Air India A350: మతిపోగొడుతున్న ఎయిర్ ఇండియా A350 ఇంటీరియర్ ఫీచర్లు.. ఒక్కో సీటు వద్ద లగ్జరీ సౌకర్యాలు.!!
ఇటీవల భారత్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చేతికి తొలి వైడ్ బాడీ విమానం అందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్‌బస్ ఏ350(Air India A350) కి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం తెలిపింది. ఈ క్రమంలో ఈ బాహుబలి విమానానికి సంబంధించి ఇంటీరియర్ ఫొటోలను సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎయిర్ ఇండియా వద్ద ఇప్పటివరకూ ఏ350 లాంటి పెద్ద విమానాలు లేవు. ఇటీవల ఎయిర్ బస్, బోయింగ్ నుంచి సంస్థ పెద్ద ఎత్తున వైడ్ బాడీ విమానాలను ఆర్డర్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా వారం రోజుల క్రితం కొత్త A350 విమానం అందుకుంది. త్వరలో ఈ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కాగా ఇప్పటికే ఈ అతిపెద్ద విమాన సర్వీసును ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన సంస్థలు అందిస్తున్నాయి.

ఈ క్రమంలో ఎయిరిండియాకు చెందిన తొలి A350 విమానం త్వరలో సర్వీసులోకి రానుంది. దీంతో తాజాగా Air India A350 విమానం ఇంటీరియర్ ఫోటోలు ఇంటర్నెట్‌లో విడుదలై వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ఇంటీరియర్ ఫొటోలు ఎలా ఉన్నాయో చూద్దామా..
ఎయిర్ బస్, బోయింగ్ నుంచి ఎయిర్ ఇండియా ఏ350-900 విమానాలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన ఈ విమానం జనవరి 2024 నుంచి ఎయిర్ ఇండియాకు సేవలు అందించనుంది. ఈ క్రమంలో A350-900 విమానంలో అత్యాధునిక సౌకర్యాలతో 264 ఎకానమీ సీట్లు ఉన్నట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది.

ఈ 264 సీట్లలో కూర్చునే ప్రయాణికులందరూ లగ్జరీ సౌకర్యాలను అనుభవించవచ్చు. HD స్క్రీన్‌తో అత్యాధునికమైన Panasonic EX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను ఎకనామీ సీట్ల వద్ద అందించారు. ఈ ఎకానమీ సీట్లు కాకుండా, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు కూడా ఉన్నాయి. వీటిలోని ప్రయాణీకులకు ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు మరింత లెగ్‌రూమ్‌తో సహా కొన్ని అదనపు ఫీచర్లను అందిస్తున్నారు.
ఇక ఎయిర్ ఇండియా ఏ350లో బిజినెస్ క్లాస్‌లో విశాలమైన 28 సీట్లు ఉన్నాయి. అయితే బిజినెస్ క్లాస్‌లో ఎలాంటి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయో మనకు తెలిసిందే. కాగా ఈ సరికొత్త వైజ్ బాడీ A350-900 బిజినెస్ క్లాస్‌లో ఎయిర్ ఇండియా స్లీపర్ సీట్లను కూడా అందిస్తుండటం విశేషం.

కాగా ఈ వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించిన తొలి భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కావడం విశేషం. ఇప్పటికే చెప్పినట్లుగా, వైడ్ బాడీ కాన్ఫిగరేషన్ ఎయిర్‌బస్ A350 విమానం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందటానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీని కారణంగా, ఎయిర్‌బస్ A350ని కొనుగోలు చేయడానికి అనేక విమానయాన సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఎందుకంటే ఈ విమానాలు సాధారణ విమానాలతో పోలిస్తే ఎక్కువమంది ప్రయాణికులను తీసుకెళ్తాయి. కాగా ఎయిర్ ఇండియా మొత్తం 20 ఎయిర్ బస్ A350-900 విమానాలను ఆర్డర్ చేయగా.. ఇందులో మొదటి 5 విమానాలను మార్చి 2024 నాటికి డెలివరీ కానున్నాయి. అయితే మొదటి దశలో A350 స్వల్ప-దూరాలకు మాత్రమే సర్వీసులను అందించనుంది.

అంతేకాకుండా A350-900 తో పాటు ఎయిర్ ఇండియా 20 Airbus A350-1000 విమానాల కోసం కూడా ఆర్డర్ చేసింది. కాగా ఇతర విదేశీ విమానయాన సంస్థలకు చెందిన Air350 విమానాలు ప్రతిరోజూ భారత్‌కు సర్వీసులు అందిస్తున్నాయి. ఇక కొత్త సంవత్సరంలో జనవరి నుంచి A350 ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా లివరీలో కూడా ఎగురనుంది.


Click it and Unblock the Notifications








