విమానాలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా.??.. వీళ్లు చేసే పనికి సెల్యూట్ కొట్టాల్సిందే.!!
విమాన ప్రయాణానికి సంబంధించి ప్రతీ చిన్న విషయం కూడా చాలా కీలకం. అందులో ముఖ్యమైనది ఫ్లైట్ క్లీనింగ్. మీరు విమానం ఎక్కిన ప్రతిసారీ ఫ్లైట్‌లో మీకు కొంచెం చెత్తాచెదారం కూడా కనిపించకుండా చాలా క్లీన్‌గా, సువాసనభరితంగా ఉంటుంది. అయితే విమానాన్ని ఇంత శుభ్రంగా ఎలా ఉంచుతారు.?? దీనికి ఎంత సమయం పడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.??
ప్రపంచవ్యాప్తంగా విమానయాన సర్వీసులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అందుకు తగినట్లుగా అందులో సౌకర్యాలు కూడా చాలా ప్రీమియంగా ఉంటాయి. విలాసంతమైన జర్నీ, అత్యంత తొందరగా గమ్యస్థానానికి చేర్చడం, సరికొత్త ఫ్లైయింగ్ అనుభూతి. అయితే ఇంతటి అద్భుతమైన జర్నీలో విమానంలో క్లీనింగ్‌నెస్ అనేది చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఇందుకు సంబంధించి చిన్న చిన్న విషయాలు కూడా విమానయాన సంస్థలు చూసుకుంటాయి.

మీరు ఫ్లైట్ లోపలికి అడుగుపెట్టిన ప్రతిసారీ(Aeroplane Cleaning), విమానం చాలా శుభ్రంగా ఉంటుంది. విమానాలు ఎల్లప్పుడూ ఇంత పరిశుభ్రంగా ఉండటానికి ముఖ్యమైన కారణం... ఎప్పటికప్పుడు క్లీనర్లు వచ్చి విమానాలను శుభ్రం చేస్తుంటారు. అయితే విమానాలను శుభ్రం చేయడానికి క్లీనర్లు కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. అవేంటంటే..
సాధారణంగా ఎయిర్‌క్రాఫ్ట్(Flight Cleaning) క్లీనింగ్‌ను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి స్వల్ప-దూర విమానాలు కాగా మరొకటి సుదూర విమాన సర్వీసులు. ఒక స్వల్ప-దూర ఫ్లైట్ అనేది రోజుకు రెండు నుండి మూడు సార్లు సర్వీసులు అందిస్తుంది. ఒక సర్వీసు నుంచి మరో సర్వీసుకు మారడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది.
ఈ సమయంలో, క్లీనర్లు విమానంలోకి వచ్చి.. అందులో కనిపించే చెత్తను మొత్తను తొలగించి శుభ్రపరుస్తారు. అదే సమయంలో ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలు, భద్రతా పరికరాలు, వైద్య పరికరాలను ఫ్లైట్‌లో ఏర్పాటు చేస్తారు. అయితే ఇదంతా కేవలం వారు 20 నిమిషాల్లో పూర్తి చేస్తారు. డొమెస్టిక్ విమానాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కాగా డీప్ క్లీనింగ్ అనేది మాత్రం రెగ్యులర్ వ్యవధిలో క్లీనర్లు చేపడతారు.
ఇక మరొకటి.. సుదూర విమానాలు అంటే. అంతర్జాతీయ విమానాలు, ఇంకా రాత్రిపూట ప్రయాణించే విమానాలు. ఇవన్నీ రోజుకు ఒకసారి మాత్రమే సర్వీసును అందిస్తాయి. దీంతో విమానాశ్రయంలోని క్లీనర్లకు ల్యాండింగ్ తర్వాత విమానాన్ని శుభ్రం చేసేందుకు చాలా సమయం ఉంటుంది. అందుకే అంతర్జాతీయ విమానాల్లో క్లీనర్లు డీప్ క్లీనింగ్ చేపడతారు.
దూర ప్రయాణాల వల్ల విమానాల్లో చెత్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిసారీ వెలాసిటీ క్లీనర్ మరియు సబ్బుతో శుభ్రం చేస్తుంటారు. ప్రధానంగా టాయిలెట్‌ను కూడా క్లీనింగ్ చేస్తారు. అయితే అంతర్జాతీయ విమానాలైనా లేక డొమెస్టిక్ సర్వీస్ విమానాలైనా సరే.. నిర్ణీత వ్యవధిలో డీప్ క్లీనింగ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది.
కాగా అంతర్జాతీయంగా సర్వీస్‌ను అందించే విమానాల్లో శుభ్రం చేయడానికి మూడు గంటలు పట్టొచ్చు. ఒక్కోసారి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. తదుపరి విమానం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ప్రస్తుతం విమానాశ్రయంలో క్లీనర్ల సంఖ్య ఎంత? విమానాల సంఖ్యను బట్టి బృందాలను సిద్ధం చేసి తదనుగుణంగా క్లీనింగ్ చేపడతారు. విమానం క్లీనింగ్ పూర్తయిందని నిర్ధారించుకున్న తర్వాతే.. ప్రయాణికులను తదుపరి విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








