంఘటన జరిగిన రోజు మారుతి 800 కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని.. ముందు ఇద్దరు పెద్దలతో పాటు వెనుక ఇద్దరు చిన్న పిల్లలు కూర్చున్నారని కారు యజమాని పోలీసులతో పేర్కొన్నారు. అయితే, AI కెమెరా తీసిన ఫొటో.. కారులో మొత్తం ముగ్గురు వ్యక్తులను మాత్రమే చూపుతుంది. ఇది చూసి షాకయిన కారు యజమాని.. వెనుక కూర్చున్న వ్యక్తి తమ పిల్లలు కాదని, వేరొకరిలా కనిపిస్తోందని పీఎస్‌లో పేర్కొన్నారు.
అంతే కాకుండా AI కెమెరా తీసిన కారు ఫొటోలో తన పిల్లలిద్దరూ లేరని పేర్కొంటూ.. హారర్ క్లిప్‌ను జోడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు షాక్ అయి.. AI కెమెరా తీసిన దెయ్యం ఫొటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే దీని గురించి తమకేమీ తెలియదని, ఏఐ కెమెరా తీసిన ఫోటోను షేర్ చేశామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో పెను వివాదానికి కారణమైంది. సాధారణంగా, ఇటువంటి దృగ్విషయాలకు సైన్స్‌లో పరీడోలియా అంటారు. ఎప్పుడైనా మీరు ఆకాశంలో మేఘాన్ని చూస్తున్పప్పుడు.. మీకు అందులో ఓ రూపం కనిపిస్తుంటుంది. అది ఓ భ్రమే అని చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు చీకట్లో వెళ్తున్నప్పుడు చెట్లు, లేదా మొక్కలను చూసినప్పుడు అక్కడ ఓ మనిషి ఉన్నట్లుగా అనిపిస్తుంది.
స్పష్టంగా చెప్పాలంటే.. అక్కడ లేని వాటిని మీరు ఊహించుకుని తలచుకోవడాన్ని పరీడోలియా అంటారట. అయితే మారుతి 800 కారులో వెనుక సీట్లో చూపిస్తున్న వ్యక్తి ముఖాన్ని పరిశీలిస్తే అది ఓ మహిళ ఫేస్‌లా అనిపిస్తుంది. వెనుక చిన్నపిల్లలు కూర్చున్నారని చెప్పడంతో అది అందులో ఒకరి ముఖం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో కావడంతో ఈ సమస్య వచ్చి ఉండొచ్చు.
ఈ ఫొటోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వెనుక సీట్లో కనిపిస్తున్నది.. వారిద్దరి పిల్లల్లో ఎవరో ఒకరిది అయినా అయి ఉండాలి. లేదంటే.. అక్కడ ఏదైనా వస్తువు అడ్డుగా అయినా పెట్టి ఉండాలి. ఇంకా బ్లాక్ అండ్ వైట్ ఫొటో కావడంతో ఫొటో అలా కనిపించే అవకాశాలు అయినా అయి ఉండాలంటున్నారు.


Click it and Unblock the Notifications








