త్వరలో భారత్‌కు రానున్న ఎయిర్‌బస్ ఏ380 విమాన సేవలు!

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద విమానం 'ఎయిర్‌బస్ ఏ380'. అత్యంత విలాసవంతమైన సదుపాయాలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఏ380 మరికొద్ది రోజుల్లోనే భారతీయ ప్రయాణికులకు సైతం అందుబాటులోకి రానుంది.

ఇటీవలే బేగంపేట విమానాశ్రయంలో జరిగిన విమానయాన ప్రదర్శనలో ఈ ఎయిర్‌బస్ ఏ380 విమానాన్ని ప్రదర్శనకు ఉంచారు. దుబాయికి చెందిన విమానయాన సేవల సంస్థ ఎమిరేట్స్ త్వరలోనే భారత్‌కు ఏ380 సర్వీసులను నడపనుంది.

ఈ సర్వీసులను తొలుతగా దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వీటిని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు విస్తరించనున్నారు.

ఈ లగ్జరీ విమానంలో ఉన్న ఆ లగ్జరీ ఫీచర్లేంటో ఓ లుక్కేసొద్దాం రండి.

ఎయిర్‌బస్ ఏ380

ప్రపంచంలో కెల్లా అత్యంత విలాసవంతమైన, అతిపెద్దదైన మరియు అతి ఖరీదైన ఈ ఎయిర్‌బస్ ఏ380 విమానంలో ప్రయాణించేందుకు ఎంతో కాలంగా భారతీయులు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో వారి ఎదురుచూపులు ఫలించనున్నాయి.

ఎయిర్‌బస్ ఏ380

మరోవైపు ఎమిరేట్స్ విమాయాన సంస్థ సైతం భారత భూభాగం నుంచి ఎయిర్‌బస్ ఏ380 సర్వీసులను అందించేందుకు సిద్ధంగా ఉంది. విదేశీ విమానయాన సంస్థలు భారత్‌కు ఏ380 విమానాలు నడిపేందుకు 2014 జనవరిలో భారత సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసినదే.

ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ ఏ380 విమానాలు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ భారత్, నేపాల్ కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ ఎస్సా సులేమాన్ అహ్మద్ హైదరాబాద్‌లో జరిగిన ఏవియేషన్ షోలో వెల్లడించారు.

ఎయిర్‌బస్ ఏ380

ఎమిరేట్స్ సంస్థ 45 ఎయిర్‌బస్ ఏ380 విమానాలున్నాయి.

ఎయిర్‌బస్ ఏ380

ఏ380 విమానాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌బస్ తయారు చేస్తోంది.

ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ ఏ380 కోసం ఇప్పటి వరకు 324 విమానాలకు ఆర్డర్లున్నాయి.

ఎయిర్‌బస్ ఏ380

ఇప్పటి వరకు 125 విమానాలను 10 విమానయాన సంస్థలకు సరఫరా చేశారు.

ఎయిర్‌బస్ ఏ380

కాగా.. తాజాగా మరో 25 విమానాలను ఈ ఏడాది డిసెంబరు నాటికి పలు విమానయాన సంస్థలకు కేటాయిస్తారు.

ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ ఏ380 కోసం అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చింది దుబాయి సంస్థ ఎమిరేట్స్. ఇప్పటి వరకు 140 విమానాలకు ఆర్డర్లు ఇచ్చారు.

ఎయిర్‌బస్ ఏ380

ఒక్కో ఎయిర్‌బస్ ఏ380 విమానం ఖరీదు దాదాపు రూ.2,500 కోట్లకు పైమాటే.

ఎయిర్‌బస్ ఏ380

ఏ380 విమానంలో హైదరాబాద్ నుంచి దుబాయికి ఎకానమీ క్లాస్‌ టికెట్ ధర రూ.21 వేలు ఉండొచ్చని అంచనా.

ఎయిర్‌బస్ ఏ380

అదే ఫస్ట్ క్లాస్ (సూట్) టికెట్ ధర అయితే సుమారు రూ.75 వేలకు పైగా ఉండొచ్చు.

ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ ఏ380 విమానంలోని పైలట్ కాక్‌పిట్.

ఎయిర్‌బస్ ఏ380

ఎయిర్‌బస్ ఏ380 విమానం ఇంటీరియర్ లుక్.

More from DriveSpark

Article Published On: Saturday, March 29, 2014, 9:52 [IST]
English summary
A customer A380 as well as models of its full civil aircraft product range will be at the heart of Airbus’ presence at the fourth India Aviation 2014 Airshow in Hyderabad between March 12th-16th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+