రామమందిర ప్రారంభోత్సవం... అయోధ్యకు ప్రత్యేక విమాన సర్వీసులు.. 80 నిమిషాల్లోనే..!
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి (Ayodhya Ram mandir) ముమ్మర ఏర్పాట్లు జరగుతున్నాయి. జనవరి 22, 2024 శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. శ్రీరాముడి దర్శనానికి వెళ్లే భక్తుల ప్రయాణం కోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తొలి విమాన సర్వీసును ప్రారంభించనుంది. డిసెంబర్ 30న అధికారికంగా విమాన సర్వీసును ప్రారంభించి, జనవరి 16 నుంచి రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇప్పటికే విమాన సర్వీసుల కోసం అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విస్తరించిన రన్‌వేను సిద్ధం చేశారు.

కేవలం 80 నిమిషాల్లోనే అయోధ్యకు..! : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 2789.. డిసెంబర్ 30 ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి 12.20 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. IX 1769 విమానం 12.50 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి 2.10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. అంటే కేవలం 80 నిమిషాల్లోనే ఢిల్లీ నుంచి అయోధ్యకు చేరుకోవచ్చు.
రూ.350 కోట్లతో అయోధ్య విమానాశ్రయం అభివృద్ధి : అయోధ్య విమానాశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్‌పోర్టు్ రూ.350 కోట్లతో అభివృద్ధి చేసింది. డిసెంబర్ 14న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయోధ్యలో విమాన రాకపోకలకు అనుమతి మంజూరు చేసింది.

డిసెంబర్ 30న తొలి విమానం ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లనుంది. జనవరి 6 నుంచి రోజువారీగా విమానయాన సేవలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇండిగో కూడా అయోధ్యకు విమానాలు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి 11న అహ్మదాబాద్- అయోధ్య మధ్య విమాన సర్వీసులు ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది.
ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభం : ఈ నెలాఖరు నాటికి అయోధ్య విమానాశ్రయం సిద్ధం అవుతుందని, ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. విమాన సర్వీసులతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అయోధ్యకు మరిన్ని రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. తొలి వంద రోజుల్లో 1000 కంటే ఎక్కువ రైళ్లను నడపాలని ప్రణాళిక వేస్తోంది.

జనవరి 19 నుంచి రైళ్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కత సహా ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు రైళ్లను నడుపుతారని తెలుస్తోంది. దీంతోపాటు అయోధ్యలోని సరయు నదిపై వాటర్ మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. గుప్తర్ ఘాట్ నుంచి రామ్‌కి పైడి మధ్య నడుస్తుంది. వాటర్ మెట్రోలో 50 మంది ప్రయాణం చేయవచ్చు. ఈ సేవలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








