ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలు అంతరించిపోతుండటంతో, ఫలితంగా ప్రస్తుతం వాటి ధరలు కూడా అకాశాన్నంటుతుండటంతో ప్రజలు మరియు వాహన తయారీ సంస్థలు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల తయారీపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ప్రస్తుతం, రోడ్లపై అనేక రకాల ఎలక్ట్రిక్ వానాలు అందుబాటులోకి వచ్చాయి. ప్యాసింజర్ మరియు రవాణా వాహన విభాగాల్లో కూడా ఇవి మంచి పాపులారిటీని దక్కించుకుంటున్నాయి. భవిష్యత్తులో రేస్ కార్లు, విమానాల్లో కూడా ఈ తరహా ఎలక్ట్రిక్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించాలని తయారీదారులు చూస్తున్నారు.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఈ ఆలోచల నుంచి పుట్టుకొచ్చినదే ఈ ప్రపంచపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ రేస్ కార్. దీని పేరు "ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3", కంపెనీ ఇటీవలే ఈ ఫ్లైయింగ్ రేస్ కారుని అధికారికంగా ఆవిష్కరించింది. ఇదొక ఫుల్ సైజ్ ఎలక్ట్రిక్ విటిఓఎల్ (వెర్టికల్ టేక్-ఆఫ్ ల్యాండింగ్) వెహికల్. అంటే, ఇది ఉన్న చోటు నుండే నిటారుగా గాలిలోకి, తిరిగి నిటారుగా నేలపై ల్యాండ్ కాగలదు.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3 ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ రేస్ కారుని గాలిలోకి ఎగిరించడానికి రన్‌వే అవసరం ఉండదు. దీనిని ఎక్కడ ఉంటే, ఆ చోటు నుండే టేకాఫ్ లేదా ల్యాండింగ్ చేయవచ్చు. ఇది 2021 ద్వితీయ భాగంలో ఈ రకమైన మొదటి ఫ్లయింగ్ కార్ రేసింగ్ సిరీస్‌లో పోటీపడనుంది.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఈ సిరీస్‌లో రిమోట్ కంట్రోల్డ్ మానవరహిత ఎయిర్ స్పీడర్ ఎమ్‌కె 3 రేస్ కార్లు ఉంటాయి. అంటే, ఈ రేస్‌లో పాల్గొనే వారందరూ రిమోట్ కంట్రోల్స్ సాయంతో వీటిని ట్రాక్‌పై ఆపరేట్ చేస్తుంటారు. ఎయిర్‌స్పీడర్ అనుబంధ సంస్థ అలోడా ఏరోనాటిక్స్ రిమోట్ కంట్రోల్డ్ రేస్ సిరీస్ కోసం 10 ఎమ్‌కె3 వాహనాలను నిర్మిస్తుంది.

MOST READ:రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఈ సిరీస్‌లో మానవ సహిత రేసింగ్ కోసం కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు, ఇది 2022లో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఉపయోగించే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ రేస్ కార్లలో మాత్రం మనుషులు ఉంటారు.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3 ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ రేస్ కారు అభివృద్ధి కోసం ఈ కంపెనీ ఆటోమోటివ్ మరియు ఏరోస్పేస్ పరిశ్రమలోని తయారీదారులైన మెక్లారెన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, రోల్స్ రాయిస్, బ్రాహం, బోయింగ్ మరియు బాబ్‌కాక్ ఏవియేషన్‌తో సహా కొన్ని ఇతర బ్రాండ్ల సహాయాన్ని కూడా పొందారు.

MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3 ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ రేస్ కారు గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల (గంటకు 75 మైళ్ల) వేగంతో ప్రయాణిస్తుంది. నాలుగు ప్రొపెల్లర్లతో కూడిన ఈ క్వాడ్‌కాప్టర్ స్టాండర్డ్ హెలికాప్టర్ లేదా చిన్నసైజు రెక్కల విమానం కంటే వేగంగా ప్రయాణించగలదు. ఈ మెషీన్ కేవలం 130 కిలోల బరువును మాత్రమే కలిగి ఉండి, గరిష్టంగా 429 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఈ ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3 గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి కేవలం 2.8 సెకన్లు మాత్రమే పడుతుందని కంపెనీ పేర్కొంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న సూపర్ కార్ల వేగం కన్నా ఎక్కువ. క్విక్ రిలీజ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నందున, ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కె3లో బ్యాటరీ మార్పిడుల కోసం పిట్‌స్టాప్‌లు కూడా తక్కువ సమయం తీసుకుంటాయి.

MOST READ:బైకర్స్‌ తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి.. లేకుంటే?

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3 రాకతో సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందుతుందని ఎయిర్ స్పీడర్ మరియు అలోహా ఏరోనాటిక్స్ వ్యవస్థాపకుడు మాథ్యూ పియర్సన్ అన్నారు. ఇది క్లీన్ ఎయిర్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటుగా లాజిస్టిక్స్ మరియు మెడికల్ అప్లికేషన్ల కోసం అధునాతన ఎయిర్ మొబిలిటీకి అనుమతిస్తుందని ఆయన చెప్పారు.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

ఎయిర్‌స్పీడర్ ఎమ్‌కే3 తయారీలో దాని ఫ్రేమ్ మరియు ఇతరప్రధాన భాగాలలో ఎక్కువగా కార్బన్ ఫైబర్ పదార్థాలను ఉపయోగించారు. ఫలితంగా ఈ ఫ్లయింగ్ రేస్ కార్ బరువు చాలా తేలికగా ఉంటుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బరువును తక్కువగా ఉంచడం వలన దీని పనితీరు మరియు సామర్థ్యాలు మెరుగుపడుతాయని కంపెనీ చెబుతోంది.

ఎగిరే కార్లు ఎంతో దూరంలో లేవు; ఎయిర్ స్పీడర్ ఎమ్‌కే3 ఆవిష్కరణ; త్వరలో లాంచ్!

సేఫ్టీ కోసం ఇందులో లిడార్ మరియు రాడార్ వ్యవస్థలు కూడా ఉంటాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ రేస్ కార్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Airspeeder MK3 - The Worlds First Electric Race Car To Be Launched In 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X