యూరప్‌లో హల్ చల్ చేస్తున్న ఎయిర్ కండిషన్డ్ బైక్స్

AC Bike
మీ బైక్‌కు ఏసి (ఎయిర్ కండిషన్) ఉందా..! బైక్‌కు ఎయిర్ కండిషన్ ఏంటి మతిగాని పోయిందా..? అని తిట్టేయకండి. ఎందుకంటే నిజంగానే బైక్‌లో ఏసి ఉంటుంది. ఈ పక్కన ఉన్న ఫోటోను గమనించారా..! ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బైక్. చూడటానికి రెండు చక్రాలున్న చిన్నసైజు కారులా ఉండే ఈ ఏసి బైక్‌ను యూరప్‌కు చెందిన 'పెరావెస్ మోనోట్రేసర్' అనే బైక్‌ల తయారీ సంస్థ రూపొందించింది.

Awesome AC Bike

బైక్ రైడర్ సెగలు కక్కే ఎండలో ఆమ్లెట్‌లా ఉడికిపోకుండా చల్లగా ఉంచేందుకు ఈ ఏసి బైక్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాందడోయ్.. ఈదురు గాలులు, దుమ్ము-ధూళి, వర్షాలు, చలి ఇలా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులను నుంచి బైక్ రైడర్లను చక్కగా రక్షిస్తుంది. ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా క్యాబిన్‌తో కవర్ చేయబడినట్లుగా ఉండే ఈ ఏసి బైక్‌లో పైవైపు తెరుచుకునే ఒక డోర్ ఉంటుంది. ఈ బైక్‌లో ఇద్దరు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు.

బైక్‌ను నిలపడానికి సపోర్టింగ్ వీల్ ఒకటి సైడ్ స్టాండ్‌లా ఉపయోగపడుతుంది. అయితే, ఈ బైక్‌లో ప్రయాణించాలంటే.. కొంచెం ఖర్చు చేయకతప్పదు మది. కొంచెం అంటే ఎంతో తెలుసా జస్ట్ రూ. 33 లక్షల రూపాయలు మాత్రమే. పెరావెస్ మోనోట్రేసర్ కంపెనీ ఈ ఎయిర్ కండిషన్డ్ బైక్ ధరను 52,500 యూరోలు (సుమారు రూ. 33,53,035)గా నిర్ణయించింది. అంటే, ఈ ఏసి బైక్‌కు వెచ్చించే ధరకు ఓ మంచి బ్రాండెడ్ లగ్జరీ కారును కొనుక్కోవచ్చు. కానీ.. ఎంతైనా బైక్ రైడ్‌లో ఉండే మజా.. లగ్జరీ ఏసి కార్‌తో రాదు కదా..!

More from DriveSpark

Article Published On: Monday, July 25, 2011, 18:05 [IST]
English summary
The motorcycle is the preferred choice of transport for many Indians. It is cheaper than cars to buy, run and maintain. However the only complaint about bikes is that it cannot protect the riders from the rigours of nature. While the hot sun bakes motorists in summer, they have to contend with rains in the monsoon and chilly winds in the winter. Here is a solution that will keep you protected at all times – an air conditioned bike!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+