షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

ఎయిర్ ఇండియా తమ వినియోగదారులు విస్తుపోయే విషయాన్ని వెల్లడించింది. భారతదేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా, తమ ప్రయాణీకుల డేటాను ఎవరో హ్యాక్ చేసి, వారి వ్యక్తిగత వివరాలను దొంగిలించారని ప్రకటించింది.

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

సుమారు 45 లక్షల మంది ప్రయాణీకుల వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. జెనీవాలో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న సిటా (SITA)పై హ్యాకర్లు జరిపిన సైబర్ దాడిలో ఎయిర్ ఇండియా ప్యాసింజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యాయి. సిటా అనేది టెలికమ్యూనికేషన్ సర్వీసులను అందించే కంపెనీ.

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

సిటా సంస్థ కేవలం ఎయిర్ ఇండియాకే కాకుండా ప్రపంచంలోని వివిధ అంతర్జాతీయ విమానయాన సంస్థలకు టెలికమ్యూనికేషన్ సర్వీస్‌లను అందిస్తుంటుంది. ప్రపంచ విమానయాన వ్యాపారంలోని టెలికమ్యూనికేషన్ సర్వీసుల విభాగంలో సిటాకు దాదాపు 90 శాతం వాటా ఉంది.

MOST READ:లాక్‌డౌన్ ఉన్నా.. అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి.. అయితే భూమ్మీద కాదు.. మరెక్కడనుకుంటున్నారా?

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

అటువంటి పెద్ద బహుళజాతి సమాచార సాంకేతిక సంస్థ నుండి కస్టమర్ వివరాలు లీక్ కావడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. సైబర్ నేరగాళ్లు సిటా సర్వర్లను హ్యాక్ చేసి, ఎయిర్ ఇండియా ప్యాసింజర్ల వ్యక్తిగత వివరాలను దొంగిలించారు.

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

ఇలా దొంగిలించబడిన సమాచారంలో ప్రయాణికుల పేరు, క్రెడిట్ కార్డు వివరాలు, పుట్టిన తేదీ, కాంకాక్ట్ ఇన్‌ఫర్మేషన్, పాస్‌పోర్ట్ సమాచారం, టికెట్ సమాచారం, స్టార్ అలయన్స్ మరియు ఎయిర్ ఇండియా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ డేటా ఉన్నాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

MOST READ:గిఫ్ట్‌గా పొందిన థార్ ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవ్ చేసిన క్రికెటర్ [వీడియో]

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

ఎయిర్ ఇండియా ద్వారా ఆగస్టు 26, 2011 నుండి ఫిబ్రవరి 3, 2021 వరకు నమోదు చేసుకున్న ప్రయాణీకుల వివరాలు లీక్ అయ్యాయి. అయితే, ఇలా లీకైన సమాచారంలో క్రెడిట్ కార్డుల యొక్క సివివికి సంబంధించిన డేటా సిటా వద్ద లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

ప్రయాణీకుల వ్యక్తిగత సమాచార భద్రత విషయంలో అవసరమైన ప్రతిచోటా తమ పాస్వర్డ్లను మార్చుకోవల్సిందిగా ఎయిర్ ఇండియా తమ ప్రయాణీకులను కోరింది. భవిష్యత్తులో, ఇంలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు కూడా తీసుకున్నామని తెలిపింది.

MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

ఈ సైబర్ అటాక్ గురించి సిటా ఫిబ్రవరి 25న మొదటి సారిగా తమకు తెలియజేసిందని, అయితే ఈ డేటా లీక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మార్చి 25 మరియు ఏప్రిల్ 5న మాత్రమే అందించిందని ఎయిర్ ఇండియా తెలిపింది.

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

కేవలం ఎయిర్ ఇండియా డేటా మాత్రమే కాకుండా, మలేషియన్ ఎయిర్‌లైన్స్, ఫిన్‌ఎయిర్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, జెజు ఎయిర్, కాథీ పసిఫిక్, ఎయిర్ న్యూజిలాండ్ మరియు లుఫ్తాన్సా వంటి పలు విమానయాన సంస్థల డేటా కూడా లీకైందని, వారికి దీనికి సంబంధించిన సమాచారం అందించామని సిటా తెలిపింది.

MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

పన్ను చెల్లింపుదారుల డబ్బుతో అతి కష్టమ్మీద నెట్టుకొస్తున్న అతిపెద్ద భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ డేటా లీక్ విషయంలో రాజీపడిన సర్వర్‌లను భద్రపరిచామని, పేరు చెప్పడం ఇష్టం లేని బాహ్య నిపుణులతో నిమగ్నమయ్యామని, క్రెడిట్ కార్డ్ జారీచేసే బ్యాంకులకు కూడా సమాచారం అందించామని మరియు తమ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ యొక్క పాస్‌వర్డ్‌లను కూడా రీసెట్ చేశామని పేర్కొంది.

షాకింగ్ న్యూస్‌: ఎయిర్ ఇండియా డేటా లీక్, 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్!

మరి పైన తెలిపిన సమయంలో మీరు కూడా ఎప్పుడైనా ఎయిర్ ఇండియాలో ప్రయాణించి ఉండి, మీ వివరాలు కూడా సదరు ఎయిర్‌లైన సంస్థలో రిజిస్టర్ చేయబడి ఉంటే, తక్షణమే మీరు మీ పాస్‌వర్డ్‌లను మార్చుకోవటం మంచిది.

Most Read Articles

English summary
Air India Data Breach At SITA; About 4.5 Million Passengers Personal Data Stolen By Hackers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X