A350 Aircraft: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. జనవరి 22 నుంచి A350 విమానాల సర్వీస్‌లు ప్రారంభం

విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ అందించింది. మరి కొద్ది రోజుల్లోనే ఎయిర్‌ ఇండియా ఎయిర్‌బస్‌ A350 విమానం గాల్లోకి ఎగరనుంది. ఈ విమానానికి సంబంధించి బుకింగ్‌లను కూడా సంస్థ ఓపెన్‌ చేసింది. జనవరి 22 నుంచి ఎయిర్‌బస్‌ A350 కమర్షియల్‌ సర్వీస్‌లు ప్రారంభం కానున్నట్లు ఎయిర్‌లైన్స్‌ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా(Air India) ఇటీవల కొత్తగా ఎయిర్‌బ‌స్ A350(Airbus A350) వైడ్‌ బాడీ విమానాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 23 న ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఈ బాహుబలి విమానానికి ఎయిర్‌ ఇండియా ఘన స్వాగతం పలికింది. అధునాతన సౌకర్యాలు, లగ్జరీ ఫీచర్లతో ఈ విమానాన్ని రూపొందించారు. ఇక అతి త్వరలోనే ఈ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి.

Air India-A350

ఇకపై ఎయిర్‌ ఇండియా విమాన ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందవచ్చు. దేశంలోనే మొదటి వైడ్‌ బాడీ విమానంలో లగ్జరీ ఫీలింగ్‌తో ప్రయాణం చేయవచ్చు. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌బస్‌ A350 విమానం బుకింగ్‌లను ప్రారంభించిన సంస్థ.. తొలుత దేశీయంగా మాత్రమే ఆ విమానాల‌ను న‌డ‌పనున్న‌ట్లు సోమవారం ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి 22వ తేదీ నుంచి ఈ ఫ్లైట్‌ క‌మ‌ర్షియ‌ల్ స‌ర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.

ఎయిర్‌బ‌స్ కంపెనీకి చెందిన A350 విమానాల‌ను(A350 Aircraft) మొదటగా డొమెస్టిక్ రూట్ల‌లో ఎయిర్ ఇండియా నడపనుంది. జ‌న‌వ‌రి 22 న బెంగుళూరు నుంచి ముంబయి రూట్లో తొలి A350 విమానాన్ని నడపనున్నారు. మొత్తంగా బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైద‌రాబాద్‌, ముంబై న‌గ‌రాల మ‌ధ్య‌ ఈ విమానాలు సర్వీసులు అందించనున్నాయి. ఆ తర్వాత A350 విమానాల‌ు ఇత‌ర దేశాల‌కు ఎగరనున్నాయి.

Air India-A350

ఇక ఈ వైడ్‌ బాడీ విమానం విషయానికొస్తే A350-900 విమానానం ఇంటీరియర్‌ ఫీచర్లకు సంబంధించి ఇటీవల ఎయిర్‌ ఇండియా ఫొటోలు విడుదల చేసింది. విశాలంగా, లగ్జరీ ఫీచర్లతో ఈ ఫ్లైట్‌ ఇంటీరియర్‌(A350 Interior Features) ఉంటుంది. ఇందులో త్రీ క్లాస్ క్యాబిన్లు ఉంటాయి. దీంట్లో 316 సీట్లు ఉండగా.. వీటిలో 28 బిజినెస్ క్లాస్‌, లెగ్‌ రూమ్‌ సౌకర్యంతో 24 ప్రీమియం ఎకాన‌మీ, 264 విశాలమైన ఎకాన‌మీ సీట్లు ఉన్నాయి.

Air India-A350

ఎయిర్‌ ఇండియా ఎయిర్‌బస్‌ A350 ప్రయాణికుల కోసం HD స్క్రీన్‌తో అత్యాధునికమైన Panasonic EX3 ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. బిజినెస్ క్లాస్‌లో ఎయిర్‌ ఇండియా అదనంగా స్లీపర్ సీట్లను కూడా అందిస్తోంది. కాగా ఈ వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఉపయోగించిన తొలి భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియానే.

Air India-A350

వైడ్ బాడీ కాన్ఫిగరేషన్‌తో ఎయిర్‌బస్ A350 విమానాలు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీని కారణంగా, ఈ విమానాలను కొనుగోలు చేయడానికి అనేక విమానయాన సంస్థలు పోటీ పడుతున్నాయి. సాధారణ విమానాలతో పోలిస్తే వీటిలో ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. అందుకే అంతర్జాతీయ ఈ విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

కాగా ఎయిర్ ఇండియా(Air India A350) మొత్తం 20 ఎయిర్‌బస్‌ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. వీటిలో మొదటి 5 విమానాలను మార్చి 2024 నాటికి సంస్థ డెలివరీ తీసుకోనుంది. ఈ క్రమంలో జనవరి 22 నుంచి ఎయిర్‌బస్‌ A350 దేశీయంగా మాత్రమే సేవలందించనుంది.

Air India-A350

A350 సర్వీస్‌లోకి ప్రవేశించడంతో ఎయిర్‌ ఇండియా తన కొత్త ప్రపంచ బ్రాండ్ గుర్తింపు ఏర్పరుచుకుంది. అంతేకాకుండా క్యాబిన్ మరియు కాక్‌పిట్ సిబ్బంది కోసం ప్రత్యేకంగా యూనిఫామ్‌ను రూపొందించింది. ఇక ఈ విమానం బుకింగ్స్‌, ఫ్లైట్‌ టైమింగ్స్‌ కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 2, 2024, 11:58 [IST]
English summary
Air india first ever airbus a350 services start from january 22nd bookings open
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+