Air Leakage టైర్లలో గాలి తగ్గుతుందా..? ఈ టిప్ ద్వారా ఇప్పుడే సరిచేసుకోండి..!
వేసవికాలంలో కారు టైర్లు పేలి చాలామంది ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతారు. నిత్యం వార్తల్లో ఇలాంటి సంఘటనలు రోజుకి పదుల సంఖ్యలో చూస్తుంటం. లాంగ్ జర్నీ ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువగా కారణం అవుతుంది. రోడ్లపై ఉండే అధిక వేడిమి వల్ల టైర్లు రాపిడికి గురై ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయి.
ముఖ్యంగా గాలి తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలంటే ముందుగానే గాలిని చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం. చాలా సందర్భాల్లో మీరు కారులో లాంగ్ జర్నీకి వెళుతున్నప్పుడు టైర్ నుండి గాలి లీక్ అవుతుంది. ఇలాంటి సమయాల్లో అప్రమత్తతో ఉండకపోతే ప్రమాదాలను కొనితెచ్చుకునే అవకాశం ఉంటుంది. మొదట మీరు టైర్ పంక్చర్ అయ్యిందా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించుకోవాలి.

ఒకవేళ మీ టైర్ పంచర్ అవ్వకపోతే దగ్గర్లోని మెకానిక్ షాప్ ద్వారా గాలిని పట్టించి దానిని నిర్ధారించుకోవాలి. టైరు పంక్చర్ అవ్వలేదని భావిస్తే టైర్ ను మార్చాలి లేదా టైర్ లోంచి గాలి వస్తూనే ఉంటుంది. టైర్‌ను మార్చడం తప్ప మీకు వేరే మార్గం లేదు. అయితే ఇప్పుడు టైర్ల కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు మేము మీ సమస్యను తొలగించడానికి కొన్ని చిట్కాను అందించబోతున్నాం.
మీ కారులో టైర్‌ను మీరే సరిచేయవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో మెకానిక్ సహాయం లేకుండా మీరే తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు టైర్ మార్చడానికి వేల రూపాయలు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. చాలా సార్లు టైర్ నుంచి ఎలాంటి పంక్చర్ లేకుండా గాలి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రిమ్ టైర్ మధ్య గ్యాప్ ఉండటమే ముఖ్య కారణం. వీటి మధ్య కాంటాక్ట్ అరిగిపోయి ఉండవచ్చు. అందువల్ల గాలి లీక్ అవుతుంది.
దానివల్ల మీ టైర్ నుంచి గాలి రావడం ప్రారంభమై ప్రమాదాలు జరుగుతాయి. టైర్, రిమ్ పూర్తిగా ఒకదానికొకటి అతుక్కొని ఉండాలి. లేకుంటే వాటిలో ఖాళీ ఉంటే, అప్పుడు గాలి లీకేజ్ సమస్య మొదలవుతుంది. ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై డ్రైవింగ్ చేయడం గుంతలపై కార్లను నడపడం వల్ల ఈ అంతరం పెరుగుతుంది. కారు తీసే ముందు దీనిని చెక్ చేసుకుంటే చాలు మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్లే. ఈ గ్యాప్ ను దీనిని నివారించడానికి, మీరు టైర్‌లో గాలిని నింపినప్పుడల్లా, మీరు దాన్ని తనిఖీ చేయవచ్చు.
ఇలా గ్యాప్ కారణంగా పంక్చర్ లాగా, టైర్లోని గాలి ఒక్కసారిగా పూర్తిగా అయిపోదు. ఇది 3 నుంచి 4 రోజులు లేదా ఒక వారంలో సులభంగా బయటకు రావడం ప్రారంభమవుతుంది. దీనిని మీరు త్వరగా సరి చేసుకోకపోతే ఈ సమస్య నిత్యం వేధిస్తూనే ఉంటుంది. కారు నడవడానికి పెట్రోల్ డీజిల్ ఎంత ముఖ్యమో టైర్లలో గాలి కూడా అంతే ఉండాలి అనే విషయాన్ని వినియోగదారులు భావించాలి. ఇంధనం ఉంటే బండి నడుస్తుంది. అదే గాలి లేకుంటే అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు గుర్తుపెట్టుకోవాలి.
ఈ సమస్య కోసం మీరు టైర్‌ను మార్చాల్సిన అవసరం లేదు, దీని కోసం మీరు ఇంట్లో మీరే తనిఖీ చేసుకోవచ్చు. దీని కోసం, నీటిలో సర్ఫ్ లేదా బురగ వచ్చే ఏదైనా ద్రావణాన్ని కలపండి. రిమ్ కి టైర్ మధ్య ఉన్న స్థలంలో నెమ్మదిగా దానిని పోయాలి. నీటి బుడగలు బయటకు వస్తున్నట్లయితే, వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లి సరిచేయండి. ఈ చిన్న చిట్కాతో కొత్త టైర్ల కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం మీకు ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications








