భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; అదేంటో తెలుసా!!

ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయనే విషయం దాదాపు అందరికి తెలుసు. అయితే నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ గేమ్స్ కోసం ప్రపంచంలోని చాలా దేశాల ఆటగాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ గతంలో కరోనా మహమ్మారి వల్ల ఒలింపిక్ గేమ్స్ వాయిదా పడ్డాయి. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం వల్ల 2020 ఒలంపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

2020 ఒలంపిక్ గేమ్స్ ఆగష్టు 8 న ముగిసాయి. ఇందులో పాల్గొన్న భారతీయ ఆటగాళ్ళు మొత్తం 7 మెడల్స్ సాధించారు. ఇందులో 1 స్వర్ణం, 2 రజతం మరియు 4 కాంస్యం పతకాలు ఉన్నాయి. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. భారత్ 7 పతకాలతో పతకాల జాబితాలో 48 వ స్థానంలో నిలిచింది.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

ఒలంపిక్ గేమ్స్ చివరి రోజు భారతదేశం యొక్క 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించడం ద్వారా భారతదేశం చరిత్ర సృష్టించడం ఇదే మొదటిసారి. పురుషుల రెజ్లింగ్ ఈవెంట్‌లో రవికుమార్ దహియా 57 కేజీల విభాగంలో రజత పతకం సాధించగా, 48 కేజీల విభాగంలో మీరా బాయి చాను మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించింది.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

బ్యాడ్మింటన్‌లో పివి సింధు, బాక్సింగ్‌లో లావెలినా బార్గోయిన్, రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా మరియు పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకాలు సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యారు. దేశం మొత్తం వీరిని ఎంతగానో కొనియాడుతోంది. పబ్లిక్ కూడా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా పతక విజేతలను అభినందిస్తున్నారు.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

భారతదేశానికి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై ఇప్పుడు బహుమతులు వర్షం కురుస్తోంది. చోప్రా బంగారు పతకం సాధించిన కారణంగా మన దేశం ఇతనికి 6 కోట్ల రివార్డు ప్రకటించింది. అంతే కాకుండా పారిశ్రామికవేత్తలు మరియు ప్రముఖులు పతక విజేతలకు అద్భుతమైన బహుమతులు ప్రకటిస్తున్నారు.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

ఒలంపిక్స్ లో అద్భుతమైన ప్రతిభ కనపరిచినందుకు గాను మీరాబాయ్ చానుకి డొమినోజ్ కంపెనీ జీవితాంతం ఉచిత పిజ్జా అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. అంతే కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఒలంపిక్ గేమ్స్ విజేతలకు ఉద్యోగాలను కూడా ప్రకటించింది. గో ఫస్ట్ మరియు స్టార్ ఎయిర్ ఎయిర్‌లైన్స్ రెండు కంపెనీలు ఈసారి ఒలింపిక్స్ పతక విజేతలకు ఫ్రీ విమాన సేవలను అందించనుంది.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

ఇదిలా ఉండగా ఇప్పుడు ఇండిగో ఒక సంవత్సరం పాటు నీరజ్‌కు ఉచిత విమాన టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. నీరజ్ 8 ఆగస్టు 2021 నుండి 7 ఆగస్టు 2022 వరకు ఇండిగో విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. ఈ సమయంలో వారు ఇండిగో విమాన సర్వీసును ఎన్నిసార్లు అయినా ఉపయోగించవచ్చు.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

నీరజ్ సాధించిన ఈ విజయంపై ఇండిగో సీఈఓ రోనోజోయ్ దత్తా మాట్లాడుతూ దేశం కోసం బంగారు పతకం సాధించి అందరినీ గర్వపడేలా చేశారని అన్నారు. వారికి ఉచిత విమాన సేవలు అందించడం ద్వారా సంస్థ వారిని గౌరవించాలని కోరుకుంటుంది.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా చోప్రాకు ఒక అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించాడు. కంపెనీ త్వరలో ప్రారంభించబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ని అందించడం ద్వారా నీరజ్‌ను సత్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; పూర్తి వివరాలు

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 భారతీయ కార్ల తయారీదారుల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో ఒకటి, ఇది రాబోయే కొద్ది వారాల్లో లాంచ్ చేయబడుతుంది. ఇది మహీంద్రా లైనప్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మహీంద్రా ఎక్స్‌యువి 500 తో పోలిస్తే ఎక్స్‌యూవీ 700 అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది.

భారతీయ ఒలింపిక్ పతక విజేతలందరికీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌లైన్స్; అదేంటో తెలుసా!!

ఇప్పటికే ఆనంద్ మహీంద్రా ప్రకటించినదాని ప్రకారం మహీంద్రా ఎక్స్‌యూవీ 700 యొక్క మొదటి బ్యాచ్ నుండి, నీరజ్ చోప్రాకు అందించబడుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఇంకా విడుదల కాలేదు, అయితే ఇది త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రానున్న కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం విడుదల సమయంలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Air lines companies announces free travel for all indian olympic medal winners details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X